వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇస్లామిక్ స్టేట్: పాకిస్తాన్ నుంచి సిరియాలో మిలిటెంట్లకు నిధులు ఎలా వెళ్తున్నాయి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

పాకిస్తాన్‌లోని అతిపెద్ద నగరం కరాచీలో ఉగ్రవాదుల కోసం నిధులు సేకరిస్తున్న ఓ ముఠాను పోలీసులు ఛేదించారు. ఈ ముఠాలోని సభ్యులు బిట్‌కాయిన్ల ద్వారా సిరియాలోని మిలిటెంట్లకు డబ్బులు పంపిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కరాచీలోని ఎన్‌ఈడీ యూనివర్సిటీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థి ఒమర్ బిన్ ఖాలిద్‌ను ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. ఇతడు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)కు చెందిన మహిళా సభ్యులతో తరచూ మాట్లాడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

అయితే, ఒమర్ అరెస్టుపై ఆయన తల్లి పాక్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. తన కొడుక్కి మిలిటెంట్ సంస్థలతో ఎలాంటి సంబంధమూలేదని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.

రెండోసారి అరెస్టు...

ఉగ్రవాద పోరాట దళం ''కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్’’ (సీటీడీ) ఎస్పీ రాజా ఒమర్, డీఐజీ ఒమర్ షాహిద్ సోమవారం ఓ విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ''కెంట్ స్టేషన్ దగ్గర ఒమర్ బిన్ ఖాలిద్‌ను అరెస్టు చేశాం. గత నెల 17న కూడా ఆయన్ను అనుమానంతో అదుపులోకి తీసుకున్నాం. అయితే, విచారణ అనంతరం విడిచిపెట్టాం’’అని షాహిద్ చెప్పారు.

''విదేశాల్లోని ఇస్లామిక్ స్టేట్ సభ్యులకు వేర్వేరు మార్గాల్లో నిధులు పంపించడమే లక్ష్యంగా.. పాకిస్తాన్‌లో కొందరు నిధులను సేకరిస్తున్నట్లు సీటీడీకి సమాచారం అందింది’’

''మొదటిసారి ఒమర్ బిన్ ఖాలిద్‌ను అరెస్టు చేసినప్పుడు ఆయన దగ్గర నుంచి రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం. అయితే అప్పుడు ఆయనకు వ్యతిరేకంగా గట్టి ఆధారాలు లభించలేదు. దీంతో ఆయన్ను బెయిలుపై విడుదల చేశాం’’అని షాహిద్ వివరించారు.

నేరుగా సంబంధాలు..

''ఆ రెండు మొబైల్ ఫోన్లను ఫొరెన్సిక్ పరీక్షల కోసం పంపించాం. దీంతో నిందితుడికి ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధమున్నట్లు తేలింది. పాక్‌లో డబ్బులు సమీకరించి వాటిని సిరియాకు పంపించే ముఠాలతో అతడికి సంబంధాలున్నాయి’’అని షాహిద్ చెప్పారు.

''ఇస్లామిక్ స్టేట్‌లోని మహిళల ద్వారా సిరియాలోని మిలిటెంట్లతో అతడు మాట్లాడేవాడు’’.

''మొబైల్ యాప్ ఈజీపేలోని ఒమర్ బిన్ ఖాలిద్‌ అకౌంట్‌కు గుర్తుతెలియని వ్యక్తులు డబ్బులను పంపించేవారు. వీటిని హైదరాబాద్‌(పాక్)లోని జియా అనే ఈజీపే అకౌంట్‌కు బదిలీ చేసేవారు. చివరగా ఈ నగదును డాలర్లలోకి మార్చి.. బిట్‌కాయిన్ల రూపంలో సిరియాలోని ఉగ్రవాదులకు పంపించేవారు’’అని షాహిద్ తెలిపారు.

''డబ్బులు తీసుకున్న వెంటనే ఉమర్ బిన్ ఖాలీద్‌కు సదరు వ్యక్తులు మెసేజ్ పెట్టేవారు. రెండేళ్లుగా ఈ తతంగం నడుస్తోంది’’.

ఇస్లామిక్ స్టేట్

ఇదే తొలిసారి

ఉగ్రవాద సంస్థలకు అధునాతన కరెన్సీల ద్వారా నిధులు బదిలీ చేయడానికి సంబంధించి వెలుగుచూసిన తొలి కేసు ఇదేనని బీబీసీతో ఎస్పీ రాజా ఒమర్ ఖాతాబ్ చెప్పారు. ''ఇస్లామిక్ స్టేట్‌ సిద్ధాంతాలకు ఒమర్ ఆకర్షితుడయ్యాడు. ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ పనులు చేయలేనట్లు అనిపిస్తోంది’’

''సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ కుటుంబాలకు చెందిన కొందరు మహిళలు సోషల్ మీడియా సైట్ల ద్వారా సానుభూతి పరులకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. వారు ఉర్దూలో మాట్లాడగలరు కూడా’’.

''కొంత పరిచయం తర్వాత.. ఆ మహిళలు నిధులు సాయం చేయాలని అభ్యర్థించేవారు. ఎవరైనా నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే.. వెంటనే ఒమర్ బిన్‌ను సంప్రదించాలని సూచించేవారు’’.

''బెయిల్‌పై విడుదల అయిన వెంటనే పరారయ్యేందుకు ఒమర్ ప్రయత్నించాడు. అయితే అతడు రైలులో వేరే ప్రాంతానికి తప్పించుకుంటున్నట్లు సీటీడీకి సమాచారం అందింది. వెంటనే కెంట్ స్టేషన్‌లో అతణ్ని అరెస్టు చేశాం’’అని ఖాతాబ్ వివరించారు.

ఇస్లామిక్ స్టేట్

ఎవరీ ఒమర్?

ఎన్‌ఈడీ ఇంజినీరింగ్ యూనివర్సిటీలో మహమ్మద్ ఒమర్ బిన్ ఖాలిద్ చివరి సంవత్సరం విద్యార్థి. అతడి అరెస్టుకు వ్యతిరేకంగా అతడి తల్లి తైబా ఖాలిద్ హైకోర్టును ఆశ్రయించారు.

పాకిస్తాన్‌లో ఇస్లామిక్ స్టేట్ చేపట్టిన కొన్ని దాడులతో కరాచీలోని ఎన్‌ఈడీ యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధముందని ఇంతకుముందే వార్తలు వచ్చాయి. దీనిపై హోం శాఖ, డీజీ రేంజర్స్ సహా భద్రతా సంస్థలకు హైకోర్టు నోటీసులు కూడా ఇచ్చింది.

సఫూరాలో ఇస్మాయిలీ వర్గం ప్రతినిధులు ప్రయాణిస్తున్న బస్సుపై దాడికి సంబంధించి ఇటీవల చాలా మంది యువకుల్ని అరెస్టు చేశారు.

సఫూరా దాడితో సంబంధమున్న సాద్ అజిజ్.. సామాజిక కార్యకర్త షబీన్ మహమ్మద్ హత్య కేసులో సూత్రధారి అని పోలీసులు తెలిపారు.

కరాచీ వర్సిటీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో సాద్ అజిజ్ చదువుతున్నారు. సాద్‌కు సన్నిహితుడు, ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్ మహమ్మద్ అజాద్ ఇష్రాత్ కూడా హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మరో నిందితుడు హఫీజ్ నజీర్ హుస్సేన్ కూడా కరాచీ వర్సిటీలో ఇస్లామిక్ స్టడీస్‌లో ఎంఏ చదువుతున్నాడు.

సింధ్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు, ఎంక్యూఎం పార్టీ నేత ఖ్వాజా ఐజార్‌పై జరిగిన దాడిలోని నిందితులు కూడా కరాచీ వర్సిటీలో చదువుతున్నారు. ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధమున్న కొందరు యువత ఏర్పాటుచేసిన అన్సాల్ అల్ షరియా సంస్థతో కొందరు విద్యార్థులకు సంబంధముందని పోలీసులు కూడా వెల్లడించారు.

బిట్‌కాయిన్

బిట్‌కాయిన్ అంటే?

బిట్‌కాయిన్ ఒక డిజిటల్ క్రిప్టో కరెన్సీ. దీనిలో చెల్లింపులన్నీ ఎలక్ట్రానిక్ మాధ్యమంలో జరుగుతాయి. ఇవి కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చెల్లుబాటు అవుతాయి.

ప్రపంచంలోని చాలా దేశాలు బిట్‌కాయిన్లలో వాణిజ్యానికి అనుమతిస్తున్నాయి. అయితే 2017లో ఈ కరెన్సీని కొనడం, అమ్మడంపై నిషేధం విధిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ ప్రకటించింది.

అయితే చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో బిట్‌కాయిన్ల ధర పెరిగిందని రెండు వారాల క్రితం వరుస వార్తలు వచ్చాయి. అమెరికాలో అయితే ఒక బిట్‌కాయిన్ విలువ 30,000 డాలర్లకుపైనే ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Funds going to syria militants from Pakistan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X