వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధ్యవర్తిత్వంలో ట్రంప్ ఘటికుడే: దశాబ్దాల శతృత్వానికి తెర: మూడు దేశాల మధ్య అబ్రహం అకార్డ్స్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఓ చారిత్రాత్మక సంఘటనకు తెర తీశారు. దశాబ్దాలుగా భగ్గుమంటోన్న శతృత్వానికి చరమగీతం పాడారు. మధ్య తూర్పులో అశాంతికి కారణమౌతోన్న మూడు దేశాల మధ్య శాంతి ఒప్పందాలను కుదర్చగలిగారు. ఆ మూడు దేశాలనూ ఒకేతాటిపైకి తీసుకుని రాగలిగారు. శాంతి ఒప్పందాలు కుదిరేలా చేశారు. శాంతి ఒప్పందాలపై ఆ మూడు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ అధికారిక నివాసం వైట్‌హౌస్ దీనికి వేదికైంది. ఈ ఒప్పందాలకు అబ్రహం అకార్డ్స్‌గా పేరు పెట్టారు. అబ్రహం సంధిగా పిలుస్తారు.

Recommended Video

చారిత్రాత్మక సంఘటనకు తెర, Donald Trump సమక్షంలో 3 దేశాల మధ్య శాంతి ఒప్పందాలు! || Oneindia Telugu

ఉ.కొరియా నియంత అంకుల్ దారుణహత్య: డొనాల్డ్ ట్రంప్-కిమ్‌‌జొంగ్ జోడీ ప్రమేయం: రేజ్ బుక్ఉ.కొరియా నియంత అంకుల్ దారుణహత్య: డొనాల్డ్ ట్రంప్-కిమ్‌‌జొంగ్ జోడీ ప్రమేయం: రేజ్ బుక్

 వైట్‌హౌస్ వేదికగా..

వైట్‌హౌస్ వేదికగా..

వైట్‌హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో బహ్రెయిన్-ఇజ్రాయెల్-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య శాంతి ఒప్పందాలు కుదిరాయి. డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, బహ్రెయిన్, ఎమిరేట్స్ విదేశాంగ శాఖ మంత్రులు అబ్దుల్ లతీఫ్ అల్ జయానీ, అబ్డుల్లా బిన్ జయేద్ ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. వాటిని పరస్పరం బదలాయించుకున్నారు. మధ్య తూర్పు ఆసియాలో ఒక చారిత్రాత్మక, సువర్ణాధ్యాయం ఆరంభమైందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఇజ్రాయెల్‌తో స్నేహ సంబంధాలు..

ఇజ్రాయెల్‌తో స్నేహ సంబంధాలు..

అరబ్ దేశాలు ఇజ్రాయిల్‌ను తమ శతృవుగా భావిస్తుంటాయి. పాలస్తీనా-ఇజ్రాయిల్ మధ్య సుదీర్ఘకాలం నుంచి చెలరేగుతోన్న వివాదాలు దీనికి ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తుంటారు. ఆ వివాదం పరిష్కారమైతే తప్ప ఇజ్రాయిల్‌తో స్నేహాన్ని కొనసాగించలేమని బహిరంగంగా ప్రకటించాయి. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయిల్‌తో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంగీకరించింది. బహ్రెయిన్ సైతం ఇజ్రాయెల్‌ వైపు మొగ్గు చూపింది.

ఒప్పించిన ట్రంప్..

ఒప్పించిన ట్రంప్..

ఈ మూడు దేశాల మధ్య శాంతియుత వాతావరణం, స్నేహ సంబంధాలు ఏర్పడటంలో డొనాల్డ్ ట్రంప్ కీలకపాత్ర పోషించారు. మధ్యవర్తిత్వాన్ని వహించారు. ఇజ్రాయిల్-పాలస్తీనల మధ్య కొనసాగుతున్న వివాదాలను పరిష్కరించుకోవడానికి, మధ్య తూర్పు రీజియన్‌లో శాంతిని నెలకొల్పడానికి ఈ రెండు దేశాలు ఇజ్రాయిల్‌తో అన్నిరకాల సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి ముందుకొచ్చాయి. 1948లో ఆవిర్భవించిన బహ్రెయిన్.. యూఏఈ, ఈజిప్టు, జోర్డాన్ తర్వాత ఇజ్రాయిల్‌ పట్ల సానుకూల వైఖరిని ప్రదర్శించిన నాలుగో దేశంగా నిలిచింది.

 మరిన్ని దేశాలతో..

మరిన్ని దేశాలతో..

ఇజ్రాయిల్-బహ్రెయిన్-ఎమిరేట్స్ మధ్య శాంతి ఒప్పందాలు కుదరడాన్ని చారిత్రాత్మకంగా ట్రంప్ అభివర్ణించారు. దీనివల్ల మధ్యప్రాచ్య ప్రాంతంలో స్థిరత్వం, భద్రత, సామరస్యం నెలకొంటాయని అన్నారు. అరబ్ దేశాలతో సన్నిహిత సంబంధాలను కొనసాగించడానికి సుదీర్ఘకాలం పాటు చేసిన ప్రయత్నాలు ఫలించాయని నెతన్యాహు వ్యాఖ్యానించారు. భవిష్యత్‌లో మరిన్ని మధ్య ప్రాచ్య దేశాలు, ఇతర ముస్లిం దేశాలు ఇజ్రాయిల్‌తో శాంతి ఒప్పందాలు కుదుర్చుకుంటాయనే విశ్వాసం ఉందని అన్నారు.

ట్రంప్ వ్యూహం..

ట్రంప్ వ్యూహం..

ఇదిలావుండగా- ఈ మూడు దేశాల మధ్య శాంతి ఒప్పందాలను కుదర్చడం వెనుక డొనాల్డ్ ట్రంప్ వ్యూహం ఉందనే అభిప్రాయాలూ లేకపోలేదు. ఇరాన్‌కు వ్యతిరేకంగా కొన్ని అరబ్, ముస్లిం దేశాలను తయారు చేయడంలో ఆయన విజయం సాధించినట్టయిందనీ అంటున్నారు. అరబ్, ముస్లిం దేశాలను ఇరాన్‌కు చేయడానికీ ఈ శాంతి ఒప్పంద ప్రయత్నాలు ఫలిస్తాయని భావిస్తున్నారు. ఇరాన్ విషయంలోో ఆయా దేశాల అమెరికా వైపు అండగా నిలిచే ప్రయత్నం చేస్తాయనే వాదనలూ ఉన్నాయి.

English summary
Bahrain’s Foreign Minister Abdullatif Al Zayani, Israel's Prime Minister Benjamin Netanyahu, U.S. President Donald Trump and United Arab Emirates (UAE) Foreign Minister Abdullah bin Zayed participate in the signing of the Abraham Accords.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X