వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళలు హై హీల్స్ ధరించి కార్యాలయాలకు రావాల్సిందే..తప్పదంటూ మంత్రి ఆదేశాలు

|
Google Oneindia TeluguNews

జపాన్ : మహిళలు తాము పనిచేస్తున్న కార్యాలయాల్లో హై హీల్స్ ధరించాల్సిందే అని అన్నారు జపాన్ ఆరోగ్యశాఖ మంత్రి. ఆఫీసుల్లో పనిచేసే మహిళలు హైహీల్స్ ధరించడం తప్పనిసరి చేసిన ప్రభుత్వ నిర్ణయంపై అక్కడి కోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగిణులు తమ ఉద్యోగాలు ఉండాలంటే తప్పనిసరిగా హైహీల్స్ ధరించాలంటూ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయాన్ని నిరసిస్తూ అక్కడి మహిళా ఉద్యోగినులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దీనిపై ఆరోగ్య శాఖ మంత్రి టకుమి నెమొటో స్పందించారు.

ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళలు హై హీల్స్ ధరించడంపై పెద్ద ఎత్తున్న ఉద్యమమే జరుగుతోంది. కుటూ పేరుతో ఈ ఉద్యమం ప్రారంభమైంది. కుట్సు అంటే జపాన్ భాషలో బూట్లు అని అర్థం, కుట్సూ అంటే నొప్పి అని అర్థం. ఇది కూడా ప్రపంచ వ్యాప్తంగా లైంగిక వేధింపుల ఉద్యమం "మీటూ"లా రాజుకుంది. మహిళలకు ఇష్టం లేకున్నా వారి ఇష్టాలతో పనిలేకుండా ప్రభుత్వం వేధిస్తోందంటూ ఈ ఉద్యమం ద్వారా వారు చెబుతున్నారు . ఈ ఉద్యమాన్ని జపాన్ నటి ఫ్రీలాన్స్ రైటర్ యుమి ఇషికావా ప్రారంభించారు. దీంతో ఆన్‌లైన్‌లో చాలామంది ఈ ఉద్యమానికి మద్దతు తెలిపారు. హై హీల్స్ వేసుకోవాలా వద్దా అనేది మహిళల ఇష్టమని వారు ఒకవేళ కార్యాలయంలో పనిచేయకపోతే తప్పుకానీ పనిచేసే వారిపై ఈ ఆంక్షలు విధించడమేంటని ప్రశ్నిస్తున్నారు.

Japan Minister says High heels must for the women employees

హైహీల్స్ ధరించడం మోడ్రన్ అని కొందరు అభివర్ణిస్తుంటే కొందరు మాత్రం డ్రెస్‌కోడ్‌లో భాగంగానే దీన్ని ప్రవేశ పెట్టారని మండిపడుతున్నారు. 2015లో ప్రఖ్యాత కేన్స్ ఫెస్టివల్‌లో మహిళలు హీల్స్ ధరించలేదన్న కారణంతో వారిని రెడ్ కార్పెట్ పై నడిచేందుకు అనుమతి నిరాకరించారు. దీంతో అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నారు ఆ సంస్థ డైరెక్టర్. అనంతరం క్షమాపణ చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. అయితే దీనిపై నిరసన తెలుపుతూ 2016లో జరిగిన కేన్స్ ఫెస్టివల్‌లో ప్రముఖ హాలీవుడ్ భామ జూలియా రాబర్ట్స్ ఎలాంటి పాదరక్షలు ధరించకుండానే కార్పెట్‌పై నడిచారు.

English summary
Japan’s health and labour minister has defended workplaces that require women to wear high heels to work, arguing it is “necessary and appropriate” after a petition was filed against the practice.The remark came when Takumi Nemoto was asked to comment on a petition by a group of women who want the government to ban workplaces from requiring female jobseekers and employees to wear high heels.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X