వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుల్ భూషణ్ జాదవ్ నిర్ధోషిగా విడుదల అయ్యే సమస్యే లేదు: పాక్ న్యాయవాది ఖురేషీ

గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ ను నిర్ధోషిగా విడుదల చేసే ప్రసక్తేలేనది పాకిస్తాన్ న్యాయవాది ఖావర్ ఖురేషీ స్పష్టం చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ ను నిర్ధోషిగా విడుదల చేసే ప్రసక్తేలేనది పాకిస్తాన్ న్యాయవాది ఖావర్ ఖురేషీ స్పష్టం చేశారు.

కుల్ భూషణ్ జాదవ్ కేసుకు సంబంధించి అంతర్జాతీయ న్యాయస్థానం లో పాకిస్తాన్ తరపున ఖావర్ ఖురేసీ వాదనలు వినిపించారు. అయితే అక్కడ పాక్ చుక్కెదురు అయిన విషయం తెలిసిందే.

జాదవ్ కేసు చాలా స్పష్టమైందని, అతడిని ఎన్నటికీ నిర్ధోషిగా విడుదల చేయడం జరగదని నేషన్ వార్తాపత్రికకు ఉటంకించారు.అలాగన అంతర్జాతీయ న్యాయస్థానం అటు జాదవ్ ను నిర్ధోషిగా తేల్చలేదన్నారు.

Jadhav can never be released: Pakistani lawyer

ఇటు విడుదల చేయలేదని వివరించారు. ఆయన సోమవారం,నాడు ఇస్లామాబాద్ లో మీడియాతో మాట్లాడారు. భాద్యతాయుతంగా ప్రవర్తించిన పాకిస్తానీ అధికారులకు పాక్ మీడియా గౌరవించాలన్నారు. గూఢచర్యం ఆరోపణలపై పాకిస్తానీ మిలటరీ కోర్టు జాదవ్ కు ఉరిశిక్ష విధించగా అంతర్జాతీయ న్యాయస్థానం ఈ తీర్పుపై స్టే ఇచ్చిన విషయం తెలిసిందే.

కాగా, జాదవ్ కేసులో ఐసీజే లో ఎదురైన పరాభవంతో పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రతిపక్షాలు మీడియాతో పాటు న్యాయనిపుణులు సైతం ఈ వ్యవహరంలో ప్రభుత్వం అనుసరించిన తీరును తప్పుబడుతున్నారు.

దీంతో ఐసీజేలో జాదవ్ కేసు కోసం కొత్త న్యాయవాదుల బృందాన్ని ఏర్పాటు చేయాలని పాక్ సర్కార్ నిర్ణయించింది. మరో వైపు జాదవ్ కు పాక్ సైనిక కోర్టు విధించిన ఉరిశిక్షను అమలు చేయడంలో కింది కోర్టును విఫలమైందని ఇకనైనా ఆలస్యం చేయకుండా జాదవ్ ను తక్షణమే ఉరితీయాలంటూ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేత సెనేట్ మాజీ చైర్మెన్ ఫరూక్ నయీక్ తరపున న్యాయవాది ముజామిల్ అలీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

English summary
Alleged Indian spy Kulbhushan Jadhav, who has been sentenced to death by a military court, "can never be released or acquitted", a Pakistani lawyer said on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X