వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐసిస్ ముందే హెచ్చరించిందా?: మాంచెస్టర్ ఎటాక్‌లో వెలుగుచూసిన నిజం!?..

బాంబు పేలుడుకు కొద్ది గంటల ముందు ట్విట్టర్ లో దర్శనిమిచ్చిన ఈ ట్వీట్.. ఆ తర్వాత కొద్దిసేపటికే ట్విట్టర్ నుంచి తొలగించబడింది.

|
Google Oneindia TeluguNews

మాంచెస్టర్: ఆత్మాహుతి దాడితో ఇంగ్లాండు ఒక్కసారిగా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. సంగీతంలో ఓలలాడుతున్న మాంచెస్టర్ ప్రజలు.. ఆత్మాహుతి దాడితో ఒక్కసారి భీతావహులుగా మారిపోయారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఐసిస్ ఉగ్రవాద సంస్థ నుంచి ముందస్తు హెచ్చరిక వెలువడినట్లు తెలుస్తోంది.

ఇంగ్లాండులో సంగీత కచేరీపై ఆత్మాహుతి దాడి: 22మంది మృతిఇంగ్లాండులో సంగీత కచేరీపై ఆత్మాహుతి దాడి: 22మంది మృతి

సంగీత కచేరీ కార్యక్రమానికి ఒక గంట ముందు ట్విట్టర్ ద్వారా ఐసిస్.. ఆత్మాహుతి దాడి జరగబోతున్నట్లు పేర్కొందని సమాచారం. మాంచెస్టర్‌ అరెనా హ్యాష్‌ట్యాగ్‌తో చేసిన ఈ ట్వీట్‌లో తమ హెచ్చరికకు ఐసిస్‌ జెండాను జతచేశారు. 'మా దాడిని మరిచిపోయారా? భయం అంటే ఇదే' అంటూ ఐసిస్ ఉగ్రవాదులు అందులో పేర్కొన్నారు.

ISIS supporters celebrate Manchester terror attack as Twitter user 'predicts' the blast FOUR HOURS before the explosion

బాంబు పేలుడుకు కొద్ది గంటల ముందు ట్విట్టర్ లో దర్శనిమిచ్చిన ఈ ట్వీట్.. ఆ తర్వాత కొద్దిసేపటికే ట్విట్టర్ నుంచి తొలగించబడింది. దాడి అనంతరం తమ ఎటాక్ విజయవంతమైందంటూ ఐసిస్ మద్దతుదారులు సోషల్ మీడియాలో సంబరాలు జరుపుకోవడం గమనార్హం.

ముసుగులు ధరించిన కొంతమంది వ్యక్తులు.. ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ప్రకటనలు చేస్తున్నారు. అంతేకాదు, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, ఇలాంటివి చాలా జరుగుతాయని వారు హెచ్చరించారు. కాగా, దాడికి సంబంధించి ఐసిస్ నుంచి మాత్రం ఇంతవరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

English summary
ISIS supporters celebrated online overnight following the blast in Manchester Arena which claimed the lives of at least 22 people and wounded more than 50 others.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X