వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాగ్దాది ఆత్మహత్య చేసుకున్నాడా? అమెరికా సైన్యం చేతుల్లో చావకూడదనే

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: భయానక ఉగ్రవాద సంస్థ ఐసిస్ అధినేత అబు బాకర్ అల్-బాగ్దాది హతమైనట్లు వచ్చిన వార్తల్లో కొత్త కోణం ఒకటి బహిర్గతమైంది. బాగ్దాది ఆత్మహత్య చేసుకున్నట్లు తాజా వార్తలు వెలువడ్డాయి. అమెరికా సైనిక బలగాల చేతుల్లో హతం కాకూడదనే ఉద్దేశంతో బాగ్దాది బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని విదేశీ మీడియా అభిప్రాయపడింది. సిరియాలోని ఇడ్లిస్ ప్రావిన్స్ లో తన స్థావరాన్ని అమెరికా బలగాలు చుట్టుముట్టడంతో తనకు మరణం తప్పదని భావించిన అతను ఆత్మహత్య చేసుకున్నాడనే కోణాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ దీన్ని ఇంకా ధృవీకరించాల్సి ఉంది.

 హత్యా? ఆత్మహత్యా?

హత్యా? ఆత్మహత్యా?

బాగ్దాది మరణంతో ఐసిస్.. కథ ముగిసినట్టేనని భావిస్తున్నారు. ఇస్లామిక్ స్టేట్స్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్) పేరుతో ప్రపంచాన్ని వణికించిన ఆ ఉగ్రవాద సంస్థ అధినేత అబు బాకర్ అల్-బాగ్దాదిని అమెరికా సైనిక బలగాలు హతమార్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ అధికారి ఒకరు ఓ ప్రకటన విడుదల చేశారు. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేయనున్నారు. బాగ్దాదీ హతమైనట్లు డొనాల్డ్ సూచనప్రాయంగా వెల్లడించారు. దీన్ని ఇంకా ఆయన ధృవీకరించాల్సి ఉంది.

లాడెన్ లేని లోటును భర్తీ చేయడానికి..

లాడెన్ లేని లోటును భర్తీ చేయడానికి..

అమెరికా సైనిక బలగాల కాల్పుల్లో బాగ్దాదీ మరణించాడా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అనే విషయంపై ఓ నిర్ధారణకు వచ్చిన తరువాత డొనాల్డ్ ట్రంప్.. అధికారిక ప్రకటన విడుదల చేస్తారని అంటున్నారు. ఇరాక్ లో జన్మించిన బాగ్దాది.. ప్రారంభంలో మత పెద్దగా వ్యవహరించాడు. ఓ మౌల్వీగా మసీదులో కార్యకలాపాలను నిర్వహించాడు. క్రమంగా ఉగ్రవాద భావజాలాన్ని పుణికి పుచ్చుకున్నాడు. లాడన్ హతమైన తరువాత అల్ ఖైదా నిర్వీర్యమైపోవడంతో ఆ స్థాయిలో ఐసిస్ ను విస్తరించేలా తన నెట్ వర్క్ ను రూపొందించుకున్నాడు. భారత్ సహా పలు దేశాల్లో ఐసిస్ జాడలు కనిపించిన విషయం తెలిసిందే.

2014లో ఐసిస్ స్థాపన.. చాపకింద నీరులా

2014లో ఐసిస్ స్థాపన.. చాపకింద నీరులా

2014లో ఇరాక్ నుంచి సిరియాకు వెళ్లిన అనంతరం బాగ్దాది విస్తృతంగా ఉగ్రవాద కార్యకలాపాలను చేపట్టారు. అల్ ఖైదా లేని లోటును భర్తీ చేయడానికి ప్రత్యామ్నాయంగా ఐసిస్ ను తెర మీదికి తీసుకొచ్చారు. ప్రత్యర్థులను చిత్రహింసలకు గురి చేసి హత్య చేయడంలో ఐసిస్ పేరు తెచ్చుకుంది. దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేయడం ద్వారా ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది. బాగ్దాదీ ఆచూకీ తెలిపిన వారికి అమెరికా ప్రభుత్వం భారీగా నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. అతని తలపై 25 మిలియన్ డాలర్ల బహుమానాన్ని ప్రకటించింది.

విదేశీ మీడియా ఏం చెబుతోంది?

విదేశీ మీడియా ఏం చెబుతోంది?

ఐసిస్ ను అడ్డుకోవడంలో భాగంగా ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్ బలగాలు సిరియాలో మకాం వేశాయి. అక్కడి ప్రభుత్వ సహకారంతో ఐసిస్ కోరలను పీకాయి. ఇడ్లిస్ ప్రావిన్స్ కు మాత్రమే పరిమతం చేస్తూ వచ్చాయి. తాజాగా- బాగ్దాదీని హతమార్చడం ద్వారా ఐసిస్ ను నామరూపాల్లేకుండా చేసినట్టయిందని అంటున్నారు. కాగా- బాగ్దాదీ మరణించిన విషయంలో భిన్నాభిప్రాయాలను విదేశీ మీడియా వ్యక్తం చేస్తోంది. అతను ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని చెబుతోంది. అమెరికా సైనిక బలగాలు చుట్టుముట్టిన అనంతరం.. వారి చేతుల్లో మరణించడం కంటే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని వెల్లడించింది. దీన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

English summary
ISIS chief Abu Bakr al-Baghdadi was believed to be dead after a US military raid in Syria's Idlib region, US media reported early Sunday. Baghdadi may have killed himself with a suicide vest as US special operations forces descended, media said citing multiple government sources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X