వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లవ్ ఇన్ పార్లమెంట్: నన్ను పెళ్లి చేసుకుంటావా..సభలో ప్రేయసికి ఎంపీ ప్రపోజల్

|
Google Oneindia TeluguNews

ఎవరైనా ప్రపంచంలో అత్యంత రొమాంటిక్ ప్రదేశం ఏంటని అడిగితే టక్కున వచ్చే సమాధానం ఇటలీ, వెనిస్, లేదా రోమ్. కానీ ఇక్కడ ఓ ఎంపీ మాత్రం తనకు పార్లమెంటుకు మించిన రొమాంటిక్ ప్రదేశం మరొకటి లేదని చెబుతున్నాడు. పార్లమెంటులో హీటెడ్ డిబేట్ జరుగుతుండగా ఓ ఎంపీ తన ప్రేయసికి ప్రపోజ్ చేసి వార్తల్లో నిలిచారు. ఇంతకీ ఈ ప్రపోజల్ ఎక్కడ జరిగింది..?

లవ్ ఇన్ పార్లమెంట్

ఇటలీ పార్లమెంటులో ఓ వింత ఘటన జరిగింది. అప్పటి వరకు భూకంపం తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యలపై వాడీ వేడీ చర్చ జరిగింది. ఆ హీటెడ్ డిబేట్‌లో ఎంపీ ఫ్లావియో డి మురో కూడా పాల్గొన్నారు. ఆయన లీగ్ పార్టీకి చెందిన ఎంపీ. ఆయన మాట్లాడిన తర్వాత తన జేబులో నుంచి ఓ ఉంగరంను తీసి ఎక్కడో ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చున్న తన ప్రేయసి ఎలీసా డి లియో వంక చూస్తూ నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ ప్రపోజ్ చేశారు. పక్కనే తన సహచర ఎంపీలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. మరో ఇద్దరు ఎంపీలు సంతోషంతో ఫ్లావియో దగ్గరకు వచ్చి షేక్‌హ్యాండ్ ఇచ్చారు.

 డిబేట్ తర్వాత మ్యారేజ్ ప్రపోజల్

డిబేట్ తర్వాత మ్యారేజ్ ప్రపోజల్

డిబేట్‌లో పాల్గొన్న ఎంపీ ఫ్లావియో ఈ రోజు తనకు చాలా ప్రత్యేకమని చెప్పారు. ఇది మిగితా రోజులకంటే స్పెషల్ అని చెప్పారు. ఆ తర్వాత తనతో పాటు తెచ్చుకున్న ఉంగరంను తీసుకుని గ్యాలరీలో కూర్చున్న వారితో తాను మాట్లాడతున్నట్లు చెప్పారు. ఆయన ప్రేయసి డి లియో వైపు ఉంగరం చూపుతూ ఎలీసా నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ ప్రపోజ్ చేశారు. ఫ్లావియో ప్రపోజల్ అక్కడి సభ్యులను మెప్పించినప్పటికీ.. స్పీకర్ మాత్రం చాలా అసహనం వ్యక్తం చేశారు. తన ప్రేయసిపై ఉన్న ప్రేమన అర్థం చేసుకోగలనని అయితే ఇందుకు పార్లమెంటును వేదికగా చేసుకోరాదని స్పీకర్ వారించారు. ఇదిలా ఉంటే ఫ్లావియో కపుల్‌ను అందరూ అభినందించాలని మరో ఎంపీ స్టెఫానియా పెజోపేన్ చెప్పారు.

 ప్రపోజల్‌కు పార్లమెంటునే ఎందుకు ఎంచుకున్నారంటే..?

ప్రపోజల్‌కు పార్లమెంటునే ఎందుకు ఎంచుకున్నారంటే..?

ఇదిలా ఉంటే ఫ్లావియో జంట ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గతేడాది మార్చిలో ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే ప్రపోజ్ చేసేందుకు పార్లమెంటునే ఎందుకు ఎంచుకున్నారో కూడా చెప్పారు ఫ్లావియో. ఎలీసా తనకు చాలా దగ్గర వ్యక్తి అని ఫ్లావియో చెప్పారు. వ్యక్తిగతంగా, రాజకీయంగా, తన రాజకీయ జీవితం మొత్తంలో ఎలీసా ఉందని చెప్పారు. అందుకే తన ప్రేమను వ్యక్తం చేసేందుకు పార్లమెంటును వేదికగా చేసుకున్నట్లు చెప్పారు.

English summary
An Italian politician proposed to his girlfriend in the middle of a parliamentary debate on Thursday as she watched on from the public gallery above.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X