వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐసిస్ ఫత్వా: మహిళా బానిసలతో సెక్స్ ఎలా చేయాలంటే

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: మహిళా బానిసలతో యజమానులు జరిపే శృంగారానికి సంబంధించి వివరణతో కూడిన ఐసీస్ జారీ చేసిన ఫత్వా (ఉత్తర్వు) ఒకటి వెలుగు చూసింది. ఇరాక్, సిరియా దేశాల్లోని మహిళలపై లైంగిక హింస జరుగుతోందన్న వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ ఫత్వాకు ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇస్లామిక్ స్టేట్‌కి చెందిన పరిశోధన, ఫత్వా కమిటీ 2015 జనవరి 29న ఈ ఫత్వా (64) జారీచేసింది. గత మే నెలలో సిరియాలోని ఐసిస్ ఉన్నతాధికారి ఇంట్లో అమెరికా ప్రత్యేక బలగాలు జరిపిన దాడిలో దొరికిన పత్రాల్లో ఈ ఫత్వా కూడా ఉంది.

బందీలుగా చిక్కిన మహిళల పట్ల ఐసిస్ ఈ నిబంధనలను జారీ చేసింది. ఇరాక్, సిరియాలో మహిళల లైంగిక బానిసత్వాన్ని సమర్ధించేందుకు చట్టబద్ధ ఉత్తర్వుగా ఫత్వాను జారిచేసిందని ముస్లిం స్కాలర్‌ ఒకరు తెలిపారు. ఒక మహిళ బానిసతో తండ్రి, కొడుకులిద్దరూ శృంగారం జరపడం నిషేధిస్తున్నట్లు ఈ ఫత్వాలో పేర్కొంది.

ISIS Ruling Aims To Settle Who Can Have Sex With Female Slaves

అంతేకాదు ఒక యాజమాని తన బానిసలైన తల్లి, కూతురు ఇద్దరితో లైంగికంగా కలవడాన్ని కూడా నిషేధించింది. అయితే ఒక మహిళకు ఇద్దరు యాజమానులు ఉంటే ఆ ఇద్దరూ ఆమెతో గడుపవచ్చునని, ఆమెను వారి ఉమ్మడి భాగస్వామ్య ఆస్తిగా పరిగణించాల్సి ఉంటుందని ఫత్వాలో పేర్కొంది.

12 సంవత్సరాలు, ఆపై వయసు కలిగిన బాలికలు, మహిళలను అపహరించి, వారిపై లైంగిక అకృత్యాలకు పాల్పడుతున్నట్లు ఐక్యరాజ్య సమితి ఆరోపిస్తోంది. ఉత్తర ఇరాక్‌లోని మైనారిటీ తెగ అయిన యాజిది మహిళలను పెద్ద ఎత్తున అపహరించి ఐసిస్ ఆగడాలకు పాల్పడుతుందని అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ ఆరోపించింది.

ISIS Ruling Aims To Settle Who Can Have Sex With Female Slaves

ఇలా అహరించిన మహిళలను ఐసిస్ తన ఫైటర్లకు బహుమతిగా ఇవ్వడం లేదా వారిని సెక్సు బానిసలుగా అమ్మేస్తున్న సంగతి తెలిసిందే. ఇందు కోసం ఐసిస్ ఏకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసిన సెక్స్ బానిసల అంశాన్ని పర్యవేక్షిస్తోంది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఐసీస్ చెర నుంచి తప్పించుకొన్న 20 మంది యువతులు సెక్సు బానిసలుగా ఎటువంటి లైంగిక హింసను ఎదుర్కొన్నారో అంతర్జాతీయ మానవ హక్కుల సంస్ధకు కళ్లకు కట్టినట్టు మనకు వివరించింది. ఇరాక్, సిరియా దేశాల్లోని పలు ప్రాంతాలకు తిప్పుతూ వారిపై లైంగిక కోర్కెలను తీర్చుకున్నారు.

English summary
ISIS theologians have issued an extremely detailed ruling on when "owners" of women enslaved by the extremist group can have sex with them, in an apparent bid to curb what they called violations in the treatment of captured females.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X