• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇది ఆరంభం మాత్రమే.. కరోనాపై అమెరికన్ నిపుణుడి సంచలనం.. అదొక్కటే మార్గం...

|

ఎబోలా,హెచ్ఐవి వైరస్‌లతో పోలిస్తే కరోనా వైరస్ మరింత ప్రమాదకరమని.. తన కెరీర్‌లో తనను అత్యంత భీతిగొల్పిన వైరస్ ఇదేనని అమెరికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ&ఇన్ఫెక్షియస్ డిసీజ్(NIAID) చీఫ్ డా.ఆంటోని ఫౌసీ అభిప్రాయపడ్డారు. కేవలం నాలుగు నెలల కాలంలో కరోనా వైరస్ ప్రపంచాన్ని నాశనం చేసిందన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనాపై పోరుకు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్‌‌లోనూ ఫౌసీ సభ్యుడిగా ఉన్నారు. తాజాగా బయో డిజిటల్ వర్చువల్ హెల్త్ కాన్ఫరెన్స్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఫౌసీ కరోనా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

  Coronavirus 'worst nightmare' & Is 'far from over' - Anthony Fauci
  వాటి కంటే చాలా సంక్లిష్టమైనది..

  వాటి కంటే చాలా సంక్లిష్టమైనది..

  1918లో వ్యాప్తి చెందిన ఫ్లూ కంటే కరోనా వైరస్ చాలా ప్రమాదకరమని ఫౌసీ పేర్కొన్నారు.హెచ్ఐవి,ఎబోలా వైరస్‌ల కంటే కరోనా వైరస్ మరింత సంక్లిష్టమైనదని తెలిపారు. ఎబోలా ప్రాణాంతకమైన వైరసే అయినప్పటికీ.. ఇంత సులువుగా అది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే రకం కాదన్నారు. చాలావరకు అంటువ్యాధులు స్థానికంగానే ఎక్కువగా వ్యాప్తి చెందుతాయని.. కానీ కరోనా అందుకు భిన్నంగా ఉందని చెప్పారు. గతంలో, ప్రపంచం కనీసం కొన్ని లక్షణాలను కలిగి ఉన్న వైరస్ వ్యాప్తిని చూసింది కానీ COVID-19 లో ఆ లక్షణాలన్నీ కలిపి ఉన్నాయని పేర్కొన్నారు.

  ఇది ఆరంభం మాత్రమే..

  ఇది ఆరంభం మాత్రమే..

  'ఈ వైరస్ ఎక్కడ అంతమవుతుందో.. ఇప్పటికైతే వైరస్‌ను అర్థం చేసుకోవడంలో మనం ఇంకా ఆరంభ దశలోనే ఉన్నాం. అని ఫౌసీ పేర్కొన్నారు. కాబట్టి కరోనాపై సుదీర్ఘ కాలం పోరాటం చేయాల్సి ఉంటుందన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. 'ప్రపంచం మొత్తానికి వ్యాక్సిన్స్ అవసరం ఉంటుంది.. కాబట్టి బిలియన్ల డోసుల వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే.. వ్యాక్సిన్ రంగంలో ఒకరి కంటే ఎక్కువ విన్నర్స్ అవసరం ఉంటుంది.' అని చెప్పుకొచ్చారు.

  చరిత్రలో కనివినీ ఎరగని వైరస్..

  చరిత్రలో కనివినీ ఎరగని వైరస్..

  ఒకవేళ కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే... దాని ధరపై కూడా నియంత్రణ అవసరమన్నారు ఫౌసీ. కరోనా వైరస్‌ సోకిన పేషెంట్‌కి అసలేం జరుగుతుంది.. తిరిగి కోలుకుంటాడా.. దీర్ఘకాలంలో ఈ ఇన్ఫెక్షన్స్ ద్వారా ఉండే ఎఫెక్ట్స్ ఏంటి..? విషయాలను ఇంకా పూర్తిగా అర్థం చేసుకోవాల్సి ఉందన్నారు. చరిత్రలో ఇప్పటివరకూ ఇలాంటి పరిస్థితిని భూమండలం ఎప్పుడూ ఎదుర్కొలేదని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 200 పైచిలుకు దేశాలు షట్ డౌన్‌లో ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.

  ఆ కమ్యూనిటీలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలన్న ఫౌసీ..

  ఆ కమ్యూనిటీలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలన్న ఫౌసీ..

  కోవిడ్-19 అమెరికా హెల్త్ కేర్ వ్యవస్థలో లోపాలను బయటపెట్టిందన్నారు. ప్రజారోగ్య సంక్షోభం నుంచి బయటపడగానే ప్రభుత్వం దానిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కరోనాతో ఎక్కువ ఎఫెక్ట్ అయిన ఆఫ్రికన్ అమెరికన్ కమ్యూనిటీలపై కూడా ఫోకస్ పెట్టాలన్నారు. కంప్యూటర్ ముందు కూర్చొని టెలీ వర్క్ చేసే ఉద్యోగాల కంటే,ఇతరత్రా ఉద్యోగాల్లోనే వారు ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు. మీరు కేవలం ఇంటరాక్ట్ అయ్యే చోట.. వారు శారీరకంగా చాలా కష్టపడుతున్నారని చెప్పారు.

  English summary
  President Trump’s infectious disease expert Dr. Anthony Fauci on Tuesday called the coronavirus his “worst nightmare” and warned that the fight against its spread is far from over.The bleak outlook from Fauci, the director of the National Institute of Allergy and Infectious Diseases, comes as the US continues to slowly reopen from lockdown while grappling with massive protests in cities over the police killing of George Floyd.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more