వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిట్లర్ సూపర్: భారత సంతతి జిహాది సిద్

|
Google Oneindia TeluguNews

లండన్: భారత సంతతికి చెందిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాది సిద్ధార్థ్ ధార్ అలియాస్ జిహాదీ సిద్ (32) అనే వ్యక్తి జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ మీద ప్రశంసల జల్లు కురిపించాడు.

తనను తాను పరిచయం చేసుకుంటున్న విధంగా ఉన్న ఈ వీడియోను అతను 2014లో యూ ట్యూబ్ లో పెట్టాడని అధికారులు అంటున్నారు. ఆ వీడియోలో యూదులు, యూదుమతవాదంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు.

యూదుల విష గ్రంధాలను ఇతర వ్యక్తులు సైతం పసిగట్టారని, వాటిని నిలువరించేందుకు ప్రయత్నించారని, అందులో హిట్లర్ ముందు వరుసలో ఉండేవారని జిహాదీ సిద్ జర్మనీ నియంత హిట్లర్ ను కొనియాడాడు.

ISIS Siddhartha Dhar praises Hitler in Islamic State video

1909లో నాటి ప్రోట్ కాల్స్ ఆఫ్ ద ఎల్టర్స్ ఆఫ్ జియాన్ గ్రంథం ప్రపంచ వ్యాప్తంగా యూదుల ఆధిపత్యాన్ని ప్రబోధించిందని, మానవత్వంపై యుదులకు ఉన్న విద్వేషాన్ని ఇది చాటుతుందని జిహాదీ సిద్ పేర్కోన్నాడు.

జిహాదీ సిద్ గతంలో బ్రిటన్ లో సేల్స్ మన్ గా ఉద్యోగం చేశాడు. తరువాత ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల అరాచకాలకు ఆకర్షితుడై సిరియా వెళ్లి అక్కడ వారితో కలిసి ఫైటర్ గా పని చేస్తున్నాడు. బంధీల తలలు నరికిన వారిలో జిహాదీ సిద్ కూడా ఉన్నాడని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Dhar had been arrested in September 2014 as part of an investigation into alleged support of the banned extremist group Al Muhajiroun.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X