వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇజ్రాయిల్ ఎన్నికలు: నెతన్యాహు మళ్లీ ప్రధాని అవుతారా.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి..?

|
Google Oneindia TeluguNews

ఇజ్రాయిల్: భారత్‌తో పాటు ఇజ్రాయిల్‌లో కూడా ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. ఇజ్రాయిల్‌లో జరిగిన ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగిందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. లికుడ్ పార్టీ అభ్యర్థిగా ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ బరిలో నిలవగా ఇక ఇజ్రాయిల్ రెసీలియెన్స్ పార్టీ నుంచి బెన్నీ గంట్జ్ బరిలో నిలిచారు. ఇజ్రాయిల్ ప్రధాని రేసులో ఇద్దరూ దూసుకెళుతున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

గెలుపు పై నెతన్యాహూ బెన్నీ గంట్జ్ ధీమా

గెలుపు పై నెతన్యాహూ బెన్నీ గంట్జ్ ధీమా

బెన్నీ గంట్జ్ నేతృత్వంలోని బ్లూ అండ్ వైట్ పార్టీ 36 నుంచి 37 సీట్లను దక్కించుకోనుండగా నెతన్యాహూ పార్టీ 33 నుంచి 36 సీట్లు నెగ్గే అవకావం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలుస్తోంది. అయితే తమదే గెలుపని ఇరు పార్టీల అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నెతన్యాహూ ఇతర సభ్యులను కలుపుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని రెండు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మూడో ఎగ్జిట్ పోల్ మాత్రం గంట్జ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ సెంటర్ లెఫ్ట్ పార్టీలు మద్దతు తెలుపుతాయా లేదా అనే అనుమానం వ్యక్తం చేసింది.

తాము గెలిచేశామని అది కూడా స్పష్టమైన మెజార్టీతో విజయం సాధించామని ఇక అధికారికంగా మాత్రమే వెలువడాల్సి ఉందని గంట్జ్ బ్లూ అండ్ వైట్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే టెల్ అవివ్‌లోని లికుడ్ పార్టీ ప్రధాన కార్యాలయంలో నెతన్యాహూ కూడా సంబరాల్లో మునిగిపోయి ఉండటం కనిపించింది. ఇది తనకు భారీ విజయంగా పేర్కొన్న నెతన్యాహూ దేశ ప్రజలు తనపై నమ్మిక ఉంచి ఐదవ సారి ప్రధానిగా అవకాశం ఇస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. 120 పార్లమెంట్ స్థానాలు ఉన్న ఇజ్రాయిల్‌లో ఇప్పటి వరకు ఏ ఒక్క పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. అన్ని సార్లు సంకీర్ణ ప్రభుత్వాలే ఇజ్రాయిల్‌ను పాలించాయి.

 అసలైన రాజకీయం ఇప్పుడే ప్రారంభం

అసలైన రాజకీయం ఇప్పుడే ప్రారంభం

తొలి ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల అవగానే టెల్ అవివ్‌లో బ్లూ అండ్ వైట్ పార్టీ కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి. బెన్నీ గంట్జ్ మద్దతుదారులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. ఇక ఇజ్రాయిల్‌లో మార్పు రాబోతోందంటూ గట్టిగా కేకలు వేశారు. కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండే అవకాశం ఉందని ఇజ్రాయిల్ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు అధికారికంగా విడుదలైన ఫలితాలకు ఎక్కడా పొంతన కుదరలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ ఫలితాలు రెండు పార్టీలకు చాలా దగ్గరగా ఉంటే మాత్రం అసలు రాజకీయాలు మొదలవుతాయని ప్రలోభాలు పెరిగే అవకాశం ఉందని అనలిస్టులు భావిస్తున్నారు. రెండు పార్టీల నేతలు ఇజ్రాయిల్ అధ్యక్షుడిని దువ్వే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

ఇదీ నేతల బ్యాక్ గ్రౌండ్

ఇదీ నేతల బ్యాక్ గ్రౌండ్

ఒకవేళ తిరిగి బెంజమిన్ నెతన్యాహూ ప్రధానిగా బాధ్యతలు చేపడితే ఇజ్రాయిల్ దేశ పితామహుడుగా పేర్కొనబడ్డ డేవిడ్ బెన్ గురియన్ రికార్డును అధిగమిస్తారు. ఇప్పటి వరకు ఆయన నాలుగు సార్లు దేశానికి ప్రధానిగా సేవలందించారు. విజయం సాధిస్తే నెతన్యాహు ఐదవసారి ప్రధానిగా బాధ్యతలు చేపడతారు. దేశ భద్రతపై నెతన్యాహూ కఠిన నిర్ణయాలు తీసుకోవడం ఆయనకు కలిసొచ్చే అంశంగా పలువురు విశ్లేషిస్తున్నారు. ఇక తన ప్రచారం చివరి రోజుల్లో కూడా ఓ కామెంట్ చేసి ఓటర్ల దృష్టిని ఆకర్షించారు. కొత్త ప్రభుత్వం వస్తే పశ్చిమ తీరంలో ఉన్న యూదులను ఇజ్రాయిల్‌లోకి కలిపేస్తామంటూ చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం యూదులు అక్కడ నివసించడం చట్టరీత్యా నేరం. అయితే దీన్ని ఇజ్రాయిల్ తప్పుబడుతోంది. మరోవైపు నెతన్యాహూ కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనపై అవినీతి ఆరోపణలు అంటగట్టారని వాదిస్తున్నారు.

ఇక నెతన్యాహూ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న బ్లూ అండ్ వైట్ పార్టీ అధినేత బెన్నీ గంట్జ్ రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్. ఇజ్రాయిల్ మిలటరీకి ఆర్మీ ఛీఫ్‌గా సేవలందించారు. మంచి మార్పు తీసుకురావడంతో పాటు దేశంలో అవినీతి లేకుండా చేస్తానంటూ రాజకీయ అరంగేట్రం చేశారు. మిలటరీలో పనిచేసిన అనుభవం ఉండటంతో దేశ భద్రతపై అవగాహన ఉందని దేశం మొత్తాన్ని ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఉమ్మడిగా ఉంచుతాననే హామీ ఇచ్చారు.

English summary
The centrist Blue and White alliance of former military chief Benny Gantz was projected to win 36 or 37 seats, with the Likud party of Prime Minister Benjamin Netanyahu taking 33 to 36.Both men have claimed victory.Two exit polls predicted that right-wing parties allied to Mr Netanyahu were more likely to be able to form a governing coalition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X