వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒబామా కూతురు మలియాకు ట్రంప్ కూతురు ఇవాంకా సపోర్ట్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కుమార్తె మలియా ఒబామాకు మద్దతుగా నిలిచారు ప్రస్తుత అధ్యక్ష, మాజీ అధ్యక్షుల కుమార్తెలు ఇవాంకా ట్రంప్, చెల్సియా. మలియా ఒబామా పొగ తాగుతున్నట్లు, ఓ యువకుడిని ముద్దాడుతున్నట్లు ఉన్న ఫొటోలు ఇటీవల కొన్ని ప్రతికలు, మీడియాల్లో ప్రచురితమయ్యాయి.

ఈ నేపథ్యంలో ఆమెపై పలు మీడియాల్లో వార్తులు దుమారం రేపాయి. దీంతో మలియాకు వ్యక్తిగత జీవితం ఉంటుందని, అది మీడియాకు అనవసరమని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా, మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ కుమార్తె చెల్సియా అన్నారు.

మోడీ, ట్రంప్ పిలుపుల్లో భేదాల్లేవ్! బంధం దృఢమే: ఇవాంకా ట్రంప్ మోడీ, ట్రంప్ పిలుపుల్లో భేదాల్లేవ్! బంధం దృఢమే: ఇవాంకా ట్రంప్

సాధారణంగా అధ్యక్షులు, మాజీ అధ్యక్షుల పిల్లల వ్యక్తిగత జీవితాలపై వార్తలు ఇచ్చేందుకు అక్కడి మీడియా దూరంగా ఉంటుంది. అయితే మలియా విషయంలో అలా జరగకపోవడంతో ఇవాంకా ట్రంప్‌, చెల్సియా క్లింటన్‌ మీడియాపై అసహనం వ్యక్తం చేశారు.

Ivanka Trump defends Malia Obama over smoking video

'మలియా ఒబామా ఇప్పుడు ఒక ప్రైవేటు సిటిజన్‌. ఆమె జీవితానికి ప్రైవసీ ఉంటుంది. మీడియా పరిమితుల్లో ఉండాల్సిన అవసరం ఉంది' అని ఇవాంకా ఘాటుగా ట్వీట్‌ చేశారు. ఇక చెల్సియా కూడా మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రపంచ 'ప్రత్యేక' విందుకు 'ఫలక్‌నుమా' రెడీ: మోడీ, ఇవాంకా, దిగ్గజాల రాకప్రపంచ 'ప్రత్యేక' విందుకు 'ఫలక్‌నుమా' రెడీ: మోడీ, ఇవాంకా, దిగ్గజాల రాక

'ఒక యువతిగా, కాలేజీ విద్యార్థిగా, ప్రైవేట్‌ సిటిజన్‌గా మలియా ఒబామాకు వ్యక్తిగత జీవితం ఉంటుంది.అది మీడియా ప్రజల దృష్టిని ఆకర్షించడానికి కాదు. కాస్త ఉన్నతంగా ఉండండి' అని చెల్సియా మీడియాకు హితవు పలికారు. వీరి ట్వీట్లకు భారీ సంఖ్యలు నెటిజన్లు మద్దతు పలుకుతున్నారు.

English summary
Ivanka Trump has taken a stand for her White House predecessor, Malia Obama, tweeting in her defence after a video of the former first daughter stirred controversy online.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X