వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జపాన్‌లో వింత పరిస్థితి: కరోనా రోగులు లేరని బాధపడుతోంది! ఎందుకంటే.?

|
Google Oneindia TeluguNews

టోక్యో: చైనా వైరస్ కరోనా మహమ్మారి బారినపడి అమెరికా, భారత్ సహా ప్రపంచంలో అనేక దేశాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. అయితే, జపాన్ మాత్రం ఇందుకు మినహాయింపుగా కనిపిస్తోంది. అక్కడి ప్రజలు, ప్రభుత్వం కరోనా నియంత్రణ కోసం తీసుకున్న చర్యలు ఫలించి జపాన్ దేశంలో ఆ మహమ్మారి కనుమరుగైపోతోంది. అయితే, ఇది సంతోషించాల్సిన విషయమే అయినప్పటికీ.. జపాన్ దేశానికి ఇదో సమస్యగా భావిస్తోంది.

<strong>పాక్ కంటే పెద్ద శత్రువు చైనానే: మోడీపైనే దేశ ప్రజల విశ్వాసం, రాహుల్‌ను నమ్మలేమంటూ..</strong>పాక్ కంటే పెద్ద శత్రువు చైనానే: మోడీపైనే దేశ ప్రజల విశ్వాసం, రాహుల్‌ను నమ్మలేమంటూ..

కరోనా రోగులు లేకపోవడంతో..

కరోనా రోగులు లేకపోవడంతో..

ఎందుకంటే.. జపాన్ దేశంలో కరోనావైరస్ క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు బాధితులు దొరకడం లేదట. దీంతో ఆ దేశం ట్రయల్స్‌లో వెనకబడిపోతోందట. కాగా, కరోనావైరస్ ప్రభావం లేని ఏకైక అభివృద్ధి చెందిన దేశం జపాన్ కావడం గమనార్హం. ఈ దేశంలో నమోదైన కరోనా కేసులే తక్కువ.. వారికి సరైన చికిత్స అందించడంతో వారంతా కోలుకున్నారు.

కొత్త కేసులూ నమోదు కావడం లేదు..

కొత్త కేసులూ నమోదు కావడం లేదు..

కరోనా నియంత్రణ చర్యలను అక్కడి ప్రభుత్వం అమలు చేస్తుండగా.. ప్రజలు అంతే క్రమశిక్షణతో పాటిస్తుండటంతో కొత్త కరోనా కేసులు కూడా నమోదు కావడం లేదు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 12 టీకాలకు క్లినికల్ ట్రయల్ జరుగుతున్నాయి. వీటిలో ఆరు చైనావే ఉండటం గమనార్హం. కాగా, జపాన్ తయారుచేస్తున్న సూదిమందు క్లినికల్ ట్రయల్స్ ఆరంభించేందుకు మరో నెల రోజుల సమయం పట్టేలా ఉంది.

ఆందోళనలో జపాన్ ఫార్మా సంస్థలు

ఆందోళనలో జపాన్ ఫార్మా సంస్థలు


ఇప్పటికే కరోనా చికిత్స కోసం యాంటీ వైరల్ ఔషధం అవిగన్(ఫవిపరవిర్)ను భారత్, రష్యా ఆమోదించగా.. జపాన్‌కు మాత్రం వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, అవిగన్ డ్రగ్ సామర్థ్యాన్ని పరీక్షించాలని జపాన్ ప్రధాని షింజో అబే ఆదేశించారు. అయితే, కరోనా రోగులు లేకపోవడంతో పరీక్షలు నిర్వహించడంలో జాప్యం జరుగుతోంది. విదేశాల్లో అవిగన్‌కు ఆమోదం లభించినా జపాన్‌లో లభించకపోవడంపై స్థానిక ఫార్మా సంస్థలు విచారం వ్యక్తం చేస్తున్నాయి.

Recommended Video

కొంపముంచిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌.. టెన్నిస్ స్టార్ Novak Djokovic కు Corona!
కరోనా రోగులు దొరక్క అవస్థలు..

కరోనా రోగులు దొరక్క అవస్థలు..

ప్రస్తుతం జపాన్ దేశంలో కరోనాకు సంబంధించి 54 క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతులు ఉండగా, ఇంకా రోగుల పేర్లను నమోదు చేసుకునే దశలోనే ఉండటం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. జులైలో జపాన్ దేశంలో ట్రయల్స్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాగా, జపాన్ దేశంలో ఇప్పటి వరకు 17,968 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 955 మంది మరణించారు. 16,212 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 801 యాక్టివ్ కేసులున్నాయి. వీరిలో కూడా చాలా వరకు కోలుకుంటున్నారు.

English summary
As nations race to develop treatments and vaccines for COVID-19, Japan has become a victim of its own success as slowing new infections has led to a shortage of patients to enroll in clinical trials. Clinical trials are underway for more than a dozen potential vaccines, including at least six in China, but Japan's first human trials are expected to start next month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X