వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా నెత్తిన కొత్త పిడుగు: జపాన్ కంపెనీలు గుడ్‌బై..తరలిపోవడానికి రెడీ: ఏకాకిని చేసే ప్రయత్నమా?

|
Google Oneindia TeluguNews

టోక్యో: ప్రపంచానికి చావును సరికొత్తగా పరిచయం చేసిన చైనా నెత్తిన ఇప్పుడు మరో పిడుగు పడింది. కరోనా వైరస్ సృష్టించిన కల్లోలం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న ఈ కమ్యూనిస్టు దేశం.. మరో సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి సిద్ధపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పారిశ్రామిక రంగంలో ఆసియా దేశాల్లో అగ్రస్థానంలో కొనసాగుతోన్న చైనాను వదిలి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్నాయి పలు దేశాలు. చైనాలో ఉన్న తమ తయారీ యూనిట్లు, కంపెనీలను మూసివేయడానికి సన్నద్ధమౌతున్నాయి.

Recommended Video

Japan Companies All Set To Leave China | చైనా కి జపాన్ కంపెనీలు గుడ్‌బై!!

వైఎస్ జగన్‌కు రతన్ టాటా లేఖ: ఏపీని ఆదుకుంటామంటూ భరోసా: భారీగా సాయానికి హామీ..!వైఎస్ జగన్‌కు రతన్ టాటా లేఖ: ఏపీని ఆదుకుంటామంటూ భరోసా: భారీగా సాయానికి హామీ..!

జపాన్ కంపెనీలన్నీ వెనక్కి..

జపాన్ కంపెనీలన్నీ వెనక్కి..

ఈ విషయంలో జపాన్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. చైనాలో చాలాకాలం నుంచి పనిచేస్తోన్న తమ దేశీయ కంపెనీలన్నింటిని వెనక్కి పిలిపించుకుంటున్నట్లు జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఆయా సంస్థలన్నీ స్వదేశానికి లేదా, ఇతర దేశాలకు తరలడానికి అవసరమైన చర్యలను చేపట్టినట్లు వెల్లడించింది. దీనికోసం కోట్ల రూపాయల మొత్తాన్ని కేటాయించింది కూడా. 220 బిలియన్ యెన్‌లను ప్రధానమంత్రి షింజో అబే మంజూరు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

రీలొకేట్ తప్పనిసరి..

రీలొకేట్ తప్పనిసరి..

ప్రస్తుతం చైనాలో వందల సంఖ్యలో జపాన్‌కు చెందిన కంపెనీలు, తయారీ యూనిట్లు మ్యానుఫ్యాక్షరింగ్ జోన్లు పని చేస్తున్నాయి. ఈ రెండు ఆసియా దేశాల మధ్య ఉన్న దౌత్య సంబంధాల మేరకు జపాన్.. తన కంపెనీలను పెద్ద ఎత్తున చైనాలో నెలకొల్పింది. దాదాపుగా అవన్నీ మ్యానుఫ్యాక్షరింగ్ యూనిట్లే. భయానక కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తరువాత చైనాలో నెలకొన్న తాజా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వాటన్నింటినీ రీలొకేట్ చేయబోతోంది. త్వరలోనే దీనికి సంబంధఇంచిన పనులను చేపడుతామని జపాన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చీఫ్ ఎకనమిస్ట్ షినిచి సెకి తెలిపారు.

కారణాలేమిటో తెలియకపోయినా..

కారణాలేమిటో తెలియకపోయినా..

చైనా నుంచి హఠాత్తుగా తామ కంపెనీలన్నింటినీ తరలించాలని నిర్ణయించుకోవడం, ఆ వెంటనే దీనికి అవసరమైన ప్యాకేజీని కూడా ప్రకటించడం చర్చనీయాంశమైంది. జపాన్ ఏ కారణంతో ఈ నిర్ణయాన్ని తీసుకుందనే విషయం తెలియరాలేదు గానీ.. దీనికి ప్రధాన కారణం కరోనా వైరస్ ప్రభావమేనని తెలుస్తోంది. జపాన్ తీసుకున్న తాజా నిర్ణయం.. ఈ రెండు పారిశ్రామిక దిగ్గజ దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న దౌత్య సంబంధాలను కూడా దెబ్బతీసే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.

జపాన్ బాటలో మరిన్ని దేశాలు..

జపాన్ బాటలో మరిన్ని దేశాలు..

జపాన్ తాజాగా చేపట్టిన చర్యలను ఇతర దేశాలు కూడా అనుసరించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అదే జరిగితే- ఆర్థికపరంగా చైనా మరిన్ని సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనడం ఖాయంగా కనిపిస్తోంది. ఇతర దేశాలకు చెందిన కొన్ని చిన్న సంస్థలు ఇప్పటికే మూత పడ్డాయి. వాటిని పునరుద్ధరించే అవకాశాలు దాదాపు లేదనే అంటున్నారు. దీనివల్ల చైనా దేశీయ సంస్థలకు అవకాశాలు లభించినప్పటికీ.. విదేశీ సంస్థల నుంచి తగిన సహకారం లేకపోతే.. భవిష్యత్తులో అనేక ఇబ్బందులను చైనా ఎదుర్కొంటుందనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి.

English summary
Japan is willing to fund its companies to shift manufacturing operations out of China, Bloomberg has reported as the disruptions caused to production by the coronavirus pandemic has forced a rethink of supply chains between the major trading partners. As part of its economic stimulus package, Japan has earmarked $2.2 billion to help its manufacturers shift production out of China. Of this amount, 220 billion yen ($2 billion)is for companies shifting production back to Japan and 23.5 billion yen for those seeking to move production to other countries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X