వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ సరిహద్దుల్లో ఐసిస్: బంగ్లాదేశ్‌లో పూజారి హత్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఢాకా: బంగ్లాదేశ్‌లో ప్రధాన హిందూ పూజారిని తుపాకులు, కత్తులతో దుండగులు దారుణంగా హత్య చేశారు. భారత్‌ సరిహద్దుల్లోని పంచగఢ్‌ జిల్లా శాంతగౌరియో ఆలయ పరిసరాల్లో ఆదివారం నాడు ఈ ఘటన జరిగింది.

ఇస్లామిక్‌‌వాదులుగా అనుమానిస్తున్న ముగ్గురు దుండగులు ఆలయ పరిసరాల్లోకి బైక్ పైన వచ్చారు. అనంతరం దేవాలయంపైకి రాళ్లు రువ్వారు. దీంతో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు పూజారి జోగేశ్వర్ దశ దికారి బయటకు వచ్చారు. వెంటనే ఆ దుండగులు పూజారిపై దాడికి దిగారు. కత్తితో ఆయన గొంతు కోశారు.

Isis claims responsibility for killing of Hindu priest in Bangladesh

కాగా, ఇరాక్, సిరియాల్లో దారుణాలకు పాల్పడుతున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్) ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. పూజారిని హతమార్చింది తామేనని ఐసిస్ ప్రకటించింది. ఈ హత్యకు తామే కారణమని సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో ఐసిస్ ప్రకటించింది.

చనిపోయిన పూజారీ బంగ్లాదేశ్ పంజాగఢ్‌లోని దేవీ గంజ్ ఆలయంలో జోగేశ్వర్ (55) పూజారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఐసిస్ ఉగ్రవాదులు కత్తులతో గొంతు కోయడంతో ఆ పూజారి అక్కడికక్కడే చనిపోయారు. యోగేశ్వర్‌ను కాపాడేందుకు యత్నించిన ఓ భక్తుడిపైనా విరుచుకుపడ్డ ఉగ్రవాదులు అతడిని గాయపర్చి పరారయ్యారు.

English summary
In an attempt to terrorise the religious minority, unidentified persons attacked a Hindu temple, murdered a priest and shot and badly wounded a devotee in northern Bangladesh early on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X