వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

19 మంది హిందువులను సిక్కులను చంపింది మేమే: ఐసిస్

|
Google Oneindia TeluguNews

తూర్పు ఆఫ్ఘానిస్తాన్‌లో నిన్న జరిగిన ఆత్మాహుతి దాడికి బాధ్యులం తామేనంటూ ప్రకటించింది ఇస్లామిక్ స్టేట్ గ్రూప్. అఫ్ఘానిస్తాన్ దేశాధ్యక్షుడు అష్రాఫ్ గనితో జలాలాబాద్‌లో సమావేశం అయ్యేందుకు ప్రయాణిస్తున్న మైనార్టీ వర్గాలకు చెందిన బృందంపై ఐసిస్ విరుచుకుపడింది. దీంతో 19 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఎక్కువ మంది సిక్కులు హిందువులు ఉన్నారు. అవతార్ సింగ్ ఖాల్సా అనే సిక్కు మతానికి చెందిన నాయకుడు ఈ దాడిలో మృతిచెందారు.

ఈ దాడికి పాల్పడింది తామే నంటూ ఐసిస్ ప్రకటన విడుదల చేసింది. తమ దేశంలో ముస్లింయేతర వ్యక్తులను టార్గెట్ చేశామంటూ ప్రకటనలో తెలిపారు. ముస్లిం దేశమైన అఫ్ఠానిస్తాన్‌లో సిక్కులు, హిందువులు తక్కువ శాతంలో నివసిస్తున్నారు. అయితే అక్కడ వారు పలు రకాలుగా అవమానాలకు గురవుతున్నారు. దీంతో ఐసిస్ వారిని టార్గెట్ చేయగా ఇప్పటికే చాలామంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. 1970లో మైనార్టీలుగా ఉన్న సిక్కులు హిందువుల జనాభా ఆ దేశంలో 80 వేలు ఉండగా... నేటికి ఆ సంఖ్య వెయ్యికి చేరుకుంది. ఐసిస్ దాడిలో మృతి చెందిన వారికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రగాఢ సంతాపం తెలిపారు.

Isis stakes claim for Afghanistan attack
English summary
The Islamic State group has claimed responsibility for a suicide bombing in eastern Afghanistan that killed at least 19 people, mostly Sikhs and Hindus.The bomber targeted a delegation from the minority communities as it was travelling to the governor’s residence in the eastern city of Jalalabad on Sunday for a meeting with President Ashraf Ghani.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X