వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఆటోఫిల్ ఆప్షన్' ఆన్ లో ఉందా? అయితే మీ కొంప మునిగినట్లే!

మీరు ఉపయోగిస్తున్న వెబ్ బ్రౌజర్ లో 'ఆటో ఫిల్' ఆప్షన్ గనుక ఆన్ లో ఉంటేవెంటనే దానిని డిజేబుల్ చేయమని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ఫిన్ లాండ్: మీరు ఉపయోగిస్తున్న వెబ్ బ్రౌజర్ లో 'ఆటో ఫిల్' ఆప్షన్ ఆన్ లో ఉందా? అయితే వెంటనే దానిని డిజేబుల్ చేసేయండి. లేదంటే మీ వ్యక్తిగత వివరాలు, ఆన్ లైన్ లావాదేవీల సమాచారమంతా సైబర్ నేరగాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది.

కొన్ని వెబ్ సైట్లలో రహస్యంగా టెక్స్ట్ బాక్సుల ద్వారా హ్యాకర్లు ఈ ఆటో ఫిల్ వివరాలను తస్కరిస్తున్నట్లు సైబర్ సెక్యూరిటీ నిపుణులు గుర్తించారు. సాధారణంగా మనం వాడుతున్న బ్రౌజర్ లో ఈ ఆటో ఫిల్ ఆప్షన్ ఎనేబుల్ అయి ఉన్నప్పుడు.. ఏదైనా వెబ్ సైట్ లో మనం రిజిస్టర్ అయి లావాదేవీలు నిర్వహించినప్పుడు మన వివరాలన్నీ బ్రౌజర్ లో స్టోర్ అయి ఉంటాయి.

మళ్ళీ ఎప్పుడైనా మన వివరాలు అవసరమైతే.. మన పేరు లేదా ఈ-మెయిల్ ఐడి టైప్ చేయగానే గతంలో మనం ఇచ్చిన మిగతా వివరాలన్నీ వచ్చేస్తాయి. చాలా మందికి ఇది ఉపయోగకరంగానే ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రతిసారీ వివరాలన్నీ టైప్ చేయాల్సిన బాధ తప్పుతుందని భావిస్తారు.

It's Danger If Autofil Option is in 'ON' in your Browser

కానీ అదే ఒక్కోసారి మనల్ని పెద్ద ప్రమాదంలో పడవేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా బ్రౌజర్ లో స్టోర్ అయి ఉన్న మన సమాచారాన్ని గుట్టుచప్పుడు కాకుండా సైబర్ నేరగాళ్ళు తస్కరించే వీలుందని ఫిన్ లాండ్ కు చెందినా ఎథికల్ హ్యాకర్ విజ్లమి కోస్మనెన్ గుర్తించారు.

కొన్ని వెబ్ సైట్లలో రహస్యంగా టెక్స్ట్ బాక్సులను ఉంచి హ్యాకర్లు వ్యక్తిగత వివరాలతో పాటు.. మన క్రెడిట్, డెబిట్ కార్డుల సమాచారాన్ని, పాస్ వర్డ్ ల సమాచారాన్ని సులువుగా దొంగిలిస్తారట. గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ ఫాక్స్, యాపిల్ సఫారీ, ఒపేరా వంటి ప్రముఖ బ్రౌజర్లతో కూడా ఈ సమస్య ఉన్నట్లు గుర్తించారు. అందుకే ఈ 'ఆటో ఫిల్' ఆప్షన్ ఆన్ లో ఉందో లేదో చూసుకుని, ఒకవేళ ఎనేబుల్ లో ఉంటే గనుక దానిని వెంటనే డిజేబుల్ చేయడం శ్రేయస్కరం అని సూచిస్తున్నారు.

English summary
It's Danger If Autofil Option is in 'ON' in your Browser. Cyber Security Professionals are telling that if it is enabled in your browser, it's easy for Hackers to capture your passwords and other individual information.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X