వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఊఫ్.. బిగ్ రిలీఫ్..! ఊపిరి పీల్చుకుంటున్న ఇటలీ.. తక్కువగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య..!!

|
Google Oneindia TeluguNews

రోమ్/హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విళయ తాండవం వల్ల అగ్రదేశాలు విలవిలలాడుతున్న సంగతి తెలిసిందే. అమెరికాతో పాటు ముఖ్యంగా ఇటలీలో కూడా కరోనా వైరస్ స్వైర విహారం చేసింది. మొదట ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకంటే ఇటలీ లోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉండేది. అయితే అగ్ర దేశమైన అమెరికాలో కూడా కరోనా విజృంభించడంతో కరోనా మరణాల అంశంలొ ఆదేశం ఇటలీని మించిపోయింది. అంతే కాకుండా ఇటలీలో కొన్ని రోజులుగా వందల మంది ప్రాణాలు కోల్పోతుండటంతో ప్రజలు భయ బ్రాంతులకు గురయ్యారు. అయితే ఇలాంటి క్లిష్ట సమయంలో ఇటలీ ప్రజలకి కొంత ఊరట కలిగే వార్త వినిపించింది ఆదేశ ప్రభుత్వం.

 Italy is in big releaf,Recording the lowest number of corona cases..!

తాజాగా ఇటలీ ప్రభుత్వం వెలువడించిన హెల్త్ బులిటెన్ లెక్కలు ఆ దేశ ప్రజల్లో ఉపశమనం కలిగించేవిగా ఉన్నట్టు తెలుస్తోంది. దేశంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య తక్కువగా నమోదైందని తెలిపింది. ఫ్రెంచ్ సివిల్ ప్రొటెక్షన్ సర్వీస్ వెల్లడించిన లెక్కల ప్రకారం 1,08,237 మంది కరోనా మహమ్మారితో రోమ్ నగరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. సివిల్ ప్రొటెక్షన్ సర్వీస్ ఉన్నతాదికారి ఏంజెలో బోరెల్లి ఇందుకు సంబందించన సమాచారాన్ని ప్రజలకు వినిపించారు. అంతే కాకుండా తొలిసారిగా కరోనా విషయంలో సానుకూల సంకేతాలు వచ్చాయన్నారు బోరెల్లి. ప్రస్తుతం కరోనా బారినపడ్డ వారి సంఖ్య అనూహ్యంగా తగ్గిందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కరోనా వైరస్ మహమ్మారి బారినపడి సుమారు 23,660 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలిపారు. తాజాగా కొనసాగుతున్న లాక్ డౌన్ ఆంక్షల వల్ల వ్యాది వ్యాప్తి చేందకుండా కట్టడి చేయగలిగామని ఆయన అన్నారు.

English summary
The latest health bulletin released by the Italian government seems to be a relief to the people of that country. The number of coronary positive cases in the country is low.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X