వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చర్మం తినే పరాన్నజీవులు: వణికిస్తున్న ఐసిస్ టెర్రరిస్ట్స్‌కు వ్యాధి

By Srinivas
|
Google Oneindia TeluguNews

సిరియా: ప్రపంచాన్ని వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులును పరాన్న జీవులు వణికిస్తున్నాయి! ఐసిస్ ఉగ్రవాదులు మాంసం తినే ఓ వైరస్ వల్ల జబ్బున పడుతున్నారని తెలుస్తోంది. చుట్టు ఉన్న అపరిశుభ్ర పర్యావరణం వల్ల ఆ వ్యాధి వేగంగా వ్యాప్తిస్తోందని తెలుస్తోంది.

ఈ వ్యాధికి సంబంధించి దాదాపు లక్ష కేసుల వరకు నమోదయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వ్యాధిని లీష్మానియాసిస్ అంటారు. ఈ వైరస్ వల్ల మనిషి చర్మం మీద మాంసం బయటకు కనిపించేలా గాయాలు ఏర్పడతాయి.

ISIS to be wiped out by deadly flesh-eating disease?

ఈ వ్యాధికి అవసరమైన చికిత్స చేయకుంటే ఇది ప్రాణాంతకం కూడా కావొచ్చునని తెలుస్తోంది. అయితే, ఐసిస్ ఫైటర్స్ బయటకు వచ్చి చికిత్సకు నిరాకరిస్తున్నారని తెలుస్తోంది. దీంతో వారికి ఇది ఇబ్బందికర పరిణామమేనని తెలుస్తోంది.

ఇస్లామిక్ స్టేట్ రాజధాని, సిరియా వార్ టౌన్ రక్కాలో ఇది అత్యంత ప్రమాదకరంగా పరిణమించిందని చెబుతున్నారు. ఐసిస్ దుశ్చర్యల నేపథ్యంలో చాలామంది పారిపోయారు. అందులో మెడికల్ సెంటర్స్ కూడా ఉన్నాయి. దీంతో అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులో లేరని సమాచారం.

స్థానికంగా కొందరు ఉన్నప్పటికీ వారికి కొంత అనుభవం మాత్రమే ఉందని తెలుస్తోంది. వారు కూడా నిరాకరిస్తున్నారని సమాచారం. దీంతో ఈ వ్యాధి విస్తృతంగా వ్యాప్తి చెందుతోందని సమాచారం. లీష్మానియాసిస్ వ్యాధి శాండ్ ఫ్లైస్ అనే ఓ పరాన్న జీవుల వల్ల వస్తోంది.

English summary
The fearsome Islamic State fighters are getting a dose of their own medicine, with many falling to an enemy no bigger than a fly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X