• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బిజినెస్ టైకూన్ జాక్‌మా సెక్స్ టిప్స్: గారంగా ఉండండి...శృంగారం చేయండి..ఆరోగ్యంగా ఉండండి

|

చైనా: ఆయన ఓ గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్. ప్రపంచాన్ని ఏలాలన్న తపనతో చాలా కష్టపడి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ధనవంతుల్లో ఆయనొకరు. అప్పుడప్పుడు తన ఉద్యోగస్తుల్లో జోష్ నింపే మాటలు కూడా చెబుతుంటారు. అంతేకాదు ఆ మాటలే కొన్నిసార్లు వివాదాలకు కేరాఫ్‌గా మారుతున్నాయి. తాజాగా శృంగారం గురించి కామెంట్ చేసి మళ్లీ ప్రధానాంశాల్లో నిలిచారు. ఇంతకీ ఆ బిజినెస్ మ్యాన్ ఎవరు.. ఆయన చెప్పిన మాటలేవి... లెట్స్ రీడ్ దిస్ స్టోరీ...

పనిలో విజయం సాధించాలంటే 996 ఫార్ములా

పనిలో విజయం సాధించాలంటే 996 ఫార్ములా

జాక్ మా... పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తన ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ అలీబాబా ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచింది. ఓ పనిని ఇష్టపడి దానిపై కష్టపడితే విజయం దానంతటా అదే పరిగెత్తుకుంటూ వస్తుందని నమ్ముతారు. అందుకే వారి కంపెనీల్లో పనిచేసే ఉద్యోగస్తులకు కొన్ని టిప్స్ చెప్పి వారిని విజయం వైపు నడిపిస్తుంటారు. అదే సమయంలో తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటూ ఉంటారు. ఇక వారి ఎంప్లాయిస్ కోసం ఒక ఫార్ములా కూడా ఆయన కనిపెట్టారు. అదే 996 ఫార్ములా. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇలా 6 రోజుల్లో ఆఫీసులకే పరిమితం కావాలంటారు. ఈ ఫండాను ఫాలో అయినవారు కచ్చితంగా విజయం వైపు అడుగులు వేస్తారని చెబుతారు.

జీవితంలో విజయం సాధించాలంటే రోజూ శృంగారంలో పాల్గొనాల్సిందే

జీవితంలో విజయం సాధించాలంటే రోజూ శృంగారంలో పాల్గొనాల్సిందే

జాక్‌మా తాజాగా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి ప్రధాన వార్తల్లో నిలిచారు. ఈ సారి బిజినెస్ పై టిప్స్ ఇవ్వడం కాదు... శృంగార జీవితంపై మరో ఫార్ములా కనిపెట్టారు. ఇది కూడా తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తులకే చెప్పాడు. శృంగారంపై ఆసక్తి ఉన్నవారెవరైనా సరే ఈ ఫార్ములాను వినియోగించుకోవచ్చు. ఇంతకీ ఆయన చెప్పిన టిప్ ఏంటో తెలుసా.... అక్కడికే వస్తున్నాం. జీవితంలో విజయం సాధించాలంటే 996 ఫార్ములా అదే శృంగారంలో సక్సెస్ సాధించాలంటే 669 ఫార్ములాను ఇంప్లిమెంట్ చేయాలన్నారు . తమ బాస్ చెప్పిన ఈ 669 ఫార్ములా ఏంటో అర్థం కాక ఉద్యోగస్తులు తలలు పట్టుకున్నారు. ఏమై ఉంటుందబ్బా అని తమ మెదడుకు పదను పెట్టారు.

సెక్స్ ఫర్ సిక్స్ డేస్ సిక్స్ టైమ్స్

సెక్స్ ఫర్ సిక్స్ డేస్ సిక్స్ టైమ్స్

జాక్‌మా చెప్పిన ఆ 669 ఫార్ములాకు ఆయనే వివరణ ఇచ్చారు. ప్రతి ఏటా మే 10న అలీబాబా డే నిర్వహిస్తారు. చైనాలోని హాంగ్జౌలోని అలీబాబా హెడ్ క్వార్టర్స్‌లో ఘనంగా నిర్వహిస్తారు. ఈరోజున సామూహిక వివాహాలు చేస్తారు జాక్‌మా. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాక్‌మా ఎంప్లాయిస్‌తో సరదాగా ముచ్చటిస్తూ అందరినీ ఒక దగ్గరకు పిలిచారు. పనిలో విజయం సాధించాలంటే 996 ఫార్ములా వినియోగించాలని అదే జీవితంలో విజయం సాధించాలంటే 669 ఫార్ములాను అప్లై చేయాలని చెప్పారు. 669 అంటే "సెక్స్ ఫర్ సిక్స్ డేస్ సిక్స్ టైమ్స్" అని చెప్పగానే ఉద్యోగస్తులకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఆరో రోజులు ఆరు సార్లు శృంగారంలో పాల్గొంటే జీవితంలో విజయం తథ్యమని చెప్పారు.

 996 ఫార్ములా ఇంప్లిమెంట్ చేశాకా 669 ఫార్ములా సాధ్యమేనా..?

996 ఫార్ములా ఇంప్లిమెంట్ చేశాకా 669 ఫార్ములా సాధ్యమేనా..?

ఇక జాక్‌మా వ్యాఖ్యలపై నెటిజెన్లు తమదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. కొందరు సెక్స్ ఫార్ములాకు ఫిదా కాగా మరికొందరు మరోలా సమాధానం ఇచ్చారు. 996 ఫార్ములాను టెక్ ఇండస్ట్రీ విమర్శించగా... 669 ఫార్ములాపై మాత్రం కొంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. భూమి మీద మనిషన్న వాడు 996 ఫార్ములాను ఇంప్లిమెంట్ చేశాకా 669 ఫార్ములాను అమలు చేసేందుకు ఎవరికి ఓపిక ఉంటుంది చెప్పండంటూ కొందరు నెటిజెన్లు ప్రశ్నించారు. ఇక 669 ఫార్ములా అలీబాబా అధికారిక వెబ్‌సైట్‌ వెబోపై పోస్టు చేయడం జరిగింది.

English summary
Alibaba founder Jack Ma once again hit headlines with his sexist remarks.Jack Ma said if one have succeed in life he or she has to implement 669 formula which means sex for sixdays sixtimes. This took the netizens by storm each commenting in their own style.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X