వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆప్ఘన్ లో మరో అంతర్యుద్ధం-ఐసిస్ దాడిలో 35 మంది తాలిబన్ల హతం-కొత్త గేమ్ షురూ

|
Google Oneindia TeluguNews

ఆప్ఘనిస్తాన్ లో తాజాగా పంజ్ షీర్ లో ప్రతిఘటన దళాలతో తాలిబన్ల అంతర్యుద్ధ పోరు ముగిసిందని భావిస్తున్న తరుణంలో ఐసిస్ తీవ్రవాదులు చెలరేగిపోతున్నారు. గతంలో తాలిబన్లతో కలిసి పనిచేసిన వీరంతా ఇప్పుడు వారికి అధికారం రాగానే శత్రువులుగా మారిపోయి వారిపైనే విరుచుకుపడుతున్నారు. ఇఫ్పటికే కాబూల్ ఎయిర్ పోర్టులో దాడి చేసిన ఐసిస్ తీవ్రవాదులు.. తాజాగా జలాలాబాద్ లో ఆత్మాహుతి దాడులకు పాల్పడి 35 మంది తాలిబన్లను హతమార్చారు. దీంతో ఆప్ఘన్ లో మరో అంతర్యుద్ధం మొదలైనట్లయింది

ఆప్ఘన్ లో మరో అంతర్యుద్ధం

ఆప్ఘన్ లో మరో అంతర్యుద్ధం

ఆప్ఘనిస్తాన్ మరోసారి అంతర్యుద్ధం బారిన పడుతోంది. తాజాగా నెలకొన్న పరిస్ధితులతో తాలిబన్ల సర్కారు ఏర్పాటు అయినా ఒకదాని వెంట మరో అంతర్యుద్ధాలు మాత్రం తప్పేలా లేవు. నిన్న మొన్నటివరకూ పంజ్ షీర్ లో తాలిబన్లు వర్సెస్ ప్రతిఘటన దళాలుగా సాగిన అంతర్యుద్ధం ఇప్పుడు కాస్తా రూపు మార్చుకుని తాలిబన్లు వర్సెస్ ఉగ్రవాద సంస్ధ ఐసిస్ గా మారుతోంది. దీంతో ఇప్పుడు తాలిబన్లకూ, ఐసిస్ కు మధ్య సాగుతున్న పోరులో ఆప్ఘన్ పౌరులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకని బతకాల్సిన పరిస్ధితి నెలకొంటోంది.

వరుస దాడులతో ఐసిస్ హల్ చల్

వరుస దాడులతో ఐసిస్ హల్ చల్

ఆప్ఘనిస్తాన్ లో ఐసిస్ -కె తీవ్రవాద సంస్ధ వరుస దాడులకు పాల్పడుతోంది. ఈ మధ్య కాబూల్ ఎయిర్ పోర్టుపై దాడి చేసి యూఎస్ బలగాలతో పాటు తాలిబన్ ఫైటర్లనూ, సాధారణ పౌరుల్నీ బలిగొన్న ఐసిస్ ఉగ్రవాదులు.. ఇప్పుడు తాలిబన్లపై జలాలాబాద్ లో జరిపిన ఆత్మాహుతిదాడులు భీతావహంగా ఉన్నాయి. ఈ దాడుల్లో ఏకంగా 35 మంది తాలిబన్ ఫైటర్లు చనిపోయారంటే పరిస్ధితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. తాలిబన్ ఫైటర్లు ప్రయాణిస్తున్న వాహనాలపై ఐసిస్ ఈ ఆత్మాహుతి దాడులు జరిపింది. ఇందులో పలువురు క్షతగాత్రులు కూడా అయ్యారు.

 తాలిబన్లు వర్సెస్ ఐసిస్

తాలిబన్లు వర్సెస్ ఐసిస్

ఆప్గనిస్తాన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఐసిస్ వారితో విభేదిస్తూ వస్తోంది. ఇదే కారణంతో తాలిబన్లను టార్గెట్ చేస్తోంది. తాలిబన్లతో పోలిస్తే అత్యాధునిక ఆయుధాలు కలిగిన ఐసిస్ ఉగ్రవాదులు.. రెచ్చిపోతున్నారు. ఏకంగా ఆత్మాహుతి దాడులతోనే తాలిబన్లపై విరుచుకుపడుతున్నారు. దీంతో ప్రభుత్వాన్ని నడుపుతున్న తాలిబన్లు ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్ధితికి చేరుకుంటున్నారు. ఐసిస్ ఉగ్రవాదుల్ని అణచివేస్తే తప్ప పాలన సాఫీగా సాగదని భావిస్తున్న తాలిబన్లు ఎక్కడికక్కడ వారిని కట్టడిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Recommended Video

Rashid Khan Steps Down As Afghanistan Captain | ACB | T20 WC Squad || Oneindia Telugu
తాలిబన్, ఐసిస్ అంతర్యుద్ధానికి కారణాలివే..

తాలిబన్, ఐసిస్ అంతర్యుద్ధానికి కారణాలివే..


తాలిబన్లతో ఐసిస్ సాగిస్తున్న పోరు వెనుక రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధానమైనది మతపరమైన అంశాలు కాగా.. రెండవది వ్యూహాత్మక ఆధిపత్య పోరు. తాలిబన్లూ, ఐసిస్ ఇద్దరూ సున్నీ ఇస్లామిక్ గ్రూపులే కావడంతో అధికారం సహా పలు అంశాల్లో వారి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. వాస్తవానికి ఆప్ఘనిస్తాన్ ను యూఎస్ బలగాలు వీడకముందే వీరి మధ్య అంతర్యుద్ధం సాగుతోంది. కానీ ఓసారి యూఎస్ బలగాలు వెళ్లిపోయాక కాస్త శాంతించినట్లు కనిపించిన ఐసిస్ ముష్కరులు తిరిగి తాలిబన్లను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతానికి ఐసిస్ ప్రపంచవ్యాప్తంగా జిహాద్ కు పిలుపునిస్తుండగా.. తాలిబన్లు మాత్రం ఆప్ఘన్ పునర్నిర్మాణంపై దృష్టిపెట్టారు. కానీ ఐసిస్ జరుపుతున్న దాడులతో వారికి సలు కొత్త సవాళ్లు తప్పడం లేదు. దీంతో తాలిబన్ల దృష్టి ఇప్పుడు విదేశీ సాయం తీసుకుని అయినా ఐసిస్ ను నియంత్రించడంపైనే ఉంది.

English summary
after 35 taliban fighters killing in jalalabad suicide attacks by isis there is another internal war like situation prevailed in afghanistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X