వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జసిండా అర్డెర్న్ ఘన విజయం: రెండోసారి ప్రధానిగా.. ప్రజలకు ధన్యవాదాలు..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ విజృంభించిన మొక్కవోని విశ్వాసంతో పనిచేశారు. ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. న్యూజిలాండ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. రెండోసారి వరసగా లేబర్ పార్టీ గెలుపొందింది. ఈ నెల 17వ తేదీన ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా 83.7శాతం ఓట్లు పోలవగా.. 49శాతం ఓట్లను లేబర్ పార్టీ దక్కించుకుంది.

న్యూజిలాండ్ పార్లమెంట్‌లో 120 స్థానాలు ఉన్నాయి. అయితే జసిండా లేబర్ పార్టీ 49.2 ఓట్లతో 64 సీట్లను సాధించి విజయదుందుభి మోగించింది. ఎన్నికల్లో ప్రతిపక్ష నేషనల్ పార్టీ కేవలం 27 శాతం ఓట్లను మాత్రమే సాధించింది. భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు జసిండా అర్డెర్న్ ధన్యవాదాలు తెలిపారు. తాము వచ్చే మూడేళ్లలో చేయాల్సిన పని చాలా ఉందని పేర్కొన్నారు. కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. న్యూజిలాండ్ అభివృద్ధికి శతవిధలా కృషి చేస్తానని తెలిపారు.

Jacinda Arderns Labour Party Wins New Zealand Election..

న్యూజిలాండ్‌లో జసిండా పార్టీ తొలిసారి పూర్తి మెజార్టీ సాధించారు. ఇదివరకు ఏ పార్టీ పూర్తి మెజార్టీ సాధించలేకపోయారు. 1996 తర్వాత మారిన ఎన్నికల సరళి తర్వాత జసిండా పార్టీ ఘన విజయం సాధించారు. లేబర్ పార్టీ విజయాన్ని ప్రతిపక్ష నేత కొలిన్స్ అంగీకరించారు. జసిండాకు అభినందనలు తెలిపారు.

Recommended Video

Dubbaka Bypoll : నిజామాబాద్ లో కాదు దుబ్బాక లో గెలిచి చూపించండి BJP Candidate Raghunandan Rao on TRS

షెడ్యూల్ ప్రకారం న్యూజిలాండ్‌లో సెప్టెంబర్ 19న ఎన్నికలు జరగాలి. కరోనా మహమ్మారి రెండోసారి విజృంభించడంతో అక్టోబర్ 17కు ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరోనా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న ప్రధానిగా జసిండా అర్డెర్న్‌ పేరుగాడించారు. అనుకున్నట్టే ఎన్నికల్లో ఆమెను ప్రజలు మరోసారి ఎన్నుకున్నారు.

English summary
Prime Minister Jacinda Ardern’s centre-left Labour Party won a landslide victory in New Zealand’s general election on Saturday as voters rewarded her for a decisive response to COVID-19
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X