వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లైంగిక దాడి కేసు.. ఆ హాలీవుడ్ నిర్మాతను దోషిగా తేల్చడంపై ట్రంప్ రియాక్షన్ ఇదీ..

|
Google Oneindia TeluguNews

హాలీవుడ్ బడా నిర్మాత హార్వే వెయిన్‌స్టీన్‌ను లైంగిక దాడి కేసులో కోర్టు దోషిగా తేల్చడం మహిళలకు లభించిన పెద్ద విజయం అన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ తీర్పు సమాజానికి బలమైన సందేశాన్ని పంపించిందన్నారు. తాను హార్వే వెయిన్‌స్టీన్‌కు ఎప్పుడూ అభిమానిని కాదని.. అతను తనను ఓడించాలనుకున్నాడని అన్నారు. కేసు గురించి తనకు పెద్దగా తెలియదని.. అతని గురించి కొద్దిగా తెలుసునని.. అతన్ని తాను ఇష్టపడనని చెప్పారు. కానీ డెమోక్రాట్లు వెయిన్‌స్టీన్‌ను ఇష్టపడుతారని.. మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా,హిల్లరీ క్లింటన్ కూడా అతన్ని ఇష్టపడుతారని ట్రంప్ పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడారు.

కాగా,ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాత హార్వే వెయిన్‌స్టీన్‌‌ను లైంగిక వేధింపుల కేసులో న్యూయార్క్ న్యాయస్థానం దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు హాలీవుడ్‌లోని అత్యంత శక్తివంతమైన నిర్మాతలలో ఒకరైన వెయిన్‌స్టీన్ (67), 2006లో మాజీ ప్రొడక్షన్ అసిస్టెంట్ మిమి హాలేపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కోర్టు తేల్చింది. అలాగే 2013 లో ఔత్సాహిక నటి జెస్సికా మన్‌పై కూడా అత్యాచారం చేసినట్టు తేల్చింది. అతనిపై ఉన్న మొత్తం ఐదు అభియోగాల్లో రెండింటిలో దోషిగా తేలింది. ఈ కేసుల్లో అతనికి 25 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. వెయిన్‌స్టీన్ లాంటి బడా ప్రొడ్యూసర్‌కి శిక్ష పడటాన్ని మీటూ సాధించిన విజయంగా భావిస్తున్నారు.

its a great victory for women trump reaction over Harvey Weinsteins conviction

వెయిన్‌స్టీన్‌పై మొత్తం 80 నటీమణులు,మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఇందులో ప్రముఖ నటీమణులు ఏంజెలినా జోలీ, గ్వైనెత్‌ పాల్ట్రో,మెరిల్‌ స్ట్రీప్‌, జెన్నిఫర్‌ లారెన్స్‌, కేట్‌ విన్‌స్లెట్‌ వంటి నటీమణులుఉన్నారు. అయితే వెయిన్‌స్టీన్ మాత్రం పరస్పర అంగీకారంతోనే శృంగారంలో పాల్గొన్నామని.. తానెవరిపై అత్యాచారానికి పాల్పడలేదని పలుమార్లు వెల్లడించాడు.అయితే కోర్టు విచారణలో మాత్రం అతను దోషిగా తేలింది.

English summary
Harvey Weinstein's conviction of rape and sexual assault was a "great victory" for women and sends a "very strong message", US President Donald Trump said on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X