వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జపాన్‌లో భారీ భూకంపం: 8మంది మృతి, 140మందికిగాయాలు, కూలిన భవనాలు, అంధకారం..

|
Google Oneindia TeluguNews

టోక్యో: జపాన్‌లోని హొక్కాయిడో ద్వీపంలో గురువారం భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 6.7గా నమోదైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. భూ ప్రకంపనల కారణంగా కొండచరియలు విరిగిపడి, పలు భవనాలు కుప్పపూలాయి.

 8మంది మృతి, 140మందికి గాయాలు

8మంది మృతి, 140మందికి గాయాలు

భూకంప ధాటికి ఇప్పటి వరకు 8మంది మృతి చెందగా, దాదాపు 140మందికి గాయాలయ్యాయి. మరో 40మంది ఆచూకీ తెలియట్లేదని అక్కడి అధికారులు ప్రకటించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

 కుప్పకూలిన భవనలు, విరిగిపడిన కొండచరియలు

కుప్పకూలిన భవనలు, విరిగిపడిన కొండచరియలు

కుప్పకూలిన భవనాలు, కొండచరియలు కింద చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు సహాయ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. థర్మల్ పవర్ ప్లాంట్ దెబ్బతినడంతో సుమారు 3లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

విమానాల రాకపోకల నిలిపివేత

విమానాల రాకపోకల నిలిపివేత

కొన్ని రోజులుగా జపాన్‌లో జెబీ తుఫాను సృష్టిస్తున్న ఇబ్బందుల నుంచి ఇప్పుడిప్పుడు కోలుకుంటున్న ప్రజలు.. తాజా భూకంపంతో మరోసారి విపత్తుకు గురయ్యారు. కాగా, హొక్కాయిడోలోని న్యూ చిటోస్ విమానాశ్రయంలో రాకపోకలను నిలిపివేశారు. అలాగే, రైల్లు, బస్సు సేవలను కూడా తాత్కాలికంగా నిలిపేసినట్లు అధికారులు తెలిపారు.

సునామీ ప్రమాదం లేదు కానీ..

సునామీ ప్రమాదం లేదు కానీ..

అయితే, భూకంపం కారణంగా సునామీ ముప్పు ఏమీ లేదని అక్కడి అధికారులు తెలిపారు. భూకంపం నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పెద్ద పెద్ద భవనాల వైపు వెళ్లకూడదని సూచించారు. టోమకొమయిలో భూకంపకేంద్రాన్ని గుర్తించినట్లు వెల్లడించారు.

English summary
The death toll due to the powerful earthquake which struck Japan's northernmost main island of Hokkaido today (September 6) has touched eight. The earthquake triggered landslides as well as causing the loss of power at nearly all of 3 million households and a nuclear power plant to go on a backup generator.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X