• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

'పవన్ కళ్యాణ్‌'లా: సాయానికి సిడ్నీ నుంచి గ్రీస్‌కు

By Nageswara Rao
|

గ్రీసులో నెలకొన్న ఆర్ధిక సంక్షోభం కారణంగా పెన్షన్ తీసుకోలేక, జీవనోపాధి కష్టమైపోయిందన్న బాధతో ఓ ముసలాయన థెస్సాలొంకీలోని ఓ బ్యాంకు బయట కుప్పకూలిన చిత్రం దాదాపుగా అన్ని దినపత్రికల్లో, సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లలో మీరు చూసే ఉంటారు.

77 ఏళ్ల ఆ వ్యక్తిని గుర్తు పట్టి, తన తండ్రి స్నేహితుడేనని ఆస్టేలియాకు చెందిన ఓ కంపెనీ చీఫ్ వెంటనే స్పందించి ఆ పెన్షనర్‌ను ఆదుకునేందుకు ఆస్టేలియా రాజధాని సిడ్నీ నుంచి గ్రీసు రాజధాని ఏథెన్స్‌కు వచ్చే వారంలో రానున్నట్లు తెలిపాడు.

'అత్తారింటికి దారేది' సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ తన తాత కోరిక మేరకు తన అత్తను తీసుకెళ్లేందుకు ఇటలీ నుంచి భారత్‌కు వస్తాడు. అదే విధంగా తన తండ్రి స్నేహితుడి కష్టాల తీవ్రతను చూసిన జేమ్స్ కౌఫోస్ కూడా ఆస్టేలియా నుంచి గ్రీసు రాజధాని ఏథెన్స్‌కు ఈ శనివారం పయనమవుతున్నాడు.

వివరాల్లోకి వెళితే, జియార్గాస్ చట్జిఫోటియాడిస్ అనే 77 ఏళ్ల పెన్షనర్ గతవారంలో థెస్సాలొంకీలోని ఓ బ్యాంకు ముందు తనకు రావాల్సిన 120 యూరోలను గ్రీసు ప్రభుత్వం ఇవ్వడం లేదని విలపిస్తూ కుప్పకూలాడు.

ఈ చిత్రాన్ని గ్రీసుతో పాటు యావత్ ప్రపంచంలోని మీడియా ప్రచురించింది. ఈ చిత్రం వల్లే గ్రీసులో ప్రజలు అనుభవిస్తున్న కష్టాల తీవ్రత గురించి ప్రపంచానికి తెలిసింది. ఈ చిత్రాన్ని ఆస్టేలియాకు చెందిన ఓ ఫైనాన్స్ సంస్ధ సీఈఓ జేమ్స్ కౌఫోస్ ఈ చిత్రాన్ని చూశాడు.

తన తండ్రికి జియోర్గాస్ స్నేహితుడని గుర్తించాడు. ఇద్దరూ కూడా చిన్ననాటి నుంచి ఒకే స్కూల్లో కలిసి విద్యాభ్యాసం చేశారు. ప్రస్తుతం గ్రీసులో బతికి ఉన్న తన తల్లితో మాట్లాడిన తక్షణమే అతనికి సాయం చేయాలని సూచించాడు.

అంతేకాదు ప్రస్తుతం జియార్గాస్ చట్జిఫోటియాడిస్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలని తన ఫేస్ బుక్‌ స్నేహితులను కోరాడు. ఆయన అడ్రస్‌ను తక్షణమే తనకు తెలియజేయాలని అటు స్నేహితులను, ఇటు మీడియా జర్నలిస్టులను కోరుతూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టాడు.

పవన్ కళ్యాణ్‌లా: సాయం చేసేందుకు సిడ్నీ నుంచి గ్రీస్‌కు

పవన్ కళ్యాణ్‌లా: సాయం చేసేందుకు సిడ్నీ నుంచి గ్రీస్‌కు


ఆయనకు సాయంగా ఉండేందుకు గాను తానొక ట్రస్టును కూడా ప్రారంభిస్తున్నట్టు తెలిపాడు. సిడ్నీలో తాను ఆనందంగా గడుపుతున్నానని.... ఒక మనిషి తన జీవితాంతం కష్టపడి చివరి దశలో తన కుటుంబాన్ని పోషించుకునేందుకు పెన్షన్ పొందలేకపోవడం కంటే అత్యంత దారుణం మరొకటి లేదన్నాడు.

పవన్ కళ్యాణ్‌లా: సాయం చేసేందుకు సిడ్నీ నుంచి గ్రీస్‌కు

పవన్ కళ్యాణ్‌లా: సాయం చేసేందుకు సిడ్నీ నుంచి గ్రీస్‌కు


వారానికి 250 యూరోలు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. నా తోటి గ్రీకు పౌరుడు ఆకలితో మరణించడాన్ని తాను చూడలేకపోతున్నానని పేర్కొన్నాడు. చివరకు ఆయన ఆచూకీ తెలుసున్న సీఈఓ జేమ్స్ కౌఫోస్ ఈ శనివారం సిడ్నీ నుంచి తన తండ్రి స్నేహితుడిని కులసుకునేందుకు ఏథెన్స్‌కు వెళ్లేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు.

పవన్ కళ్యాణ్‌లా: సాయం చేసేందుకు సిడ్నీ నుంచి గ్రీస్‌కు

పవన్ కళ్యాణ్‌లా: సాయం చేసేందుకు సిడ్నీ నుంచి గ్రీస్‌కు

అతను, అతని భార్య భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలనేది తన అభిమతమని సీఈఓ జేమ్స్ కౌఫోస్ పేర్కొన్నాడు. రుణ సంక్షోభంలో మునిగిన గ్రీస్‌ను అప్పులిచ్చి బయటకు తెచ్చేందుకు ఐఎంఎఫ్‌, ఇయు, యుసిబి (ఆర్ధిక త్రయం) బెయిల్‌ ఔట్‌ ప్యాకేజీతో ముందుకు వచ్చాయి.

పవన్ కళ్యాణ్‌లా: సాయం చేసేందుకు సిడ్నీ నుంచి గ్రీస్‌కు

పవన్ కళ్యాణ్‌లా: సాయం చేసేందుకు సిడ్నీ నుంచి గ్రీస్‌కు

ఇందులో భాగంగా పలు కఠినమైన షరతులను పెట్టాయి. అందులో వృద్ధాప్యపు పెన్షన్లు, నిరుద్యోగ పెన్షన్లు, ప్రజారోగ్యం, విద్య లాంటి ఖర్చులను తగ్గించుకోవాలని గ్రీసుకు సూచించింది. ఈ షరతులను తమ ఆత్మగౌరవానికి భంగంగా పేర్కొన్న గ్రీస్‌ ప్రభుత్వం వీటిని తిరస్కరించింది.

పవన్ కళ్యాణ్‌లా: సాయం చేసేందుకు సిడ్నీ నుంచి గ్రీస్‌కు

పవన్ కళ్యాణ్‌లా: సాయం చేసేందుకు సిడ్నీ నుంచి గ్రీస్‌కు

పైగా వీటిని అమలు చేస్తే ఇప్పటికే తీవ్రమైన మాంద్యంలో ఉన్న గీస్‌ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. నిరుద్యోగం పతాకస్థాయికి చేరే అవకాశం ఉంది. ఈ నేప థ్యంలో ఆర్థిక త్రయం షరతులపై ఏకంగా ప్రజాభిప్రాయాన్ని గ్రీస్‌ ప్రభుత్వం కోరింది. ఆదివారం నాటి ఓటింగ్‌లో 61.31 శాతం మంది ప్రజలు ప్రభుత్వ వాదనను సమర్ధించారు.

English summary
A businessman will fly half way around the world next week to pay the pension of an old family friend who has become the face of Greece's economic crisis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X