వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రవాదులను మార్చేందుకు పాకిస్తాన్ వందల కోట్లను ఖర్చు పెట్టింది...!

|
Google Oneindia TeluguNews

ఉగ్రవాదులను పాకిస్థాన్ ప్రోత్సహిస్తుందని, పాకిస్థాన్‌లో వేలాది మంది ఉగ్రవాదులు స్థావరంగా చేసుకుని దాడులు కొనసాగిస్తున్నారని భారత్‌తో పాటు పలు ఇతర దేశాలు కూడ ఆరోపణలు చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను సైతం భారత్ పలుసార్లు వెల్లడించింది. అయితే తాజాగా భారత్ చెబుతున్నట్టుగా పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థల ప్రతినిధులను జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చేందుకు కోట్ల రుపాయాల నిధులు ఖర్చుపెట్టామని స్వయంగా పాకిస్థాన్ విదేశాంగ మంత్రి అక్కడి ప్రైవేట్ మీడీయాకు ఇచ్చిన ఇంటర్యూలో ప్రకటించాడు. దీంతో పాకిస్థాన్‌లో ఉగ్రవాద సంస్థలు ఉన్నాయనే విషయాన్ని వెల్లడించాడు.

 ఉగ్రవాదులను దారిలోకి తెచ్చేందుకు వందల కోట్లు

ఉగ్రవాదులను దారిలోకి తెచ్చేందుకు వందల కోట్లు

పాకిస్తాన్ విదేశంగా మంత్రి రిటైర్డ్ బ్రిగేడియర్ ఇజాజ్ అహ్మాద్ షా ఈ వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్‌లోని ఓ ప్రైవేట్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఉగ్రవాదులకు సంబంధించి పలు ఆసక్తికర అంశాలను వెల్లడించాడు. ఈనేపథ్యంలోనే అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించబడిన హఫీజ్ సయిద్ నిర్వహిస్తున్న జమాత్ ఉద్ దవా సంస్థ సభ్యులను జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చేందుకు వందల కోట్ల రుపాయల నిధులను పాకిస్థాన్ ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు.

 ఇమ్రాన్ ఖాన్ పై మండిపడ్డ మాజీ బ్రిగేడియర్

ఇమ్రాన్ ఖాన్ పై మండిపడ్డ మాజీ బ్రిగేడియర్


ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. ఇమ్రాన్ ఖాన్ తమ దేశాన్ని నాశనం చేస్తున్నాడని ఆయన అన్నాడు. పాకిస్థాన్‌ను పాలిస్తున్న తీరుతో దేశం భ్రష్టు పడుతోందని ఆయన విమర్శించారు. 2008లో ముంబాయిలో ఉగ్రదాడులకు నేతృత్వం వహించిన దాడులకు సూత్రదారిగా వ్యవహరించిన జమాత్ ఉద్ దవా హఫీజ్ సయిద్‌ను పాక్ అధికారులు టెర్రర్ ఫైనాన్సింగ్ ఆరోపణలపై జూలై 17 న అరెస్టు చేశారు. లాహూర్‌లోని హై సెక్యూరిటి మధ్య గల లఖ్‌పత్ జేలులో ఉంచారు.

పాకిస్థాన్‌లో 40 మిలిటెంట్ గ్రూపులు ఉన్నాయన్న ఇమ్రాన్ ఖాన్

పాకిస్థాన్‌లో 40 మిలిటెంట్ గ్రూపులు ఉన్నాయన్న ఇమ్రాన్ ఖాన్

అంతకుముందు జూలైలో తొలి అమెరికా పర్యటన సందర్భంగా, పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తన దేశంలో 30వేల నుంచి 40వేల మంది ఉగ్రవాదులు ఉన్నారని పేర్కొన్నట్లు తెలిపారు. వీరంతా పూర్తి స్థాయిలో శిక్షణ పొంది దేశం తరపున ఆఫ్ఘనిస్తాన్, కశ్మీర్‌లో పోరాడారని చెప్పుకొచ్చారు. ఒక ప్రత్యేక కార్యక్రమానికి హాజరైన ఇమ్రాన్‌ తమ సరిహద్దుల్లో 40 వేర్వేరు మిలిటెంట్ గ్రూపులు పనిచేస్తున్నాయని వెల్లడించిన విషయం తెలిసిందే.

English summary
Pakistan’s interior minister has accepted that Islamabad spent millions on global terrorist, Hafiz Saeed-run banned organization Jamaat –ud-Dawa (JuD) in an attempt to bring it to the “mainstream”. Minister Brig (R) Ijaz Ahmed made the comments on a Pakistani private news channel called Hum News
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X