• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఛీ..ఛీ.. ఏంటీ పాడుపని : బౌద్ధాలయంలో ఆ కపుల్ బ్లూఫిల్మ్ షూటింగ్.. పెద్ద ఎత్తున విమర్శలు

|

మయన్మార్: మయన్మార్ బౌద్ధులకు ప్రసిద్ధి. అక్కడ ఎటు చూసిన బౌద్ధాలయాలే కనిపిస్తాయి. అలాంటి పుణ్యక్షేత్రంలో గలీజు పనికి పాల్పడింది ఓ జంట. అత్యంత పవిత్రంగా భావించే బౌద్ధాలయంను తమ వికృత చేష్టలతో భ్రష్టు పట్టించారు. పవిత్రంగా భావించే బౌద్ధాలయంలో ఈ జంట ఏమి చేశారో తెలుసా..?

బౌధ్దాలయంలో శృంగారం

బౌధ్దాలయంలో శృంగారం

ప్రపంచంలో శృంగారంతో కూడిన ఏ చర్య అయినా ఇట్టే దావనంలా పాకిపోతోంది. అంతేకాదు కొందరు క్రియేటివిటీ పేరుతో అసహ్యం కలిగేలా వ్యవహరిస్తున్నారు. ఎంతో ప్రశాంతంగా ఉండే పుణ్యక్షేత్రాల్లో కూడా పాపపు పనులు చేసి పాపం మూటగట్టుకుంటున్నారు. అలాంటి గలీజు పనే మయన్మార్‌లో చోటుచేసుకుంది. ఓ పోర్న్ వెబ్‌సైట్ కోసం ఓ జంట బౌద్ధాలయంలో శృంగారంకు దిగారు. జుగుప్సాకరంగా ఉన్న శృంగారంను కెమెరాతో చిత్రీకరించారు. ఈ జంట తరచూ ఆ పోర్న్ వెబ్‌సైట్‌ కోసం శృంగార భరిత షార్ట్ ఫిలిమ్స్ షూట్ చేస్తుంటారు.

  Evening News Express : 3 Minutes 10 Headlines | Pollution Free Hyderabad | Nithyananda
   12 నిమిషాల నిడివి ఉన్న శృంగార చిత్రం షూటింగ్

  12 నిమిషాల నిడివి ఉన్న శృంగార చిత్రం షూటింగ్

  మయాన్మార్‌లోని బగాన్‌లో ఉన్న బౌద్ధ పుణ్యక్షేత్రంకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఈ ఆలయంను యూనెస్కో వారసత్వ సంపదగా కూడా ప్రకటించింది. ఈ ఆలయంను ఏటా కొన్ని లక్షల మంది బౌద్ధులు సందర్శిస్తారు. అలాంటి పుణ్యక్షేత్రంలో ఓ పోర్న్ వెబ్‌సైట్ కోసం 12 నిమిషాల నిడివి ఉన్న వీడియోను ఈ కపుల్ షూట్ చేశారు. అనంతరం పోర్న్ వెబ్‌సైట్‌పై పోస్టు చేయడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ జంట ఇటలీకి చెందిన వారిగా గుర్తించారు. శరీరం మొత్తం టాటూలతో నింపుకుని ఆలయం వద్ద నగ్నంగా ఉండి చిత్రీకరణ చేశారు.

   ఈ కపుల్ చేసే వీడియోలకు భారీగా సబ్‌స్క్రైబర్స్

  ఈ కపుల్ చేసే వీడియోలకు భారీగా సబ్‌స్క్రైబర్స్

  ఇక మంచికంటే చెడు అతి వేగంగా చొచ్చుకెళుతోంది అనేదానికి ఈ ఇటలీ జంటే ఉదాహరణ. వీరు తీసే శృంగార భరిత వీడియోలకు 81వేల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. 11 నెలల క్రితం వీరు పోర్న్‌సైట్ పై వీడియోలను పోస్టు చేయడం ప్రారంభించగా 35 మిలియన్ వ్యూస్ వచ్చాయంటే వీరు ఏ రేంజ్‌లో రెచ్చిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే బగాన్‌లోని చారిత్రాత్మక పగోడ దగ్గర షూట్ చేసిన వీడియోకు లైక్స్ కంటే ఎక్కువగా విమర్శలే వచ్చాయి. పవిత్రమైన గడ్డపై ఈ పాడు పనేంటంటూ నెటిజెన్లు సోషల్ మీడియా వేదికగా విమర్శలు సంధించారు.

  విమర్శలు ఎక్కుపెట్టిన నెటిజెన్లు

  విమర్శలు ఎక్కుపెట్టిన నెటిజెన్లు

  ఇక గురువారం నాటికి ఈ వీడియోను మిలియన్‌లో నాలుగోవంతు మంది వీక్షించారు. కానీ ఈసారి లైక్స్ కంటే రెట్టింపు స్థాయిలో డిస్‌లైక్స్ వచ్చాయి. ఇందుకు వారు ఎంచుకున్న ప్రదేశమే కారణమని తెలుస్తోంది. ఇక బగాన్‌లో ఇలాంటి అశ్లీల షూటింగ్‌లు ఎలా జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు న్యూ ఫెంటాస్టిక్ ఏషియా టూర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ తున్ తున్ నయింగ్. ఇలాంటి నీలిచిత్రాల షూటింగ్ జరుగుతోందంటే అక్కడ భద్రతా ఎలా ఉందో తెలుస్తోందని మండిపడ్డారు. వెంటనే ఈ షార్ట్ ఫిలింలో నటించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  English summary
  Outrage is growing in Myanmar after the emergence of a 12-minute porn video shot in Bagan, the country''s best-known tourist hotspot and UNESCO heritage site of thousands of hallowed Buddhist pagodas.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more