వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నైట్ క్లబ్‌లో కాల్పులు, 39 మంది మృతి: మాజీ ఎంపీ కొడుకు సహా ఇద్దరు ఇండియన్స్ కూడా

టర్కీలోని ఇస్తాంబుల్‌లో కొత్త సంవత్సర వేడుకల్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఓ నైట్ క్లబ్‍‌లో దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 39 మంది దాకా మృతి చెందారు.

|
Google Oneindia TeluguNews

ఇస్తాంబుల్: టర్కీలోని ఇస్తాంబుల్‌లో కొత్త సంవత్సర వేడుకల్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఓ నైట్ క్లబ్‍‌లో దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 39 మంది దాకా మృతి చెందారు. మరో నలభై మంది గాయపడ్డారు.

అర్ధరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో (స్థానిక కాలమానం) ఓర్టాకో ప్రాంతంలో ఉన్న రెయినా నైట్ క్లబ్ పైన ఈ దాడి జరిగింది.

istanbul

దాడి జరిగినప్పుడు నైట్ క్లబ్‌లో వందలాది మంది ఉన్నారు. ఈ దాడి నుంచి తప్పించుకునేందుకు కొందరు పక్కనే ఉన్న బోస్పోరస్‌లోకి దూకారు. ఇది తీవ్రవాద దాడిగా ప్రాథమికంగా నిర్ధారించారు. గత ఏడాది కాలంగా ఇస్లామిక్ స్టేట్‌గా ఇస్తాంబుల్ నగరం లక్ష్యంగా ఉంది.

చనిపోయిన వారిలో ఇద్దరు భారతీయులు

కాల్పులు జరిపిన దుండగులు శాంటా క్లాజా దుస్తులు ధరించి వచ్చి ఘాతుకానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మృతి చెందిన 39 మందిలో ఇద్దరు భారతీయులు ఉన్నట్లు కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. మృతి చెందిన ఆ భారతీయులు అబిస్ రిజ్వి, ఖుషీ షాలు ఉన్నారు. అబిసి రిజ్వి మాజీ రాజ్యసభ సభ్యుడి తనయుడు. ఇక, ఖుషీ షా గుజరాత్‌కు చెందిన వ్యక్తి.

English summary
Reports say that the attackers was dressed in a Santa Claus costume. The attack took place at the Reina nightclub, in the Ortakoy area, at about 01:30 local time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X