వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

7 వారాల్లోనే వైరస్ నిర్మూలన, 700 నుంచి 30కి తగ్గిన కేసులు, లాక్‌డౌన్ ఎత్తివేత..

|
Google Oneindia TeluguNews

కరోనా పేరు చెబితే చాలు యావత్ ప్రపంచం వణికిపోతోంది. వైరస్‌కు మందు లేకపోవడంతో.. అగ్రరాజ్యలు కూడా బిక్కుబిక్కుమంటున్నాయి. వైరస్ వ్యాపించిన అన్నీ దేశాల్లో క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. అయితే జపాన్‌ మాత్రం వైరస్ నిర్మూలనలో పురోగతి సాధించింది. పాజిటివ్ కేసుల సంఖ్యను నెలలో తగ్గించడంలో సక్సెస్ అయ్యింది. దీంతో దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ఎత్తివేస్తున్నట్టు ప్రధాని షింజో అబే ప్రకటించారు.

700 నుంచి 30కి తగ్గిన కేసులు..

700 నుంచి 30కి తగ్గిన కేసులు..

జపాన్‌లో కరోనా వైరస్ ప్రభావం క్రమంగా తగ్గుతూ వస్తోంది. దేశంలో ఏప్రిల్ 7వ తేదీ నుంచి పూర్తిగా లాక్ డౌన్ విధించారు. అయితే ఏప్రిల్ మధ్యలో పాజిటివ్ కేసులు 600 నుంచి 700 వరకు నమోదయ్యాయి. కానీ గత వారంలో ఆ సంఖ్య 20 నుంచి 30కి పడిపోయింది. దీంతో లాక్ డౌన్ ఎత్తివేయాలని అబే నిర్ణయం తీసుకున్నారు. దేశంలో 16 వేల 581 మందికి వైరస్ సోకగా.. 830 మంది చనిపోయారు. ప్రస్తుతం పరిస్థితి మెరుగ్గా ఉండటంతో.. లాక్ డౌన్ ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఓపెన్..

ఓపెన్..

టోక్యో, కనగవ, సైటమా, చిబా, హక్కైడొలో లాక్‌డౌన్ ఎతతివేస్తున్నట్టు అబే తెలిపారు. ఈ నగరాల్లో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పూర్తిస్థాయిలో నడుస్తాయని చెప్పారు. గత నెల నుంచి జపాన్ మోడల్‌లో వైరస్ నియంత్రణ కోసం చర్యలు తీసుకున్నామని అబే తెలిపారు. జపాన్ రాజ్యాంగ ప్రకారం మొత్తం లాక్ డౌన్ విధించేందుకు అనుమతి ఉంది.. కానీ ఏప్రిల్ 7 నుంచి కొన్ని ఆంక్షలతో మాత్రమే లాక్ డౌన్ అమలు చేశారు. వ్యాపార కేంద్రాల్లో భౌతిక దూరం కంపల్సరీ చేశారు.

లాక్‌డౌన్‌లో రెస్టారెంట్లు ఓపెన్

లాక్‌డౌన్‌లో రెస్టారెంట్లు ఓపెన్

లాక్ డౌన్ సమయంలో కూడా జపాన్‌లో కొన్ని రెస్టారెంట్లు తెరచి ఉన్నాయి. అక్కడ మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. మాస్క్ ధరించడం తప్పనిసరి చేశారు. ఒకానోక సమయంలో వైరస్ కేసుల సంఖ్య 10 వేలు దాటిందని.. దానిని వైద్య నిపుణులు 2 వేల వరకు తగ్గించారని గుర్తుచేశారు. వైరస్‌పై పోరాడి, నిర్మూలించేందుకు తనకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ అబే ధన్యవాదాలు తెలిపారు. కరోనా వైరస్ నివారించిన అతని పనితీరు ప్రజాధారణ పొందలేదు. ఓ వార్త పత్రిక నిర్వహించిన పోల్‌లో అతని పనితీరు 29 శాతానికి పడిపోయింది.

English summary
Prime minister Shinzo Abe has declared victory for the “Japan model” of fighting coronavirus as he lifted a nationwide state of emergency after seven weeks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X