వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాను దెబ్బ కొట్టే జపాన్ వ్యూహం: యూఎస్, ఇండియా, ఆస్ట్రేలియాతోపాటు ఆసియా దేశాల సహకారం

|
Google Oneindia TeluguNews

ఒకపక్క ఇండియాతో , మరోపక్క జపాన్ తో చైనా తొడగొడుతుంది. తూర్పు చైనా సముద్రంలో ఇటీవల భారీగా యుద్ధ క్షిపణులతో టోక్యోకు సమీపంలో జపాన్ కు హెచ్చరికలు పంపిన చైనాను దీటుగా ఎదుర్కొనేందుకు జపాన్ ,యూఎస్ , భారతదేశం, ఆస్ట్రేలియా మరియు ఆసియా దేశాలతో చేతులు కలిపి పోరాటం చెయ్యనుంది . ఆసియా సహకారాన్ని బలోపేతం చేయడానికి ప్రణాళికలు వేసింది.

బ్యూరో ఆఫ్ డిఫెన్స్ పాలసీకి మరో అంతర్జాతీయ వ్యవహారాల అధికారి నియామకం

బ్యూరో ఆఫ్ డిఫెన్స్ పాలసీకి మరో అంతర్జాతీయ వ్యవహారాల అధికారి నియామకం

యుఎస్, ఇండియా మరియు ఆస్ట్రేలియాతో ప్రాంతీయ వ్యూహాన్ని ముందుకు తెచ్చే ప్రయత్నంలో, ఇండో-పసిఫిక్ వ్యవహారాలకు మాత్రమే బాధ్యత వహించే కొత్త బృందాన్ని ఏర్పాటు చెయ్యాలని జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ నిర్దేశించింది. వచ్చే నెలలోగా అమలు చేయబోయే మార్పును మంత్రిత్వ శాఖ పేర్కొంది . తన బ్యూరో ఆఫ్ డిఫెన్స్ పాలసీకి మరో అంతర్జాతీయ వ్యవహారాల అధికారిని నియమించనున్నట్టు తెలుస్తుంది.

ఆసియా దేశాలతో సమన్వయం కోసం పని చెయ్యనున్న అధికారి

ఆసియా దేశాలతో సమన్వయం కోసం పని చెయ్యనున్న అధికారి

అంతే కాకుండా సిబ్బందిని కూడా క్రమంగా పెంచి అమెరికా, ఇతర దేశాలతో సమన్వయం కోసం పనిచెయ్యాలని నిర్ణయం తీసుకుంది. ఈ బ్యూరో యొక్క అంతర్జాతీయ విధాన విభాగంలో కొత్త అధికారి ప్రధాన దృష్టి పాక్షిక మిత్రదేశాలైన భారతదేశం మరియు ఆస్ట్రేలియాతో పాటు ఆగ్నేయాసియా దేశాలతో సహకారంపై ఉండనుంది . ఆస్ట్రేలియా, భారతదేశం మరియు జపాన్లతో కూడిన క్వాడ్ తో యు.ఎస్ కూడా తమ దేశ సహకారాన్ని వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తుంది .

చైనాకు వ్యతిరేకంగా పోరాటం కోసం జపాన్ రక్షణా మంత్రి సంప్రదింపులు

చైనాకు వ్యతిరేకంగా పోరాటం కోసం జపాన్ రక్షణా మంత్రి సంప్రదింపులు

గత 2 నెలల్లో, జపాన్ రక్షణ మంత్రి టారో కోనో భారతదేశం, ఆగ్నేయాసియా దేశాలు మరియు ఇతర దేశాలలో సంబంధిత సహచరులతో మాట్లాడారు. చైనాకు వ్యతిరేకంగా హిందూ మహాసముద్రం సముద్రపు జలమార్గాలలో అందరూ కలిసికట్టుగా పోరాటం చేసే దిశగా మద్దతుకోసం ఆయన మాట్లాడారు .ఒక మీడియా రిపోర్ట్ మేరకు జపాన్ కోస్ట్‌గార్డ్‌లు ఇటీవల ఏప్రిల్ మధ్య నుండి ప్రతిరోజూ సేనకాకు, డియోయు ద్వీపాలకు సమీపంలో ఉన్న జలమార్గాలలో చైనా ప్రభుత్వ నౌకలను గుర్తించినట్లు ప్రకటించాయి.

చైనా ఆగడాలకు అడ్డుకట్టకు పక్కా ప్రణాళిక తో జపాన్

చైనా ఆగడాలకు అడ్డుకట్టకు పక్కా ప్రణాళిక తో జపాన్

జనావాసాలు లేని వివాదాస్పద ద్వీపాలపై వివాదం దశాబ్దాలుగా పుట్టుకొస్తోంది . ఇక ఈ వ్యవహారంలో జపాన్ తో చైనా రెచ్చగొట్టే చర్యలకు దిగుతుంది . జపాన్‌తో పరస్పర రక్షణ ఒప్పందం కారణంగా యుఎస్ ప్రమేయం కూడా ఇందులో ఉండొచ్చు . జపాన్ కు యూ ఎస్ కూడా సహకారం అందించవచ్చు . ప్రధాన మంత్రి షింజో అబే ప్రభుత్వం "ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో-పసిఫిక్ స్ట్రాటజీ"కి ప్రాధాన్యతని ఇస్తుందని మంత్రిత్వ శాఖ సంస్థాగత విస్తరణ చూపిస్తుందని జపాన్ మీడియా పేర్కొంది. ఏది ఏమైనా చైనా ఆగడాలకు అడ్డుకట్ట వెయ్యటానికి జపాన్ ఆసియా దేశాల మద్దతుతో పోరాటం చెయ్యనుంది .

English summary
Japan has laid out plans to strengthen collaboration with India, Australia and ASEAN nations while China continues to make headlines for its increasing hostile presence in the East China Sea attracting conflict with Tokyo.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X