వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రేవ్ డేంజర్..: కరోనా విధ్వంసం సృష్టిస్తోన్న వేళ జపాన్ ప్రధాని సంచలన నిర్ణయం:

|
Google Oneindia TeluguNews

టోక్యో: రోజులు గడుస్తున్న కొద్దీ ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తూనే వస్తోంది. ప్రపంచ పటంలోని అన్ని దేశాలనూ కరోనా వైరస్ కమ్మేసింది. 13 లక్షల మందికి పైగా ఈ వైరస్ బారిన పడి అనారోగ్యానికి గురయ్యారు. 74 వేల మందికి పైగా మరణించారు. ఆఫ్రికాలోని కొన్ని చిన్న దేశాలను మినహాయిస్తే. ప్రపంచం నలుమూలలా విస్తరించింది ఈ వైరస్. దీన్ని నియంత్రించడానికి భారత్ సహా అన్ని దేశాలు కూడా కఠిన నిర్ణయాలను తీసుకుంటున్నాయి. భారత్ సహా చాలా దేశాల్లో లాక్‌డౌన్ అమల్లో ఉంటోంది.

స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ విధింపు..

స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ విధింపు..


ఈ పరిస్థితుల్లో జపాన్ ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటిదాకా అలాంటి నిర్ణయాన్ని తీసుకున్న తొలి దేశం అదే. రాజధాని టోక్యో సహా ఏడు నగరాల్లో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ప్రకటించింది జపాన్ ప్రభుత్వం. టోక్యో, ఒసాకా, క్యోటో వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఎమర్జెన్సీ సందర్భంగా కొన్ని కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుందని జపాన్ ప్రధానమంత్రి షింజో అబే వెల్లడించారు. కరోనా వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఇంతకు మించిన మరో మార్గం లేదని అన్నారు. రాజధానిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

రైళ్లు.. సూపర్ మార్కెట్లకు ఢోకా ఉండదంటూ..

రైళ్లు.. సూపర్ మార్కెట్లకు ఢోకా ఉండదంటూ..

అత్యవసర పరిస్థితిని విధించినప్పటికీ.. ఆయా రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఆటంకం ఉండబోదని షింజో వెల్లడించారు. బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలు తిరగడంపై ఆంక్షలను విధించినట్లు చెప్పారు. నిత్యావసర సరుకుల కొనుగోళ్లకు ఆటంకం కలగకుండా ఉండటానికి ఆయా నగరాల్లోని సూపర్ మార్కెట్లన్నీ తెరిచే ఉంచుతామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ పరిపాలన, ఇతర వ్యవహారాలన్నింటినీ పర్యవేక్షించాల్సిన బాధ్యతను ఆయా రాష్ట్రాల గవర్నర్లకు అప్పగించినట్లు తెలిపారు.

ఇదివరకే ఎమర్జెన్సీ సంకేతాన్ని ఇచ్చిన షింజో సర్కార్

ఇదివరకే ఎమర్జెన్సీ సంకేతాన్ని ఇచ్చిన షింజో సర్కార్

కరోనా వైరస్ విజృంభణ ఆరంభమైన తొలి రోజుల్లోనే జపాన్ ప్రభుత్వం తమ దేశ చట్టాల్లో కొన్ని కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు, చేపట్టాల్సిన చర్యల గురించి ఈ చట్టాల్లో పొందుపరిచారు. ఈ అత్యవసర పరిస్థితిని గ్రేవ్ డేంజర్‌గా ప్రకటించింది జపాన్ ప్రభుత్వం. దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులకు అద్దం పట్టేలా ఈ పదాన్ని విస్తృతంగా వినియోగిస్తోంది.

 ప్రజాభిప్రాయాన్ని సేకరించిన తరువాతే..

ప్రజాభిప్రాయాన్ని సేకరించిన తరువాతే..

అత్యవసర పరిస్థితిని విధించడానికి ముందు ప్రజాభిప్రాయాన్ని సేకరించింది షింజో అబే ప్రభుత్వం. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో 80 మంది స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీకి అనుకూలంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. 12 శాతం మంది అత్యవసర పరిస్థితి అవసరం లేదని తెలిపారు. కరోనా వైరస్ విస్తరించడం మొదలైన తరువాత దేశంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయని, ఆ తరువాత కూడా అవి కొనసాగే ప్రమాదం లేకపోలేదని షింజో అబే చెప్పుకొచ్చారు.

English summary
Japan’s prime minister, Shinzo Abe, is poised to declare a state of emergency in Tokyo and six other prefectures as early as Tuesday in an attempt to stem a sharp rise in coronavirus cases in the capital and other major cities. The measure, to go into effect for about a month, will enable local authorities to urge people to stay at home except to shop for food, seek medical care, go to work if necessary, and take daily exercise.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X