• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దారుణం:16 ఏళ్ల బాలికపై 30 మంది రేప్ - వికృత వీడియో వైరల్ - ప్రధాని తీవ్ర స్పందన

|

''సెక్స్ చేయడానికి ఓ అమ్మాయి రెడీగా ఉందంటూ నా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసి రమ్మంటే ఉత్సాహంగా వెళ్లాను. హోటల్ లో ఆమె గది గది ముందు సీన్ చూసి షాకయ్యాను. డజను మందికిపైగా అక్కడ క్యూలో నిలబడ్డారు. నేను కూడా లైన్ లో చేరి, నా వంతు కోసం ఎదురు చూశాను. అక్కడున్న వాళ్లలో స్నేహితుడు తప్ప, మిగతావాళ్లెవరో నాకు తెలీదు. అన్నట్లు, మేం క్యూలో నిలబడ్డ సమయంలో మరో వ్యక్తి.. మెడికల్ ఎమర్జెన్సీ సాకుతో లోపలికి వెళ్లి ఆమెతో గడిపి వచ్చాడు''.. ఇది నాటి ఘటనలో నిందితుడైన ఓ 20 ఏళ్ల యువకుడు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్.

అస్సాం కాంగ్రెస్‌లో 'బద్రుద్దీన్' చిచ్చు - ఏఐయూడీఎఫ్‌తో పొత్తుకు గొగోయ్ సిగ్నల్ - అనూహ్య పరిణామాలుఅస్సాం కాంగ్రెస్‌లో 'బద్రుద్దీన్' చిచ్చు - ఏఐయూడీఎఫ్‌తో పొత్తుకు గొగోయ్ సిగ్నల్ - అనూహ్య పరిణామాలు

టీనేజర్ పై 30 మంది గ్యాంగ్ రేప్..

టీనేజర్ పై 30 మంది గ్యాంగ్ రేప్..

మానవత్వానికే మచ్చలా పరిణమించిన సంఘటన ఇజ్రాయెల్ దేశంలో చోటుచేసుకుంది. అక్కడి ఎలాత్ సిటీలో ‘రెడ్ సీ రిసార్ట్స్' హోటల్ లో దారుణం చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలికపై 30 మంది యువకులు ఒకరి తర్వాత ఒకరుగా అత్యాచారానికి పాల్పడ్డారు. అందులో కొందరు వికృత దృశ్యాలను వీడియోలు తీసి, వైరల్ చేశారు. వీడియోల ఆధారంగా స్పష్టంగా కనిపించిన ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కీచకపర్వంపై ఇప్పుడు దేశమంతా అట్టుడుకుతోంది.

మందు పార్టీకి వెళ్లి..

మందు పార్టీకి వెళ్లి..

కరోనా లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేయడంతో ఇజ్రాయెల్ వ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్లిక్ ప్లేసులు రీఓపెన్ అయిన సంగతి తెలిసిందే. ఎలాత్ సిటీలో గ్యాంగ్ రేప్ ఘటన ఆగస్టు మొదటి వారంలో చోటుచేసుకుంది. బాధిత బాలిక తన స్నేహితులతో కలిసి మందు పార్టీ చేసుకునేందుకు ‘రెడ్ సీ రిసార్ట్స్' హోటల్ కు వెళ్లింది. బార్ లో మద్యసేవనం సమయంలో వేరే యువకుల బృందంతో అమ్మాయి గొడవ పడినట్లు తెలిసింది. ఆ తర్వాత మద్యం మత్తులో బాత్ రూమ్ కు వెళ్లిన ఆమెను, తన గదికే తీసుకెళ్లి యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.

కరోనా వ్యాక్సిన్: చైనా దొంగ పని - అక్రమంగా క్లినికల్ ట్రయల్స్ - మాస్క్‌పైనా సంచలన నిర్ణయంకరోనా వ్యాక్సిన్: చైనా దొంగ పని - అక్రమంగా క్లినికల్ ట్రయల్స్ - మాస్క్‌పైనా సంచలన నిర్ణయం

కీలకంగా సీసీటీవీ ఫుటేజీ..

కీలకంగా సీసీటీవీ ఫుటేజీ..

మద్యం మద్దులో ఉన్న బాలికపై ఒకరి తర్వాత ఒకరుగా 30 మంది యువకులు రేప్ చేసినట్లు వెల్లడైంది. వాళ్లలో ఒకరిద్దరు తప్ప మిగతావాళ్లెవరూ పరియస్తులు కారని, గదిలో అమ్మాయి ఉందన్న సమాచారంతో వచ్చినవాళ్లే ఎక్కువ మంది ఉన్నారని తెలిసింది. అయితే, హోటల్ యజమాని మాత్రం గ్యాంగ్ రేప్ ఘటనను కొట్టిపారేశారు. అన్ని చోట్లా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని, బాధిత బాలిక బస చేసిన గది ముందు యువకులు క్యూ కట్టిన దృశ్యాలేవీ చోటుచేసుకోలేదని ఆయన చెబుతున్నారు. అయితే, గది లోపల ఏం జరిగిందో చెప్పలేమని, ఏదేమైనా ఆ అమ్మాయికి అండగా ఉంటామని, దర్యాప్తులో పోలీసులకు సహకరిస్తామని హోటల్ యజమాని అన్నారు.

దేశవ్యాప్త నిరసలు..

దేశవ్యాప్త నిరసలు..

16 ఏళ్ల బాలికను 30 మంది యువకులు క్యూ కట్టిమరీ రేప్ చేశారని వెల్లడి కావడంతో ఇజ్రాయెల్ మహిళా లోకం ఒక్కసారిగా భగ్గున మండింది. ఇంత‌టి క్రూర‌మైన నేరానికి పాల్ప‌డ్డ వాళ్లను క‌ఠినంగా శిక్షించాల‌ని, అమ్మాయిల‌పై దారుణాల‌కు ఇకనైనా చ‌ర‌మ‌గీతం పాడాల‌ని నిన‌దిస్తూ ఎలాత్, టెల్ అవివ్‌, జెరూస‌లేం న‌గ‌రాల్లో నిరసనలు చేపట్టారు.ఇజ్రాయెల్‌లోని ప్ర‌తి ఐదుగురు మ‌హిళ‌ల్లో ఒక‌రు అత్యాచారానికి గుర‌వుతున్నార‌ని 'మ‌స్టికెరియాట్' మ‌హిళా హ‌క్కుల సంఘం కార్య‌క‌ర్త ఇలానా వెజ్‌మాన్ తెలిపారు. అబ్బాయిల‌కు చిన్న త‌నం నుంచే ఈ విష‌యంలో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ఆమె పేర్కొన్నారు.

  Israel & UAE Strike Historic Deal To Normalise Relations | Oneindia Telugu
  ప్రధాని తీవ్ర స్పందన..

  ప్రధాని తీవ్ర స్పందన..

  16 ఏళ్ల బాలికపై అత్యంత కౄరంగా 30 మంది అత్యాచారం చేసిన ఘటన షాక్ కు గురిచేసిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజ‌మిన్ నెత‌న్యాహు అన్నారు. ‘‘ఇది షాకింగ్‌గా ఉంది. నాకు అసలు మాట‌లు రావ‌డం లేదు. ఇది ఓ అమ్మాయిపై జ‌రిగిన అఘాయిత్యం మాత్ర‌మే కాదు, మాన‌వ‌త్వంపై జరిగిన దాడి. ఈ తీవ్ర నేరానికి పాల్పడిన నిందితులను వదిలిపెట్టబోము’’అని ప్రధాని ప్రకటన చేశారు.‘‘దాదాపు స్పహలోలేని అమ్మాయిని అనుభవించడానికి క్యూలో నిలబడ్డ ఆ యువకుల మానసిక స్థితి తలుచుకుంటే నిజంగా నాకు జాలేస్తోంది. వాళ్లు ఏం నిరూపించదల్చుకున్నారో అది మాత్రం కచ్చితంగా నెరవేరలేదని చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడా బాలికకు దేశమంతా అండగా నిలబడింది''అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి బెన్ని గాండ్జ్ వ్యాఖ్యానించారు.

  English summary
  The alleged gang-rape of a 16-year-old girl by some 30 men in the Red Sea resort of Eilat has sparked outrage in Israel. "It's shocking -- there's no other word for it," said Prime Minister Benjamin Netanyahu, calling for all the suspects to be put on trial.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X