వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో హైస్పీడ్ బుల్లెట్ రైలు జపాన్ శ్రీకారం..వేగం తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది

|
Google Oneindia TeluguNews

టోక్యో : బుల్లెట్ ట్రైన్స్‌కు పెట్టింది పేరు జపాన్. ఆదేశంలో బుల్లెట్ ట్రైన్లు ఎక్కువగా పరుగులు తీస్తాయి. తాజాగా మరో హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్‌కు జపాన్ శ్రీకారం చుట్టనుంది. గంటకు 400 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా ఈ బుల్లెట్ రైలును రూపొందించారు. టెస్టు రన్‌లో అంతా సవ్యంగా సాగితే రవణా రంగంలో మరో విప్లవాత్మకమైన మార్పు వచ్చినట్లే అవుతుంది.

షిన్‌కాన్‌సేన్ రైలులో మరో వర్షెన్

షిన్‌కాన్‌సేన్ రైలులో మరో వర్షెన్

ఆల్ఫా-ఎక్స్ వర్షెన్‌కు చెందిన షిన్‌కాన్‌సేన్ రైలును రూపొందించేందుకు మూడేళ్ల సమయం పట్టింది. అన్ని పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసుకుంటే 2030 నాటికి ఈ హైస్పీడ్ బుల్లెట్ రైలు పట్టాలు ఎక్కుతుంది. ప్రవేశ పెట్టిన కొత్తలో గంటకు 360 కిలోమీటర్ల వేగంతో రైలు పరుగులు తీస్తుందని అధికారులు తెలిపారు. చైనాలోని ఇదే ఆల్ఫా ఎక్స్ వర్షెన్ బుల్లెట్ రైలు ఉన్నప్పటికీ జపాన్‌ రైలుతో పోలిస్తే అది 10 కిలోమీటర్ల వేగం తక్కువ అని అధికారులు తెలిపారు. ఇక జపాన్ ప్రవేశపెట్టనున్న హైస్పీడు రైలుకు 10 బోగీలు ఉంటాయని చెప్పారు. ముందర భాగం చాలా పొడవుగా ఉంటుందని అధికారులు వివరించారు.

సెండాయ్ నుంచి ఆవ్ మోరి వరకు ట్రయల్ రన్

సెండాయ్ నుంచి ఆవ్ మోరి వరకు ట్రయల్ రన్

హైస్పీడ్ రైలును సెండాయ్ నుంచి ఆవ్‌మోరి వరకు ప్రయోగాత్మకంగా నడుపుతామని జపాన్ అధికారులు తెలిపారు. ఈ రెండు స్టేషన్ల మధ్య దూరం 280 కిలోమీటర్లు. అర్థరాత్రి తర్వాత ఈ రైలు పట్టాలపై పరుగులు తీస్తుందని ఆ సమయంలో అన్ని పరిశీలించడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఇలా వారానికి రెండు సార్లు హైస్పీడ్ రైలును ట్రయల్ రన్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. దీనికంటే ముందు మరో హైస్పీడు రైలు షిన్‌కాన్‌సేన్ ఎన్ 700ఎస్ మోడల్ ట్రైన్‌ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ తరహా రైలు 2020లో పట్టాలు ఎక్కుతుందని చెప్పారు. ఇది గంటకు 300 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుందని చెప్పారు.

వీలైనంత త్వరగా పట్టాలపైకి తెచ్చేందుకు ప్రయత్నం

వీలైనంత త్వరగా పట్టాలపైకి తెచ్చేందుకు ప్రయత్నం

2020 టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్ సమయంకల్లా ఈ కొత్త రైలును పట్టాలెక్కించాలని జపాన్ అధికారులు భావిస్తున్నారు. అయితే అది ఎంత వరకు సాధ్యం అవుతుందో వేచిచూడాలి. టెస్టు రన్‌ సందర్భంగా ఎంత వేగం పుంజుకుంటుందో అనే అంశంతో సంబంధం లేకుండా ప్రవేశపెట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే జపాన్ రైల్వేలు ప్రవేశ పెట్టిన మ్యాగ్నెటిక్ లివిటేషన్ రైలు స్పీడును మాత్రం ఆల్ఫా ఎక్స్ అందుకోలేదని అధికారులు చెబుతున్నారు. ఈ రైలు వేగం గంటకు 603 కిలోమీటర్లు ఉంటుందని చెప్పారు. 2015లో దీని ప్రయోగించడం జరిగింది.

English summary
Japan is all set to test its high speed bullet train that runs at a speed of 400kmph.If this test comes out successfully the train will be officially launched by 2030.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X