వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎస్ఐఎస్ వెబ్ అకౌంట్ లకు చెక్: ప్రత్యేక పోలీసులు

|
Google Oneindia TeluguNews

లండన్: సోషల్ మీడియా నుండి ఉగ్రవాదుల ఖాతాలను తొలగించడానికి రంగం సిద్దం చేస్తున్నారు. వీలైనంత త్వరగా అన్ని అకౌంట్లను తొలగించాలని అధికారులు భావిస్తున్నారు. యూరప్ లో అందుకు ప్రత్యేకంగా పోలీసులను ఏర్పాటు చేశారు. ఆ పోలీసులకు యూరోపోల్ అని పేరు పెట్టారు.

ప్రత్యేక పోలీసు బృందాలకు సైబర్ క్రైం పోలీసులు పూర్తి సహకారం అందిస్తున్నారు. ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) తీవ్రవాదులకు సంబంధించి సోషల్ మీడియాలో దాదాపు 50 వేల అకౌంట్లు ఉన్నాయని అధికారులు గుర్తించారు.

ISlS web accounts to be blocked by new police team in Europe

నిత్యం ఐఎస్ఐఎస్ కార్యకాలపాలకు సంబంధించి దాదాపు లక్ష ట్విట్లు చేస్తున్నారని గుర్తించారు.
ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులను హీరోలుగా చూపిస్తు నిత్యం ట్విట్లు చేస్తున్నారని, యువత వారి పట్ల ఆకర్షితులు అవుతున్నారని యూరప్ ప్రభుత్వం గుర్తించింది.

ఇలాంటి ట్విట్లు చేస్తున్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులు నిర్ణయించారు.
అందుకోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా కంపెనీల సహకారంతో ఐఎస్ఐఎస్ కు సంబంధించిన అకౌంట్లను గుర్తిస్తున్నారు.

వెంటనే వాటిని తొలగించాలని నిర్ణయించారు. జులై 1 నుండి ఆ అకౌంట్ లు పూర్తిగా తొలగించాలని, వాటిని బ్లాక్ చెయ్యాలని ప్రత్యేక బృందం పోలీసులకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటి నుండి ఐఎస్ఐఎస్ కు మద్దతుగా ట్విట్ లు చేస్తున్న వారిని గుర్తిస్తున్నారు.

English summary
The European police agency Europol will now work with unnamed social media companies to track the accounts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X