వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ రిపోర్ట్ : ఈ దేశం పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత పవర్‌ఫుల్ పాస్‌పోర్టు

|
Google Oneindia TeluguNews

ప్రపంచం దేశాల్లోని పాస్‌పోర్టుల్లో మరోసారి అత్యంత బలోపేతమైన పాస్‌పోర్టుగా జపాన్ దేశ పాస్‌పోర్టు నిలిచింది. జపాన్ దేశం పాస్‌పోర్టు కలిగి ఉన్న వారు 190 దేశాలకు వీసా లేకుండా... లేదా ఆయా దేశాలకు వెళ్లిన తర్వాత వీసా పొందే వీలు కల్పించినందునే ఇది అత్యంత పవర్ ఫుల్ పాస్‌పోర్టుగా నిలిచిందని హెన్లీ పాస్ పోర్టు ఇండెక్స్ సంస్థ వెల్లడించింది.

టాప్ టెన్‌‌లో ఆసియా ఖండం దేశాల పాస్‌పోర్టులు

టాప్ టెన్‌‌లో ఆసియా ఖండం దేశాల పాస్‌పోర్టులు

ఇదిలా ఉంటే అత్యంత పవర్‌ఫుల్ పాస్‌పోర్టు కలిగిఉన్న దేశాల్లో ఆసియా ఖండంకు చెందిన పది దేశాలున్నాయి. జపాన్ తొలిస్థానంలో నిలువగా దక్షిణ కొరియా సింగపూర్ దేశాలు రెండో స్థానంలో నిలిచాయి. భారత్‌లో వీసా ఆన్ అరైవల్ సదుపాయం కల్పించాక దక్షిణ కొరియా ఒక స్థానం పైకి ఎగబాకి రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు జర్మనీ ఫ్రాన్స్ దేశాలు మూడో స్థానం ఆక్రమించాయి. ఈ రెండు దేశాల పాస్‌పోర్టులు 188 దేశాల్లో వీసా ఆన్ అరైవల్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.

అసలు ఏం జరిగింది: ఇష్టంతో ఐఏఎస్ అయ్యాడు... కష్టంతో పోస్టుకు రాజీనామా చేశాడు అసలు ఏం జరిగింది: ఇష్టంతో ఐఏఎస్ అయ్యాడు... కష్టంతో పోస్టుకు రాజీనామా చేశాడు

 ఆరోస్థానానికి పడిపోయిన అమెరికా, యూకే దేశాల పాస్‌పోర్ట్‌లు

ఆరోస్థానానికి పడిపోయిన అమెరికా, యూకే దేశాల పాస్‌పోర్ట్‌లు


అంతర్జాతీయ వాయురవాణా అసోసియేషన్ (ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్టు) నుంచి సేకరించిన సమాచారంతో ప్రతి ఏటా ప్రపంచ దేశాల్లోని అత్యంత బలోపేతమైన పాస్‌పోర్టు వివరాలను హెన్లీ పాస్ పోర్టు ఇండెక్స్ సంస్థ విడుదల చేస్తుంది. గత మూడేళ్లలో అమెరికా, యూకేలు తొలి స్థానం నుంచి ఆరో స్థానానికి పడిపోయాయి. ఇవి 185 దేశాలకు తమ పాస్ పోర్టులపై వీసా ఆన్ అరైవల్ సదుపాయం కల్పిస్తున్నాయి. ఇక డెన్మార్క్, ఫిన్‌లాండ్, ఇటలీ స్వీడన్ దేశాలు నాలుగో స్థానంలో ఉండగా... స్పెయిన్ మరియు లక్సెంబర్గ్ దేశాలు ఐదో స్థానాల్లో నిలిచాయి.

చివరి స్థానాల్లో నిలిచిన ఇరాక్ ఆఫ్ఘానిస్తాన్ పాస్‌పోర్ట్‌లు

చివరి స్థానాల్లో నిలిచిన ఇరాక్ ఆఫ్ఘానిస్తాన్ పాస్‌పోర్ట్‌లు


ఇక చివరి స్థానాల్లో కేవలం 30 దేశాలకు తమ దేశ పాస్‌పోర్టుకు వీసా ఆన్ అరైవల్ సదుపాయం కల్పిస్తున్న దేశాల్లో ఇరాక్, అఫ్ఘానిస్తాన్‌లు నిలిచాయి. ఇవి వరసుగా ఇలా నిలవడం 14వ సంవత్సరం. ఇదిలా ఉంటే 2006లో ఇండెక్స్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఒక దేశానికి చెందిన పౌరుడు సరాసరి 58 దేశాలను ఎలాంటి వీసా లేకుండా వెళ్లొచ్చని పేర్కొంది. ఇక 2018 నాటికి ఆ సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది. ప్రస్తుతం వీసా లేకుండా దేశాలను చుట్టేసి వచ్చే సంఖ్య సరాసరి 107గా ఉంది.

English summary
Japan has again topped the list of the world’s most powerful passport, according to the Henley Passport Index.Holding a Japanese passport gives citizens visa-free or visa-on-arrival access to 190 countries.Asian passports dominated the top 10 most powerful passports with Singapore and South Korea sharing second place. South Korea was bumped up a place after being given visa-on-arrival access to India.Germany and France remain in third place heading into 2019, with easy access to 188 countries around the world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X