వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడి రేసులో ఇవాంకా ట్రంప్?: అమెరికానే కీలకం

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ప్రపంచ బ్యాంక్ అత్యున్నత పదవికి జరుగుతున్న రేసులో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఆంగ్ల పత్రికలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుత ప్రపంచ బ్యాంక్ అధిపతి జిమ్‌ యంగ్‌ కిమ్‌ ఫిబ్రవరి ఒకటో తేదీన పదవి నుంచి వైదొలగనున్నారు.

ఆయన మరో ప్రయివేటు సంస్థలో బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో ప్రపంచ బ్యాంకు చీఫ్ (అధ్యక్ష) పదవి కోసం అన్వేషణ మొదలైంది. ఇప్పటి వరకు ప్రపంచ బ్యాంకులో అత్యధిక వాటా ఉన్న అమెరికా మద్దతు లభించిన వారికే అధ్యక్ష పదవి దక్కుతుంది. 1945లో ప్రపంచ బ్యాంక్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడి ఎన్నికలో అమెరికాదే కీలక పాత్ర.

ఇవాంకా ట్రంప్ పేరు కూడా

ఇవాంకా ట్రంప్ పేరు కూడా

ఈ నేపథ్యంలో అమెరికా ట్రెజరీ డిపార్టుమెంట్‌కు పలు నామినేషన్లు అందుతున్నాయి. వీటిలో డేవిడ్‌ మాల్పస్ (ట్రెజరరీ అండర్ సెక్రటరీ ఫర్ ఇంటర్నేషనల్ అఫైర్స్), మార్క్ గ్రీన్ (యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ హెడ్), నిక్కీ హేలీ (యూన్ అంబాసిడర్) వంటి పేర్లు ఉన్నాయి. ఇందులో ఇవాంకా ట్రంప్‌ పేరు కూడా ఉందని తెలుస్తోంది. ఇతర దేశాల నుంచి కూడా ఈ పదవికి పోటీ ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాయేతరులకు ఈ పదవి అప్పగించేందుకు అమెరికా ఆసక్తిగా ఆసక్తి చూపించకపోవచ్చునని అంటున్నారు.

అమెరికా అధ్యక్ష బరిలో హిందూ మహిళ: ట్రంప్‌పై పోటీకి తులసీ గబ్బార్డ్ సిద్ధంఅమెరికా అధ్యక్ష బరిలో హిందూ మహిళ: ట్రంప్‌పై పోటీకి తులసీ గబ్బార్డ్ సిద్ధం

అంతర్గత రివ్యూ

అంతర్గత రివ్యూ

ట్రెజరరీ డిపార్టుమెంట్ అధికార ప్రతినిధి ఒకరు ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ... అమెరికా నామినీస్ విషయంలో తాము అంతర్గతంగా రివ్యూ ప్రారంభించామని చెప్పారని తెలుస్తోంది. కొత్త అధ్యక్షుడిని (ప్రపంచ బ్యాంకు) ఎన్నుకునేందుకు గవర్నర్లతో కలిసి పని చేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు ప్రపంచ బ్యాంకుకు 12 మంది అధ్యక్షులుగా పని చేశారు.

సీనియర్ అడ్వయిజర్‌గా ఇవాంకా

సీనియర్ అడ్వయిజర్‌గా ఇవాంకా

కాగా, 37 ఏళ్ల ఇవాంకా ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడికి సీనియర్‌ అడ్వైజర్‌గా ఉన్నారు. జులైలో ఆమె తన ఫ్యాషన్‌ బ్రాండ్‌ను మూసివేసి వైట్ హౌస్ కార్యకలాపాలపై దృష్టి సారించారు. ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడు అయ్యాక ఆమె బ్రాండ్ల విక్రయాలు పడిపోయాయి.

English summary
US President Donald Trump's daughter and adviser Ivanka Trump is reportedly being considered for the position to head the World Bank. The Financial Times reports Ivanka is among a list of names submitted to the Treasury Department to replace current World Bank President Jim Yong Kim, who recently announced he would step down this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X