వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రవాదంపై పోరుకు సహకారం: సుష్మా స్వరాజ్

|
Google Oneindia TeluguNews

జెరూసలెం: ఉగ్రవాదుల సవాల్ ను ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా పని చెయ్యడానికి సిద్దంగా ఉన్నామని భారత్, ఇజ్రాయెల్ చెప్పాయి. ఉగ్రవాద ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు మరింత సహకారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవాలని ఇరు దేశాలు అంగీకరించాయి.

భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సోమవారం ఇజ్రాయెల్ అధినాయకత్వంతో జరూసలెంలో భేటీ అయ్యారు. ఇదే సందర్బంలో ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై ఇరు దేశాల నేతలు సుదీర్ఘంగా చర్చించారు.

Israel, India to intensify coordination to counter terror

ఇజ్రాయెల్ దేశాధ్యక్షుడు రువెన్ రివ్విన్, ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆదేశ ముఖ్యనేతలతో సుష్మా స్వరాజ్ భేటీ అయ్యారు. ఇదే సందర్బంలో రక్షణ, సైబర్, టెక్నాలజీ, సైన్స్, వ్యవసాయం తదితర రంగాల్లో రెండు దేశాలు సహకారాన్ని పెంపొందించుకుంటాయని స్పష్టం చేశారు.

ఇజ్రాయెల్ లోని హెబ్రాన్ లో 38 ఏళ్ల మహిళ తన ఆరుగురు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నది. ఆమెను ఉగ్రవాదులు ఆరు మంది పిల్లల ఎదుటే ఇంటిలో అతి దారుణంగా చంపేశారు. ఈ హత్యను సుష్మా స్వరాజ్ ఖండియారు. ఇదే సందర్బంగా సుష్మా స్వరాజ్ మహిళ కుటుంబానికి సంతాపం తెలిపారు.

English summary
A Young mother murdered in front of her children in her home in Israel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X