వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సముద్రంలో 26 మంది అమ్మాయిల మృతదేహాలు, లైంగికంగా వేధిస్తారని..

మధ్యదరా సముద్రంలో 26 మంది అమ్మాయిల మృతదేహాలను ఇటలీ అధికారులు గుర్తించారు. సముద్రంలో రెక్కీ నిర్వహిస్తున్న సమయంలో ఈ మృతదేహాలు కన్పించాయి.

|
Google Oneindia TeluguNews

రోమ్: మధ్యదరా సముద్రంలో 26 మంది అమ్మాయిల మృతదేహాలను ఇటలీ అధికారులు గుర్తించారు. సముద్రంలో రెక్కీ నిర్వహిస్తున్న సమయంలో ఈ మృతదేహాలు కన్పించాయి.

అప్రమత్తమైన అధికారులు సహాయక సిబ్బంది సాయంతో గాలించి మృతదేహాలను వెలికితీశారు. వీరి వయసు 14 నుంచి 18ఏళ్ల మధ్య ఉందని తెలుస్తోంది. నైజర్‌, నైజీరియా దేశాలకు చెందిన వలసదారులు అయి ఉంటారని భావిస్తున్నారు.

Italy Probes Deaths of 26 Nigerian Women from Migrant Boats

మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. లిబియా నుంచి ఓడలో యూరప్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు.

లిబియాలో అమ్మాయిల అక్రమ రవాణా ఎక్కువగా ఉంటుంది. వివిధ దేశాల నుంచి ఇక్కడకు అమ్మాయిలను తీసుకొచ్చి వారిని లైంగికంగా వేధిస్తుంటారు. ఆ నరకం నుంచి తప్పించుకునేందుకు కొందరు అమ్మాయిలు ఇలా సముద్రాన్ని దాటే ప్రయత్నం చేసి ప్రాణాలు కోల్పోతున్నారు.

English summary
Italian prosecutors are investigating the deaths of 26 Nigerian women – most of them teenagers – whose bodies were recovered at sea. According to the BBC, there are suspicions that they may have been sexually abused and murdered as they attempted to cross the Mediterranean.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X