వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ కుమార్తెకు పరాభవం : విమానం నుంచి ప్రయాణికుడి దించివేత

అమెరికా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ పై దూషణకు దిగిన ఓ ప్రయాణికుడిని ఎయిర్ లైన్స్ సిబ్బంది విమానంలోంచి బలవంతంగా దింపివేసిన ఉదంతమిది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ పై దూషణకు దిగిన ఓ ప్రయాణికుడిని ఎయిర్ లైన్స్ సిబ్బంది విమానంలోంచి బలవంతంగా దింపివేసిన ఉదంతమిది. న్యూయార్క్ లోని జాన్ ఎఫ్ కెన్నడీ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. గురువారం ఇవాంకా తన భర్తతో కలిసి జెట్ బ్లూ ఎయిర్ లైన్స్ విమానంలో శాన్ ఫ్రాన్సిస్కో కు వెళుతున్న సమయంలో తోటి ప్రయాణికుడు ఒకరు ఆమెతో వాగ్వివాదానికి దిగాడు. ఈ విషయం మరో ప్రయాణికుడు మార్క్ షెఫ్ ద్వారా బయటపడింది.

గుర్తు తెలియని ప్రయాణికుడు ఒకరు విమానంలోని ఇవాంకా వద్దకు వెళ్లి " ఓ మై గాడ్.. ఇది నిజంగానే నాకు పీడకల.. మీరు దేశాన్నే కాదు, విమానాలనూ వదిలిపెట్టడం లేదు.." అంటూ ట్రంప్ కుటుంబాన్ని కించపరిచే విధంగా మాట్లాడినట్లు మార్క్ షెఫ్ తెలిపాడు.

దీనిపై జెట్ బ్లూ ఎయిర్ లైన్స్ సిబ్బంది మాట్లాడుతూ.. ఇవాంకా, ఆమె భర్తతో ఆ ప్యాసింజర్ దురుసుగా ప్రవర్తించాడని, వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాడని, తమ సిబ్బంది వారించినా వినిపించుకోలేదని తెలిపారు.

వెళ్లి సీట్లో కూర్చోవాలని సూచించినప్పటికీ మాటలు పేల్చుతూనే ఉన్నాడని, ఇతర ప్రయాణికులకు అసౌకర్యం కలగకూడదనే భావనతో సదరు ప్రయాణికుడిని విమానం నుంచి దింపివేసినట్లు తెలిపారు. అయితే మరో విమానంలో అతడికి అవకాశం ఇచ్చి సహకరించామని వారు వివరించారు.

అయితే, సదరు ప్రయాణికుడు ట్రంప్ కుమార్తెను ఉద్దేశించి ఇంకా ఏమేం వ్యాఖ్యలు చేశాడన్నది జెట్ బ్లూ ఎయిర్ లైన్స్ సిబ్బంది పూర్తిగా బహిర్గతం చేయలేదు. అనుచిత వ్యాఖలకు పాల్పడిన ఆ ప్రయాణికుడు ఎవరన్నది కూడా వారు తెలియపరచలేదు.

English summary
The Brooklyn lawyer who was tossed off a JetBlue flight at Kennedy Airport for verbally attacking Ivanka Trump on Thursday morning quickly rushed out of the San Francisco airport once he arrived to the destination, hours after the future First Daughter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X