వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీరియల్ కిల్లర్ ఘాతుకం: ఆ అపార్ట్‌మెంట్‌లో తలలు, మొండాలే

జపాన్ దేశంలో చోటు చేసుకున్న ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వరుస హత్యలకు పాల్పడుతున్న ఓ సీరియల్ కిల్లర్ తమ మధ్యే ఉన్నాడని తెలిసి టోక్యోలోని జమా ప్రాంత వాసులు హడలెత్తిపోయారు.

|
Google Oneindia TeluguNews

టోక్యో: జపాన్ దేశంలో చోటు చేసుకున్న ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వరుస హత్యలకు పాల్పడుతున్న ఓ సీరియల్ కిల్లర్ తమ మధ్యే ఉన్నాడని తెలిసి టోక్యోలోని జమా ప్రాంత వాసులు హడలెత్తిపోయారు. అతనున్న అపార్ట్‌మెంట్‌లో తల, మొండాలు వేర్వేరుగా ఉన్న మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది.

యువతి మిస్

యువతి మిస్

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. జమాలోని ఆ అపార్ట్‌మెంట్‌‌లో గత కొంత కాలంగా ఓ మహిళ ఒంటరిగా ఉంటోంది. అయితే గత పది రోజులుగా ఆ ఇంటికి తాళం వేసి ఉంది. ఇక కొన్నాళ్ల క్రితం హచియోజి ప్రాంతానికి చెందిన ఓ యువతి కనిపించకుండా పోయిందంటూ కేసు నమోదు కాగా, ఆ కేసు విచారణలో లభించిన ఆధారాలతో టోక్యో పోలీసులు సోమవారం సదరు మహిళ ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో సోదాలు నిర్వహించారు.

దిగ్భ్రాంతికి గురైన పోలీసులు

దిగ్భ్రాంతికి గురైన పోలీసులు

ఆ సమయంలో మహిళ ఇంట్లో లేకపోవటంతో తాళాలు పగలకొట్టి సోదాలు చేశారు.
ఓ కూలర్‌ బాక్స్‌‌లో ఉన్న రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత లోపలికి వెళ్లిన పోలీసులకు భయానక దృశ్యాలు దర్శనమిచ్చాయి. అక్కడ కొన్ని కూలర్‌ బాక్స్‌లలో తల, మొండాలు వేర్వేరుగా ఉన్న కొన్ని మృతదేహాలు వారి కంటపడ్డాయి. దీంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ మృతదేహాలన్నింటినీ స్వాధీపరుచుకున్న పోలీసులు.. అవి ఎవరివో గుర్తించే పనిలో పడ్డారు.

మృతదేహాల్లో 8మంది యువతులవే..

మృతదేహాల్లో 8మంది యువతులవే..

ఆ గదిలో మొత్తం 9 మృతదేహాలు(8మంది యువతులు, ఒక యువకుడి) లభ్యమైనట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. కాగా, ఆ గదిలో నివసించే మహిళ, తకహిరో షిరైషీ(27) అనే మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు ఓ జపాన్ పత్రిక తన కథనం ప్రచురింది.

సీసీ కెమెరాల్లో మిస్సైన యువతితో నిందితుడు..

సీసీ కెమెరాల్లో మిస్సైన యువతితో నిందితుడు..

కాగా, మొదట మిస్సయిన యువతి సూసైడ్‌ నోట్‌ రాసి వెళ్లటం.. చివరిసారిగా ఓ రైల్వే స్టేషన్‌లో తకహిరోతో కలిసి కనిపించిన ఫుటేజీలు దర్శనమిచ్చింది. దీంతో ఈ కేసులో వేరే కోణాలు కూడా ఉన్నాయన్న అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారని ఆ పత్రిక కథనం లో పేర్కొంది. ఇంతమందిని ఎందుకు? ఎలా చంపారనే దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుల విచారణ పూర్తయితే తప్ప అసలు విషయం తెలిసే అవకాశం లేదు.

English summary
The police in Tokyo arrested a man suspected of murder on Tuesday, and the Japanese news media reported that parts of nine bodies had been found in his apartment, raising the possibility that investigators had uncovered a serial killer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X