వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియురాలి ప్రియుడి దారుణ హత్య: గుండె కోసి తినేశాడు

|
Google Oneindia TeluguNews

జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో దిగ్భ్రాంతికర సంఘటన చోటుచేసుకుంది. తన ప్రియురాలిని ప్రేమించిన వ్యక్తిని హత్య చేసి, ఆ తర్వాత కత్తితో కోసి అతని గుండెను బయటికి తీసిన ఓ నరహంతకుడు(62) ఫొర్కుతో తినేశాడు. బాధితుడి శరీర భాగాలను ఇంటి బయటపడేయడంతో ఆందోళనకు గురైన పొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, నిందితుడ్ని చూసి ఒక్కసారిగా హతాశులయ్యారు. ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు గురువారం మీడియాకు వెల్లడించారు. నిందితుడు జింబాబ్వేకు చెందిన వ్యక్తని తెలిపారు.

Jealous lover eats rival's heart with knife and fork in South Africa

పోలీసులు నిందితుడి ఇంట్లోకి ప్రవేశించిన సమయంలోనే నిందితుడు బాధితుడి గుండెను కత్తి, ఫోర్కుల సహాయంతో తింటున్నాడని పోలీసు ఉన్నతాధికారి ఫ్రెడరిక్ వాన్ విక్ దక్షిణాఫ్రికా టైమ్స్‌కు తెలిపారు. దీంతో నిందితుడ్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు చెప్పారు. త్వరలోనే కోర్టులో ప్రవేశ పెడతామని చెప్పారు.

ఆయన కథనం ప్రకారం.. నిందితుడు ఓ 50ఏళ్ల మహిళను ప్రేమించాడు. ఆమె మరో వ్యక్తిని ప్రేమించి అతనితోనే కేప్‌టౌన్‌లో ఉంటోంది. కాగా, వారింటికి వెళ్లిన నిందితుడు వారితో మాట కలిపాడు. అనంతరం తాము మాట్లాడుకుంటామని చెప్పి... తన ప్రియురాలుకు డబ్బులిచ్చి మద్యం తీసుకురావాలని కోరాడు. దీంతో ఆమె బయటికి వెళ్లింది.

ఆమె తిరిగివచ్చేసరికి తన ప్రియుడిని చంపేస్తున్నాడు నిందితుడు. ఆమె వారించేందుకు ఎంత అరుపులు చేసినా వినకుండా అతన్ని హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే వారు కూడా అతని వద్దకు వెళ్లేందుకు మొదట భయపడ్డారని పోలీసు అధికారి చెప్పారు. త్రిముఖ ప్రేమాయణమే ఈ హత్యకు దారితీసిందని మరో పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.

English summary
In a gruesome incident, a Zimbabwean man in South Africa stabbed his 62-year-old love rival and ate his heart with a knife and fork, police said on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X