వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భుట్టో తర్వాత.. గర్భం దాల్చిన మహిళా ప్రధాని జసిండానే!

|
Google Oneindia TeluguNews

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌ ప్రధాని జసిండా ఆర్డర్న్‌(37) త్వరలో తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. కాగా, న్యూజిలాండ్‌లో ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ తల్లి కాబోతున్న తొలి మహిళ జసిండానే కావడం విశేషం. 2017 అక్టోబర్‌ 26న జసిండా న్యూజిలాండ్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.

కాగా, బిడ్డ పుట్టిన తరువాత ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నట్లు జసిండా వెల్లడించారు. ఆ సమయంలో ఆమె స్థానంలో ఉప ప్రధాని విన్‌స్టన్‌ పీటర్స్‌ బాధ్యతలు నిర్వహిస్తారు.

Jacinda Ardern: New Zealand PM reveals she is pregnant

సెలవుల్లో ఉన్నప్పటికీ కార్యాలయానికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకుంటూ అందుబాటులో ఉంటానని జసిండా తెలిపారు. అయితే తనకు పాప పుడుతుందా? బాబు పుడతాడా? అంటూ పలువురు మీడియా వర్గాలు ప్రశ్నిస్తున్నాయని.. తమకు ఎవరైనా తమకు ఒకటేనని అన్నారు.

అసలు తమకు పిల్లలు పుడతారన్న నమ్మకమే ఉండేది కాదని చెప్పారు. కాగా, జసిండా గర్భం దాల్చిందనే విషయం తెలిసిన పలువురు దేశాధినేతలు, ఉన్నతాధికారులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇది ఇలావుంటే.. ఒక దేశానికి ప్రధానిగా ఉంటూ తల్లైన తొలి మహిళ బెనజీర్‌ భుట్టో కావడం గమనార్హం. 1990లో పాకిస్థాన్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆమె బిలావల్‌ భుట్టోకు జన్మనిచ్చారు.

English summary
Ms Ardern said she and her partner, Clarke Gayford, were expecting their child in June, after which she planned to take a six-week break.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X