వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆమెను చంపితే మిలియన్ డాలర్లను బహుమతిగా ఇస్తాం, కనీసం ఆమె ఆచూకైనా తెలపండి

కుర్థీష్ -దానిష్ యువతి పలానీ ని చంపిన వారికి మిలియన్ డాలర్లు ఇస్తామని ఐసిస్ ప్రకటించింది. కనీసం ఆమె ఆచూకైనా తెలపాలని ఐసిసి కోరుతోంది.ఐసిసికు వ్యతిరేకంగా ఆమె పోరాటం చేస్తోంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లండన్ :కుర్థీష్- దానిష్ యువతి పలానీ ని చంపిన వారికి మిలియన్ డాలర్లు ఇస్తామని ఐసిస్ ప్రకటించింది. కనీసం ఆమె ఆచూకైనా తెలపాలని ఐసిసి కోరుతోంది.ఐసిసికు వ్యతిరేకంగా ఆమె పోరాటం చేస్తోంది. ఉగ్రవాదులను హతం చేసింది.దీన్ని ఐసిసి తీవ్రవాదులు జీర్ణించుకోవడం లేదు.

యూనివర్శిటీ విద్యను మద్యలోనే వదిలేసిన జోనా పలానీ అనే యువతి కుర్థీష్ మహిళ, 2014 లో ఆమె ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రారంభించింది. ఈ పోరాటంలో ఆమె పలువురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది.

isis offers $1 million for head of kurdish woman

ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఆమె పోరాటం చేస్తోన్న తీరుతో ఆమె ప్రఖ్యాతి చెందారు. ఆమెను ఏ రకంగానైనా హత్య చేయాలని ఐసిసి భావిస్తోంది. ఆమెను హత్య చేసిని వారికి మిలియన్ డాలర్లు ఇస్తామని ఐసిసి ప్రకటించింది.

ఆమె ప్రస్తుతం కోపెన్ హగన్ జైలులో ఉన్నారు. 2015 జూన్ లో ఆమెను ఎక్కడికి వెళ్ళోద్దంటూ డెన్మార్క్ ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే ఆ నిషేదాన్ని అతిక్రమించిందని ఆమెను జైలులో పెట్టారు. రేపటి నుండి ఈ కేసుపై విచారణ మొదలుకానుంది.

ఈ కేసు రుజువైతే ఆమెకు రెండేళ్ళ పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. పలానీకి బెదిరింపులు రావడం ఇది తొలిసారి కాదు. తాను సైనికురాలిగా పనిచేస్తే డెన్మార్క్ , ఇతర దేశాలకు ఎందుకు ఇబ్బంది అనిపిస్తోందో అర్థం కావడం లేదని ఆమె ప్రశ్నించింది. డెన్మార్క్ కూడ ఐసిస్ కు వ్యతిరేకమే కదా ఆని ఆమె తన ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. చదువును మద్యలోనే ఆపివేసి ఆమె ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు కుర్థీష్ సేనల్లో చేరింది.

English summary
isis has offered a 1 $ million reward for the killing of kurdish-danish woman who dropped out of university in 2014 to fight the terror group in syria and iraq.23 years old joanna palani is currently behind bars and facing trial in copenhagen for leaving country after 12 month travel ban imposed in june 2015.her trial begins tomorrow .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X