• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అరబ్బులపై మూకదాడులు టీవీల్లో లైవ్ -ఇజ్రాయెల్ మీడియా వికృతం -గాజా దాడుల్లో మృతుల సంఖ్య పైపైకి

|

మిడిల్ ఈస్ట్‌లో మరణహోమం జోరుగా సాగుతోంది. సరిహద్దుకు అవతలున్న శతృ శిబిరాలపై సైన్యాలు బాంబులు, మిస్సైళ్లతో దాడులు చేస్తోంటే.. సరిహద్దులోపల చేతికి చిక్కిన శతృవును జనం వట్టి చేతులతోనే కిరాతకంగా హతమారుస్తున్నారు. ఈ భయానక మారణకాండ దృశ్యాలను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తూ టీఆర్పీలను పెంచుకుంటున్నాయి ఇజ్రాయెలీ మీడియా సంస్థలు. వివరాల్లోకి వెళితే..

యూదు, క్రైస్తవ, ఇస్లాం మతాలకు మూల కేంద్రమైన జెరుసలేం నగరంలో అల్ అఖ్సా మసీదు ప్రాంగణంలో కొద్ది రోజుల కిందట పాలస్తీనా, ఇజ్రాయెల్ దళాలకు మధ్య తలెత్తిన ఘర్షణ ఇప్పుడు యుద్ధంగా మారింది. రెండు దేశాలు పరస్పరం బాంబులు, రాకెట్లతో దాడులుచేసుకుంటుండగా, దేశం లోపలున్న అరబ్బులు, పాలస్తీనియన్లను స్థానికి ఇజ్రాయెలీ పౌరులు వెంటాడి చంపుతున్నారు. ఈ క్రమంలో జరిగిన అత్యంత పాశవికమైన దాడిని ఇజ్రాయెలీ టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేసింది.

సీజేఐ రమణ మరో సంచలనం -కరోనా వేళ ప్రత్యేక యాప్ -త్వరలో సుప్రీంకోర్టు విచారణలు లైవ్‌ స్ట్రీమింగ్సీజేఐ రమణ మరో సంచలనం -కరోనా వేళ ప్రత్యేక యాప్ -త్వరలో సుప్రీంకోర్టు విచారణలు లైవ్‌ స్ట్రీమింగ్

Israeli Mob Lynching Arab Man Near Tel Aviv Aired Live on Israeli TV, Gaza attack toll jumps

ఇజ్రాయెల్ పాత రాజధాని టెల్ అవీవ్ సిటీ దక్షిణ ప్రాంతమైన బాట్ యామ్ పరిసరాల్లో.. కొందరు రైట్ వింగ్ ఇజ్రాయెలీ మూక సామూహికంగా ఓ అరబ్ వ్యక్తిపై దాడి చేయడం బుధవారం రాత్రి టీవీలో ప్రత్యక్ష ప్రసారమైంది. కారులో వెళ్తున్న ఓ వ్యక్తిని బలవంతంగా బయటకు లాగి, స్పృహ కోల్పోయే వరకు దారుణంగా కొట్టినట్లు ఈ దృశ్యాల్లో కనిపించింది. ఈ దృశ్యాలను ప్రభుత్వ బ్రాడ్‌కాస్టర్ 'కాన్' ప్రసారం చేసింది. బాధితుడు రోడ్డుపై నిస్సహాయ స్థితిలో పడిపోగా, ఘటన జరిగిన దాదాపు 15 నిమిషాల తర్వాతగానీ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కాగా,

అరబ్బు వ్యక్తి కారుతో హత్యాయత్నానికి పాల్పడటం వల్లే తాము దాడి చేయాల్సి వచ్చిందని ఇజ్రాయేలి మూకలు చెప్పుకొచ్చాయి. ఇషిలోవ్ హాస్పిటల్ విడుదల చేసిన ఓ ప్రకటనలో, ''మూక దాడి బాధితుడు తీవ్రంగా గాయపడినప్పటికీ, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది'' అని తెలిపింది. అయితే ఆయన వివరాలు మాత్రం తెలియరాలేదు. మరోవైపు..

వ్యాక్సిన్లపై ఎన్‌టీఏజీఐ సంచలనం -కొవిడ్ సోకిన 6నెలల తర్వాతే టీకా -రెండో డోసుకు 12-16 వారాల గ్యాప్వ్యాక్సిన్లపై ఎన్‌టీఏజీఐ సంచలనం -కొవిడ్ సోకిన 6నెలల తర్వాతే టీకా -రెండో డోసుకు 12-16 వారాల గ్యాప్

Israeli Mob Lynching Arab Man Near Tel Aviv Aired Live on Israeli TV, Gaza attack toll jumps

పాలస్తీనాలో అంతర్భాగం, ఇజ్రాయెల్ తనదిగా చెప్పుకునే గాజా ప్రాంతంపై సోమవారం నుంచి ఎడతెరపి లేకుండా రాకెట్ బాంబుల దాడి జరుగుతూనే ఉంది. రెండు దేశాలూ పరస్పరం దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. గురువారం నాటికి గాజా దాడుల మృతుల సంఖ్య 83కు పెరిగింది. ఇందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఇప్పటిదాకా సుమారు 500 మంది తీవ్రంగా గాయపడ్డారు. పదుల సంఖ్యలో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఇజ్రాయెల్ నగరాల్లో జరుగుతోన్న ఘటనలు ఆమోదయోగ్యం కాదని ప్రధాని నెతన్యాహు కంటితుడుపు ప్రకటన చేశారు.

English summary
Footage of a far-right Israeli mob attacking a man near Tel Aviv they believed to be an Arab was aired live on television Wednesday night, as the Israel-Palestinian conflict raged on. The shocking images show a man being forcibly removed from his car and beaten by a crowd of dozens until he lost consciousness. The attack, broadcast by public broadcaster Kan, took place on the seafront promenade of Bat Yam, south of Israel’s commercial capital Tel Aviv.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X