వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇవాంకా లవ్ స్టోరీ: ప్రేమ కోసం మతం మార్చుకుని.. ప్రియుడ్ని మనువాడి, అండగా నిలిచిన ట్రంప్...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముద్దుల కూతురు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముద్దుల కూతురు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో ఈనెల 28న ప్రారంభమయ్యే గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు.

Recommended Video

Ivanka Trump hyderabad Visit : Bar and Restaurants to be closed

ఇవాంకా హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో మీడియా ఫోకస్ మొత్తం ఆమెపైనే పెట్టింది. ఈ నేపథ్యంలో ఆమె వ్యక్తిగత జీవితం, వృత్తిగత జీవితం, రాజకీయ జీవితంపై వస్తోన్న అనేక కథనాలు, ముఖ్యంగా ఆమె లవ్ స్టోరీ.. అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

రియల్‌ రోల్‌ మోడల్‌.. ఇవాంకా ట్రంప్! మూడేళ్లు సహజీవనం, ఆపై పెళ్లి, తండ్రికి తోడుగా పాలిటిక్స్ లోకి..రియల్‌ రోల్‌ మోడల్‌.. ఇవాంకా ట్రంప్! మూడేళ్లు సహజీవనం, ఆపై పెళ్లి, తండ్రికి తోడుగా పాలిటిక్స్ లోకి..

ప్రేమ కోసం క్రైస్తవాన్ని వదిలి...

ప్రేమ కోసం క్రైస్తవాన్ని వదిలి...

ఇవాంకా ట్రంప్ ప్రేమ, వివాహానికి సంబంధించి ఆసక్తికరమైన విషయం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆమె తన ప్రియుడు, అమెరికాలో రియల్ ఎస్టేట్ బిజినెస్ మాగ్నెట్ అయిన జెరేడ్ కుష్నర్ ను ప్రేమించి పెళ్లాడింది. తన లవర్ కోసం ఇవాంకా ఏకంగా మతాన్నే మార్చుకుందట. క్రైస్తవాన్ని వదిలిపెట్టి జ్యూయిష్ మతాన్ని స్వీకరించిందట.

మూడేళ్లు సహజీవనం చేసి...

మూడేళ్లు సహజీవనం చేసి...

ఇవాంకా 2005లో న్యూయార్క్‌కు చెందిన కామన్ ఫ్రెండ్ వేండ్ డెంగ్ ముర్దోక్ ద్వారా జెరేడ్ కుష్నర్‌ను కలిసిందట. ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు కలవడంతో వారు మూడేళ్లపాటు సహజీవనం చేశారు. వీరి ప్రేమ విషయం తెలిసి.. సంప్రదాయ యూదులైన కుష్నర్ కుటుంబం అభ్యంతరం తెలిపిందట. పైగా ఇవాంకా తండ్రి డొనాల్డ్ ట్రంప్ అప్పటికే అమెరికా రియల్ ఎస్టేట్ రంగంలో కింగ్. దీంతో ఓ సంపన్న వ్యక్తి కుమార్తె మనలాంటి సాధారణ కుటుంబంలో ఎలా ఇమడగలదని కుష్నర్ కుటుంబం ఆలోచించిందట.

విడిపోయి, మళ్లీ కలిసి...

విడిపోయి, మళ్లీ కలిసి...

ప్రియుడు జెరేడ్ కుష్నర్ కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలపడంతో ఒక దశలో ఇవాంకా, కుష్నర్ విడిపోయారట. అయితే తమ ప్రేమకు మతం అడ్డంకిగా మారిందని తెలుసుకున్న ఇవాంకా క్రైస్తవాన్ని వదిలి జ్యూయిష్(యూదు) మతాన్ని స్వీకరించింది. అంతేకాదు, తనకు ఆస్తులు, అంతస్తులతో పనిలేదని కూడా కుష్నర్ కుటుంబ సభ్యులకు తెలిపిందట. దీంతో కుష్నర్ తల్లిదండ్రులు చార్లెస్, సెర్యియల్ కుష్నర్.. ఇవాంకాను తమ ఇంటి కోడలిగా చేసుకోవడానికి అంగీకరించారు.

కూతురికి అండగా నిలిచిన ట్రంప్...

కూతురికి అండగా నిలిచిన ట్రంప్...

ప్రియుడు జెరేడ్ కుష్నర్ ను వివాహమాడే విషయంలో ఇవాంకాకు ఆమె తండ్రి డొనాల్డ్ ట్రంప్ అండగా నిలిచారు. దీంతో 2009లో ఇవాంకా కుష్నర్ ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. జెరేడ్ కుష్నర్ కూడా ఇవాంకాను ఎంతో ఇష్టపడినా... మతం అనేది వారిద్దరి మధ్యన అడ్డుగోడగా నిలిచింది. చివరికి ఇవాంకా ధైర్యం చేసి ప్రియుడి కోసం, తన ప్రేమ కోసం మతం మార్చుకోవడంతో వారిద్దరూ ఒక్కటి కాగలిగారు.

English summary
Donald Trump’s daughter Ivanka Trump and her Jewish husband Jared Kushner — often cited by those who wish to downplay accusations of anti-Semitism in the Trump campaign and validate the candidate’s commitment to the Jewish community — once separated, three years into their relationship, because Ivanka was not a member of the tribe at the time.According to a report in the August 22 issue of The New Yorker, the power couple, who met in 2005, briefly broke up in 2008 over religious differences, with Kushner, who is Modern Orthodox, pulling the plug. “The lingering issue was religion,” the article said of the rupture. “The Kushners hoped that Jared would marry a Jewish woman… Donald Trump is Presbyterian, and Ivanka — who in the documentary ‘Born Rich’ appears wearing a necklace with a silver cross — was not what they’d had in mind.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X