వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హర్ట్ బ్రేకింగ్ మిరాకిల్ బేబీ: చిన్నారి చుట్టూ 1616 సిరంజీలు, ఎందుకంటే?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

Today's Special Story టుడే స్పెషల్ స్టొరీ 23/08/018

న్యూఢిల్లీ: ఈ ఫోటోలో రెండు వారాల పాప చుట్టూ వందలు, వేలాది సిరంజిలు ఉన్నాయి. ఇదేదో గ్రాఫిక్స్ లేదా సరదాగా తీసింది కాదు. ఇది ఫోటోనే కానీ.. ఐవీఎఫ్ పుట్టిన ఈ చిన్నారి వ్యథకు ఇది నిదర్శనం. ఇటీవల ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) ద్వారా బిడ్డలను కనడం తెలిసిందే.

మహిళల అండాన్ని శరీరం బయట వీర్యకణంతో ఫలదీకరణ చేయడమే ఐవీఎఫ్. మహిళ అండాశయం నుంచి అండాన్ని బయటకు తీసి లేబరేటరీలోని ద్రవంలో వీర్యకణాలతో ఫలదీకరణ చేస్తారు. దాదాపు ఆర్రోజుల తర్వాత దానిని పరిశీలించి ఫలదీకరణ చెందిన అండాన్ని తిరిగి తల్లి గర్భాశయంలో గానీ వేరే మహిళ గర్భాశయంలో గాని ప్రవేశపెట్టి నెలలు నిండేలా చేస్తారు.

It took 4 years, 3 miscarriages and 1,616 shots to make this baby

ఇలా ఐవీఎఫ్ ద్వారా పుట్టిన బిడ్డ ఫోటో ఇది. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వెనుక ఉన్న సవాళ్లు, నరకయాతనను ఇది తెలియజేస్తుంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అన్ని సిరంజిలతో ట్రీట్మెంట్ పొందిన తర్వాతే ఆమె ఈ లోకాన్ని చూసింది. అందుకే తల్లిదండ్రులు ఆమెకు మిరాకిల్ బేబీ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. పాపకు లండన్ ఓనియల్ అని పేరు పెట్టారు.

ప్యాట్రిసియా, కింబెర్లీ ఓనియల్‌లు నాలుగేళ్లు పిల్లల కోసం ఐవీఎఫ్ ద్వారా ప్రయత్నించారు. దాదాపు ఏడు ప్రయత్నాలు తర్వాత ఈ పాప 1616 సిరంజీలతో ట్రీట్మెంట్ పొందిన తర్వాత జన్మను ఇచ్చింది. ప్యాట్రిసియాకు రెండేళ్ల క్రితం రెండుసార్లు గర్భస్రావాలు అయ్యాయి.

ఆ తర్వాత వైద్యులు ధైర్యం చెప్పడంతో మళ్లీ ఐవీఎఫ్‌కు అంగీకరించారు. ఏడో ప్రయత్నంలో చాలా ట్రీట్మెంట్ల తర్వాత గర్భవతి అయింది. ఆ తర్వాత ఆమె ఆగస్ట్ 3న బిడ్డకు జన్మను ఇచ్చింది. ఏడు ఫెయిలైన తర్వాత, ఎన్నో ట్రీట్మెంట్ల తర్వాత పుట్టిన ఈ బిడ్డకు గుర్తుగా ఓ ఫోటో తీయాలని తల్లిదండ్రులు భావించారు.

ఈ సందర్భంగా ఐవీఎప్‌కు ఉపయోగించిన 1616 సిరంజీలను లవ్ సింబల్‌గా అలంకరించి, వాటి మధ్యలో చిన్నారిని ఉంచి ఫోటో తీశారు. దీనిని ఆగస్ట్ 10న ఫేస్‌బుక్‌లో అప్ లోడ్ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల అయింది. ఆ తల్లికి నాలుగేళ్లలో మూడు గర్భస్రావాలు కాగా నాలుగోసారి బిడ్డకు జన్మను ఇచ్చింది.

English summary
This photo is testament to an undying hope in the face of heartbreak after heartbreak.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X