వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్వేషం ఆగలేదు: ఎయిర్‌పోర్టులో ముస్లిం మహిళ ఉద్యోగినిపై దాడి, బూతులు తిట్టాడు

అమెరికాలో జాతి విద్వేష దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, ఓ ముస్లిం ఉద్యోగినిపై ఓ అమెరికన్ చేయిచేసుకున్న ఘ‌ట‌న జాన్‌ ఎఫ్‌ కెన్నడీ విమానాశ్రయంలో చోటుచేసుకుంది.

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికాలో జాతి విద్వేష దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, ఓ ముస్లిం ఉద్యోగినిపై ఓ అమెరికన్ చేయిచేసుకున్న ఘ‌ట‌న జాన్‌ ఎఫ్‌ కెన్నడీ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. అమెరికాలో విదేశీయుల‌పై దాడులు పెరిగిపోతున్న నేప‌థ్యంలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న మ‌రోసారి ఆందోళ‌నకు గురిచేసింది.

రోబిన్‌ రోడ్స్‌(57) అనే అమెరికన్ ఈ ఏడాది జనవరిలో అరుబా దేశానికి యాత్ర కోసం వెళ్లాడు. తాజాగా మసాచూసెట్స్‌ వెళ్లడానికి కనెక్టింగ్‌ విమాన సమాచారం కోసం డెల్టా ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగులు ఉండే క్యాబిన్‌కు వెళ్లి అక్కడి ముస్లిం మ‌హిళా ఉద్యోగిని చూశాడు. ఆమెను చూడ‌గానే అత‌డిలోని జాతి విద్వేషం బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఆమె ఏ త‌ప్పూ చేయ‌క‌పోయిన‌ప్ప‌టికీ ఇక్కడ‌ నువ్వు నిద్రపోతున్నావా? లేక నమాజ్‌ చేస్తున్నావా? ఏం చేస్తున్నావ్‌? అంటూ అరిచాడు.

'ISIS, Trump will get rid of all of you': Man attacks Muslim woman at JFK airport

అనంత‌రం త‌న‌కు, ఆ ఉద్యోగినికి అడ్డుగా ఉన్న తలుపును బద్దలు కొట్టి లోప‌లికి ప్ర‌వేశించాడు. దీంతో ఆ ముస్లిం ఉద్యోగిని భయప‌డింది. తాను ఏం తప్పు చేశానని అడిగింది. అయితే అదేమీ పట్టించుకోకుండా 'నిన్ను వదలను' అంటూ ఆమె వ‌ద్ద‌కు దూసుకొచ్చాడు. దీంతో ఆ ఉద్యోగిని వెంటనే బయటకు పరుగులు తీసింది. అయినా వ‌ద‌ల‌ని రోడ్స్ ఆమెను వెంబడించి ప‌ట్టుకొని ఆమెను మోకాళ్లపై కూర్చొబెట్టి ఇస్లాం మత ప్రార్ధనలను ఉద్దేశించి మాట్లాడాడు.

ఆమెను దుర్భాషలాడాడు. ఇస్లాం, ఐసిస్‌ అంటూ పెద్దగా అరిచాడు. త‌మ దేశంలో ఇప్పుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉన్నాడంటూ నినాదాలు చేసి, ముస్లింలను ట్రంప్ త‌రిమేస్తాడ‌ని అన్నాడు. అంతేగాక, ఆమెపై దాడి చేశాడు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు.. అత‌డిని అరెస్టు చేసి.. న్యాయ‌స్థానంలో హాజరుపరిచారు. అనంతరం 50 వేల డాలర్ల పూచీకత్తుతో ఆయ‌న‌ బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ చ‌ర్య‌కు గానూ రోడ్స్‌కు ఏడేళ్లపాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కాగా, రోడ్స్ దాడిలో మహిళకు స్పల్ప గాయాలయ్యాయి.

English summary
A traveler has been indicted on charges of unlawful imprisonment and aggravated harassment, after he went on a racist tirade, yelled threatening slurs and even kicking a Muslim Delta employee in the leg at the at John F. Kennedy Airport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X