వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ ప్రత్యక్షమైన అబు బకర్.. ఐదేళ్ల తర్వాత కనిపించిన ఐసీస్ చీఫ్...

|
Google Oneindia TeluguNews

ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ అధినేత అబు బకర్ అల్ బగ్దాది మరోసారి ప్రత్యక్షమయ్యాడు. అతడు చనిపోయాడని అంతా అనుకుంటున్న తరుణంలో ఐదేళ్ల తర్వాత తాజాగా ఓ వీడియోలో కనిపించాడు. ఐసీస్ ఉగ్రసంస్థ సోమవారం విడుదల చేసిన ఈ వీడియోలో అబు బకర్ కనిపించాడు. అయితే దాన్ని ఎప్పుడు షూట్ చేశారన్న విషయంపై మాత్రం కచ్చితమైన సమాచారం లేదు.

ఐసీస్ విడుదల చేసిన వీడియోలో అబు బకర్ అల్ బాగ్దాది సిరియాలో ఉగ్రస్థావరం బాగౌజ్ కోసం నెలల తరబడి సాగిన పోరాటం గురించి ప్రస్తావించాడు. బాగౌజ్ కోసం పోరాటం ముగిసిందంటూ తన ఎదురుగా కూర్చున్న వారికి చెప్పాడు. ఇటీవల శ్రీలంకలో జరిగిన వరుస పేలుళ్ల గురించి మాట్లాడిన అబు బకర్.. మారణహోమం సృష్టించిన వారిని ప్రశంసించాడు.

శ్రీలంక ఆత్మాహూతి దాడుల సూత్రధారి తండ్రి కాల్చివేతశ్రీలంక ఆత్మాహూతి దాడుల సూత్రధారి తండ్రి కాల్చివేత

ISIL chief Abu Bakr al-Baghdadi reappears in video

నల్లని దుస్తులు ధరించి పక్కన రైఫిల్‌తో కూర్చున్న అబు బకర్ వీడియోలో దాదాపు 18 నిమిషాల పాటు మాట్లాడాడు. 2014 తర్వాత అతను కనిపించడం ఇదే తొలిసారి. ఇరాక్ - సిరియాల్లో నరమేథానికి పాల్పడుతున్న అబు బకర్‌ను మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించిన అమెరికా అతన్ని పట్టించిన వారికి 25 మిలియన్ డాలర్లు ఇస్తామని చెప్పింది. ఆ తర్వాత అబు బకర్ చనిపోయినట్లు వార్తలు రావడం, కొన్నేళ్ల పాటు కనిపించకుండా పోవడంతో అతని జాడ మిస్టరీగా మారింది. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోతో అబు బకర్ అల్ బాగ్దాదీ ఇంకా బతికే ఉన్నాడని స్పష్టమైంది.

English summary
After Five years Islamic state leader Abu Bakr al-Baghdadi On Monday, reappeared, leaning on a cushion with an assault rifle at his side, in a video seeking to rally his followers after the loss of the group’s territory in Iraq and Syria and its execution of one of the deadliest terrorist attacks in years, on Easter in Sri Lanka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X