ఐఎస్ఐఎస్ ఘాతుకం: మంత్రాలు చేస్తున్నాడని బహిరంగంగా తల నరికేశారు
తిక్రిక్: ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ మరో దారుణానికి పాల్పడింది. మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో ఓ వ్యక్తిని ప్రజల మధ్యలో కూచోబెట్టి తలనరికేశారు. ఈ ఘటన ఇరాక్ దేశంలోని తిక్రిత్ పట్టణంలో చోటు చేసుకుంది. తిక్రిత్‌ను ఇరాక్ సైన్యం చేసుకున్నప్పటికీ అక్కడే తిష్టవేసిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరాచకాలు మాత్రం ఆగడం లేదు.
తాంత్రిక పూజలు చేస్తున్నాడని ఆరోపిస్తూ ఓ నడి వయస్కుడిని నడిబజారులో తల నరికి చంపేశారు. ఆ దృశ్యాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించడం విచారకరం. కాగా, ఆ దృశ్యాలను ఫొటోలు తీసి సామాజిక వెబ్‌సైట్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు ఉగ్రవాదులు.

'డీ గెర్రీ అబూ బకర్ అల్ బ్రిటాని'గా చెప్పుకుంటున్న ఓ ఉగ్రవాది పోస్టు చేసిన రెండు ఫొటోల్లో ఒకదానిలో నడివయస్కుడు జంతువులను హలాల్ చేసే మొద్దు మీద తల పెట్టి ఉండగా, నల్ల దుస్తులు ధరించిన ఉగ్రవాది 18 అంగులాల కత్తి పెకైత్తి పట్టుకొని కనిపిస్తున్నాడు.
రెండో ఫొటోలో రక్తం ఓడుతున్న ఆ వ్యక్తి మొండెం, దాని వెనకే తెగిపడిన తలకాయ కనిపిస్తోంది. చిల్లర దొంగతనాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో కూడా ఎంతో మందికి సున్నీ ఉగ్రవాదులు ఇలాంటి దారుణ శిక్షలు విధిస్తున్నారు. అనేక మంది అమాయకుల ప్రాణాలను తీస్తున్నారు.












Click it and Unblock the Notifications