వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రవాదానికి ఆయుధంగా రేప్‌లు: అంజిలినా జోలీ

By Pratap
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ దురాగతాలపై హాలీవుడ్ నటి అంజిలీనా జోలీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అత్యాచారాలను వాళ్లు ఉగ్రవాదానికి ఆయుధంగా వాడుకుంటున్నారని ఆమె ఆరోపించారు. వాళ్ల ప్రాబల్యం ఉన్న స్థానాల్లో లైంగిక హింసతో విధ్వంసానికి పాల్పడుతున్నారని అన్నారు. ఇంగ్లాండు హౌస్ ఆఫ్ లార్డ్స్ కమిటీకి ఆ విషయాలు చెప్పింది.

ఇడటీవల ఐఎస్ఐఎస్ ప్రాబల్య ప్రాంతాల్లో పర్యటించిన జోలీ కనీసం ఏడేళ్ల వయస్సున్న అమ్మాయిలను కూడా వాళ్లు వదలడం లేదని ఆవేదని వ్యక్తం చేసింది. జిహాదీ ఛాందసవాదులు ప్రపంచంలోనే అత్యంత దూకుడు ప్రదర్శిస్తున్న ఉగ్రవాదులని, వాళ్లు లైంగిక దాడులను కూడా సమర్థమైన ఆయుధంగా వాడుకుంటున్నారని ఆరోపించింది.

ISIS Using Rape as 'Policy,' UN Envoy Angelina Jolie Warns

ఇరాక్, సిరియాలు కేంద్రంగా ఐఎస్ఐఎస్ ఉగ్రవాదాలు చేసిన ఆగడాలను ఇప్పటి వరకు ఎవరూ చూసి ఉండరని ఆమె అన్నది. అత్యాచారాలు చేయడాన్ని వారు ఓ విధానంగా పెట్టుకున్నారని ఆమె వ్యాఖ్యానించింది. ఐ విషయాన్ని తీవ్రంగా పరిగణించి ఐఎస్ఐఎస్ సంస్థపై చాలా బలమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

ద లాండ్ ఆఫ్ బ్లడ్ అండ్ హనీ పేరుతో తాను తీసిన సినిమా కాపీలను కూడా ఆమె కమిటీ సభ్యులకు ఇచ్చింది. శరణార్థుల ఐక్య రాజ్య సమితి హై కమిషనర్ ప్రత్యేక దౌత్యవేత్తగా ఆమె వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. నువ్వు ఇది చేయాలి, సమాజాన్ని నిర్మించే పద్ధతి ఇది, రేప్ చేయాలని ఆదేశిస్తున్నామని వారు చెబుతున్నారని జోలీ వివరించింది.

English summary
The terror group ISIS is using rape as a weapon of terror to a degree "beyond what we have seen before," actress and UN special envoy Angelina Jolie told a committee of the House of Lords in England on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X